S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్యూట్ చేద్దాం...

శత్రువును పసిగట్టే డేగ కళ్లు..చురుకైన చూపులు..చేతిలో తుపాకులతో కాపలాకాసే జవాన్లు. ఇది ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో కనిపించే దృశ్యం. తీవ్రవాదులకు, క్రిమినల్స్‌కు ఆలవాలమైన ఈ ఓపెన్ బోర్డర్‌లో కోట్లాదిరూపాయలు విలువచేసే మాదకద్రవ్యాలు సైతం నిరంతరం రవాణా అవుతుంటాయి. సహజంగానే ఇలాంటి ప్రాంతాల్లో కనిపించే జవాన్లను పురుషులుగానే ఊహించుకుంటాం. కాని ఇక్కడ మనకు కనిపించేది మహిళా జవాన్లు. దేశంలో తొలిసారిగా‘ సశస్త్ర సీమ బాల్’ పారా మిలటరీ ఫోర్స్‌లో మహిళలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ఈ విభాగంలో శిక్షణ తీసుకున్న మహిళా జవాన్లు నేడు దేశంలో కీలకమైన ఈ సరిహద్దు ప్రాంతాలలో సేవలందిస్తున్నారు.

ఆడపిల్లలకు ఇవి చెబుతున్నారా?

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల పెంపకం కత్తిమీద సాములాంటిదేనని ప్రతి తల్లి అంగీకరించే విషయం. వారి ఎదుగుదలను గమనించటంతో పాటు వారికి జీవిత పాఠాలను కూడా తల్లే బోధించాల్సి ఉంటుంది. అందుకేనేమో బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ వారి ప్రవర్తనకు అనుగుణంగా ప్రతి తల్లి తనను తాను మలుచుకుంటోంది. తల్లి బోధించే పాఠాలే సమాజంలో ఆడపిల్లకు ఉన్నతమైన స్థానమే లభించటమే కాదు ఆత్మవిశ్వాసంతో, నిర్భయత్వంతో ముందుకు సాగుతోంది. నాలుగేళ్ల వయసు నుంచే వారికి చెప్పాల్సిన విషయాలను తల్లి విడమర్చి చెప్పాల్సి ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం...

- టి.ఆశాలత

లాయర్ పాత్రలో రవితేజ?

క్రేజీ హీరో రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత ఇప్పటివరకు మరే సినిమా చేయడం లేదు. ఇప్పటికే రెండుమూడు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్న కూడా ఇంకా ఆయన సినిమా మాత్రం సెట్స్‌పైకి తీసుకురావడం లేదు. దానికి కారణం ఈమధ్య ‘కిక్-2’ సినిమా సమయంలో రవితేజ బాగా సన్నగా కనిపించడంతో జనాలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఇప్పుడు ఆయన మళ్లీ బరువుపెంచే పనిలోపడ్డాడు. ఇప్పుడు రవితేజ ‘రాబిన్‌హుడ్’ అనే సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. అలాగే చక్రి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా కనిపిస్తాడని తెలిసింది. ఇప్పటివరకు రవితేజ లాయర్ పాత్ర చేయలేదు.

స్వచ్ఛమైన నవ్వు (కథ)

‘‘ఉత్తేజ్ సర్, మీరు కొంచెం ఫాస్ట్‌గా ఉండాలి సర్!’’ అంటూ ఉంటాడు నా కొలీగ్ ఆకాశ్.
ఆకాశ్‌కీ నాకూ అయిదేళ్ళే తేడా అయినా నేను వెనుకబడి ఉన్నాననిపిస్తుంది. గత మూడేళ్ళుగా నా దగ్గరే జూనియర్‌గా పని నేర్చుకుంటున్నాడు కాబట్టి అతని విమర్శ నా పని విషయంలో కాదు. కానీ నాకిలానే ఉండాలనిపిస్తుంది. తనకేమో అలానే ఉండటం తప్పనిసరి అనిపిస్తుంది.
‘‘మీకంటే ఒక్క సంవత్సరమే జూనియర్ కదా ఆ శ్రీకాంత్. అయినా చూడండి, ప్రమోషన్ ఎలా కొట్టేసారో!’’ అకస్మాత్తుగా ఓ రోజు ఆకాశ్ తన సందేహాన్ని అలా నా ముందుంచాడు.

