S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్తుపై భరోసాకే...

అమలాపురం, జూన్ 3: విభజన ఫలితంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ప్రజలకు వివరించి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సభలో యనమల ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన ఏకపక్ష విధానం, కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, విధులు వంటి అంశాలను వివరించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలపై...నేడు కేంద్ర మంత్రుల సమీక్ష

కాకినాడ, జూన్ 3: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల ప్రగతిపై జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం కేంద్ర కమ్యునికేషన్స్, ఐటి మంత్రి రవిశంకరప్రసాద్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్ సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల అధికార్లు ఈ సమీక్షకు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో 4,5 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.

మత్స్యకారుల వలకు 50 కిలోల చేప!

యు కొత్తపల్లి, జూన్ 3: ఉప్పాడ - సూర్యాపేట సముద్రతీర ప్రాంతంలో 50 కేజీల చేప మత్స్యకారుల వలకు శుక్రవారం చిక్కింది. సుమారు 7 అడుగుల పొడవున్న ఈ చేప అమోరియా అనే మత్స్యకారుడి బోటుకు పడింది. ఈ చేపను మత్స్యకారులు కుంభకోనెంగా పిలుస్తారు.
రూ.1.5 లక్షల చేపలు సీజ్

ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి కృషి

డి గన్నవరం, జూన్ 3: దళితుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం పి గన్నవరం కోకోనట్ కల్యాణ మండపంలో దళిత శక్తి అధ్యక్షుడు నేరేడుమల్లి రఘు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దళితుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దళితులకు తాను 25 ఏళ్లుగా చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారని శివాజీ అన్నారు.

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే దీక్షల నాటకాలు

కాకినాడ, జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే నవనిర్మాణ దీక్షల పేరుతో నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకుండా దీక్షలు నిర్వహించి తన వైఫల్యాలను ప్రజలపై రుద్దుతున్నారన్నారు. కేంద్రంపై రాష్ట్భ్రావృద్ధికి పోరాటం చేయకుండా ప్రతిపక్షాలను విమర్శించటమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు.

రూ 17 కోట్లతో గోదావరి కాలువ ఆధునికీకరణ

సామర్లకోట, జూన్ 3: ఈ ఏడాది రూ.17 కోట్ల వ్యయంతో బిక్కవోలు నుండి సామర్లకోట వరకూ గోదావరి కాల్వ ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సామర్లకోట గోదావరి కాల్వలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబల్ లైన్ మూడో వంతెన నిర్మాణం పనులకు శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన పూజలు అట్టహాసంగా నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, కాకినాడ ఎంపి తోట నరసింహం తదితర బృందానికి భీమేశ్వరాలయానికి చెందిన అర్చక బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

విభజనతో ఉద్యోగులకు నష్టం

కొత్తపేట, జూన్ 3: రాష్ట్ర విభజనకు ముందు ఉద్యోగస్థులు ప్రమోషన్లు పొందగా, విభజన అనంతరం రివర్షన్లు పొందుతూ నష్టాలను చవిచూడాల్సి వస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన అధికార్ల సమావేశానికి ప్రత్యేకాధికారి పి శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా జెసి సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంలు హాజరయ్యారు.

ఆత్రేయపురం చేరిన శ్రీ కాళహస్తీశ్వరుని రథయాత్ర

ఆత్రేయపురం, జూన్ 3: కాళహస్తీశ్వరుని రథయాత్ర శుక్రవారం ఆత్రేయపురం మండలం చేరుకుంది. మండలంలోని ర్యాలీ జగన్మోహిని, కేశవస్వామి ఆలయం కోనసీమ తిరుపతిగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ఆత్రేయపురం శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాల వద్ద శ్రీ కాళహస్తీశ్వరుని ఆలయాల వద్దకు రథం చేరుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయి, రామకృష్ణ, సుబ్రహ్మణ్యేశ్వరశర్మలు కాళహస్తీశ్వర స్వామి విశిష్టతను తెలియజేశారు. పలు దేవస్థానాలవద్ధ ధర్మ ప్రచార రథం ఉంచుతామన్నారు. ఈ నెల 13 వరకూ జిల్లాలోని పలు మండలాల్లో ఈ రథయాత్ర సాగుతుందని వారు తెలిపారు.

పుష్కర తొక్కిసలాటపై 10న విచారణ

రాజమహేంద్రవరం, జూన్ 3: గోదావరి పుష్కరాల తొలిరోజు పుష్కరాలరేవు వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిషన్ ఈనెల 10వ తేదీన స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో విచారణ చేపడతుందని బార్‌కౌన్సిల్ సభ్యుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలియజేశారు. ఇప్పటికే ఆయన కమిషన్ ఎదుట హాజరై, తన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇటీవల కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ కూడా ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈనెల 10న జరిగే విచారణలో ముప్పాళ్ల మరోసారి తన అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నారు.

అశాస్ర్తియ విభజన...అధిగమించేందుకు కృషి

సామర్లకోట, జూన్ 3: కొంతమంది స్వార్ధ రాజకీయాలకు లోబడి రెండేళ్ల క్రితం రాష్ట్రాన్ని చాలా అశాస్ర్తియంగా విభజన చేశారని, అందరి భాగస్వామ్యంతో నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సామర్లకోట టిటిడిసిలో శుక్రవారం మధ్యాహ్నం అశాస్ర్తియ విభజనపై ప్రత్యేక చర్చాగోష్టి సదస్సు పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకాధికారి ఆర్డీవో వి విశే్వశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు.

Pages