S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహ్..ప్రియాంక!

బాలీవుడ్‌లోని సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో అందాలతార ప్రియాంక చోప్రా ఒకరు. హిందీ చిత్రసీమలో తన చిత్రాల ద్వారా, ఆమె చేసిన పాత్రల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా అమెరికన్ టీవీ సీరిస్ క్యాంటికోతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మొట్టమొదటి భారత వ్యాఖ్యాతగా రికార్డు సృష్టించారు. అంతే గాకుండా ‘బేవాచ్’ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఇలా వేసే ప్రతి అడుగు ప్రియాంక చోప్రాను ఎక్కడికో తీసుకెళుతోంది.

-సమీర్

నీతి నిజాయితీ

మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే నీతి నిజాయితీ తప్పకుండా పాటించాలి. లేదంటే మనిషి అధోగతి పాలవుతాడు. ముందుగా మనకు ఈ జన్మనిచ్చిన భగవంతునికి సదా ఋణపడి వుండాలి. మనవంతు బాధ్యతగా ఆ దేవున్ని స్మరణం, కీర్తనం, భజన రూపంలో ప్రతిక్షణం ఆరాధించాలి. అపుడే ఈ జన్మకు ఓ అర్థం పరమార్థం. ఆ తర్వాత మనకు జన్మనిచ్చిన మాతాపితరులయందు.. వారికి జన్మనిచ్చిన వారి మాతా పితరులయందు సేవాభావంతో చూస్తూ వుండాలి. తర్వాత మనకు విద్య నేర్పే గురువులయందు కృతజ్ఞతాభావం కలిగి వుండి.. వీలైతే తనదైన సేవలో జీవితాన్ని తరింపజేసుకోవాలి.

- కురువ శ్రీనివాసులు

హరివంశం 151

శ్రీకృష్ణుడు అష్టమహిహులతో, పదారువేల దివ్య కాంతలతో ద్వారకా నగరాన్ని ఇలలో దివ్యాతి దివ్య థామంగా శోభింపజేస్తుండగా ఇంద్రుడు స్వర్గలోకంలో అదితి కొండలాలు శ్రీకృష్ణుడు తెచ్చి ఇచ్చినందుకు మోదమూ, పారిజాతాన్ని పెకలించుకొనిపోయినందువల్ల శచీదేవి విచారము భావించి ఖేదమూ రెండున్ను అనుభవిస్తూ కాలం గడపసాగాడు.

-అక్కిరాజు రమాపతిరావు

యమహాపురి 60

ఇంటికొస్తే సుమిత్ర అల్లుణ్ణి తీసిపారేసేది. అతడు మామగారికి చెప్పుకుని కొంత ఊరట పొందాలనుకునేవాడు. ఆయన కర్ర విరక్కుండా పాము చావకుండా ఇరుపక్షాలనీ సమర్థిస్తూ మాట్లాడేవాడు. చిట్టచివరకు, ‘‘సుమిత్రకి మాట దురుసు కానీ మనసు మంచిది. లేకపోతే- నిన్నసలు ఇంటికి రమ్మనే అవకాశమే నాకుండేది కాదు’’ అని భార్యనే మెచ్చుకునేవాడు. కృష్ణమూర్తికి ఉక్రోషమొచ్చి భార్యకు చెప్పుకుంటే- ‘‘నాకు మీరు, మీకు నేను. మావాళ్లతో మనకు పనేమిటి?’’ అనేది శాంత.

వసుంధర

నేర్చుకుందాం

క. ‘జగతివల్లభ !యే న
త్యగణిత ధర్మస్వరూపు ఁడని జనములు దన్
బొగడఁగ జగదారాధ్యుం
దగు కణ్వ మహామునీంద్రు నాత్మజ’ ననినన్

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

అట్లాస్

అట్లాసంతా అస్తవ్యస్తంగా ఉంది
అన్ని ఖండాలు అట్టుడికిపోతున్నాయి
అన్ని ‘వాదా’లను ఐక్యవాదంతో తరమాలని
అన్ని దేశాలకు ఐ.రా.స. పిలుపునిచ్చింది
ఆఘమేఘాల మీద ఆర్భాటంగా
అందరు ప్రతినిధులు వేదిక చేరారు
అణు విస్ఫోటనాలను అంగిటిలో పెట్టుకుని
ధృతరాష్ట్ర కౌగిళ్లు పంచుకున్నారు
పరస్పర నిందారోపణల పర్వంలో
హడావుడి హుళక్కి నిర్ణయాలు
కాగితాల దొంతరల మీద కావ్యాలు రాశాయి
కసాయి కొలిమిలో అమరత్వం చెందిన చెట్టు

-శివంగరాజు శ్రీనివాసరావు 9052048706

అమరత్వం చెందిన చెట్టు

ఆ చెట్టు నీడ అమ్మ ఒడిలా ఎంత హాయి
ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా
ఎన్ని ఆనందాల వెల్లువలో ఎన్ని అనుభవాల దొంతరలో
ఆ చెట్టు పూసింది నిలువెల్లా కళలతో పూలతో
పిల్లల్లో పూయించింది చిగురు కలలు
తల్లుల్లో పూయించింది బంగారు కలలు
ప్రేమికుల్లో పుష్పింప జేసింది వేల ఆశల్ని
అందరిలో పరిమళింప జేసింది జీవన సౌరభాల్ని
ఎందరో బహుదూరపు బాటసారుల్ని-
చల్లని నీడతో తడిమింది చెట్టు
పచ్చగా ఉండాలని ఆశీర్వదించింది చెట్టు
ఎనె్నన్నో ఆశలని ఊసులని
బాసలని గుమ్ముగా దాచింది చెట్టు
జడివాన దొంగలా దాడి చేసినప్పుడు
ఎందరికో గొడుగైంది చెట్టు

-గులాబీల మల్లారెడ్డి 9440041351

గమ్యం

నాదే కులమని అడిగాడో మిత్రుడు
నాదే కులమైతే నీకేంటి
ఏ మతమైతే ఎవరికేంటి
ఎవరెటు పోతే నాకేంటని అరిచాను!

మానవత్వం కుప్పకూలుతుందనే ఆలోచన వెంటాడుతుంది
తోయబడ్డాను అగ్నిఖిలల సుడిగుండంలోకి
ఏడవడమే మిగిలింది
ఎందుకేడవాలో అర్థం కావట్లేదు ఈ కసాయిల వనంలో!

నీవు ఫలానా వాడివైతే కచ్చితంగా చాందసుడివని
ఫలానా కులమైతే కుసంస్కారివనంటున్నారే

-కృష్ణమణి

ప్రయాణం

కథల పోటీలో సాధారణ ప్రచురణకు
ఎంపికైన రచన
***

సాయరాం ఆకుండి

Pages