-రాజేష్ యాళ్ళ రచయిత సెల్ నెం:9700467675

చిరు సినిమాలో అనుష్క లేనట్టేనా?

ఈమధ్య సీనియర్ హీరోలకు.. హీరోయిన్ల షాక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే నందమూరి బాలయ్య వందో సినిమాకు హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమాకు కూడా హీరోయిన్ సమస్యగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో హాట్‌భామ అనుష్క నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అనుష్క ఫైనల్ అయిందని కూడా తెలిసింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో ఇంకా అనుష్క ఓకే చెప్పలేదట! అంతేకాదు.. ఈ సినిమాకోసం అనుష్క డేట్స్ అడ్జెస్ట్‌చేయడం కుదరడం లేదని, అందుకనే ఈ సినిమాలో నటించే అవకాశం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో.. చిరంజీవికి అనుష్క షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది.

దుబాయ్‌లో జక్కన్న పాటలు

సునీల్ హీరోగా, మన్నార్‌చోప్రా హీరోయిన్‌గా ‘ప్రేమకథాచిత్రమ్’ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్‌లోని అందమైన లొకేషన్స్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా సాంగ్ షూటింగ్ జరుపుకుంది. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈవారంలో వైజాగ్‌లో జరిగే సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతుంది. రెండవ వారంలో ఆడియో విడుదలచేసి, జూలైలో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఆర్.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..

అవును..నిజమే.. అంటున్న సుధీర్

సుడిగాలి సుధీర్ (జబర్దస్త్ ఫేం), శ్రావణి, మనీషా ప్రధాన తారాగణంగా సత్యశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై వరసాల సత్యనారాయణ రూపొందించిన చిత్రం ‘అవును.. నిజమే’. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి దర్శకుడు గూన అప్పారావు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- హైదరాబాద్, అమలాపురం, కాకినాడ, కడియపు లంక, యానాం, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, త్వరలో ఆడియోను విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

అదరగొడుతుందా?

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలగాలనుకుని చాలా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసి, అందాలను ఆరబోసి హీరోయిన్‌గా చాన్సులు కొట్టేసింది సోనాల్ చౌహాన్. ఆ తరువాత బాలయ్య ‘లెజెండ్’ సినిమాలో చాన్స్ కొట్టేసి, ఇక్కడ బికినీలో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఆయనతో మరో సినిమా చాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా తరువాత చాలా అవకాశాలు వస్తున్నాయి కూడా. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘గ్రేట్ గ్రాండ్ మాస్తి’ అనే బి గ్రేడ్ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో టూపీస్ బికినీలో షాకిచ్చిన ఈమె చిత్రంపై గట్టి నమ్మకాలే పెట్టుకుంది. కనీసం ఈ సినిమాతో అయినా బాలీవుడ్‌లో సెటిల్ అవ్వొచ్చుగా అని.!

జైలులో గుడ్ ఈవెనింగ్

తమిళంలో విజయవంతమైన నంబేండా చిత్రాన్ని తెలుగులో గుడ్ ఈవెనింగ్ పేరుతో అనువదించారు. నయనతార, ఉదయనిధి స్టాలిన్, సంతానం కాంబినేషన్‌లో ఎ.జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భద్రకాళి ఫిలింస్ పతాకంపై భద్రకాళి ప్రసాద్ తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రం గూర్చి ప్రసాద్ మాట్లాడుతూ, కథానాయిక జైలులో వుంటే ఆ కథనం ఎలా వుంటుంది అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని, హీరోయిన్‌ను ప్రేమించిన హీరో అష్టకష్టాలుపడి ఆమెను పెళ్లికి ఒప్పిస్తే, తాను జైలు జీవితం అనుభవించానంటూ ఆమె కథ చెబితే, ఆ హీరో ఎలా స్పందించాడు అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. ఆమె జీవితంలో భయంకరమైన నిజాలు ఏంటి?

వర్మ.. శర్మ ఎవరు?

గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన తారాగణంగా బాబ్, బిందు బార్బి యువ జంటగా పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై భువన విజయ్ దర్శకత్వంలో ఫణిదుర్గప్రసాద్ రూపొందించిన చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ పూర్తిగా గోదావరి జిల్లాల ఆహ్లాదకరమైన వాతావరణంలో హాస్య ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన బాణంగా కథనం వుంటుందని తెలిపారు.

Pages