S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర సంఘటనపై రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి

న్యూదిల్లి:మధురలో జరిగిన ఘర్షణల్లో పెద్దసంఖ్యలో పౌరులు, ఇద్దరు అధికారులు మరణించిన సంఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చర్చించారు. కేంద్రంనుంచి ఎటువంటి సహాయం కావలసినా అందిస్తామని హామీ ఇచ్చారు.

మధుర ఘర్షణలో 24మంది మృతి

మధుర:ఉత్తరప్రదేశ్‌లోని ఓ పార్కులో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా ఒకవర్గానికి చెందిన ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య చెలరేగిన ఘర్షణలో 24మంది మరణించారు. మరణించినవారిలో ఎస్‌పి ముకుల్ ద్వివేది, ఓ ఎస్‌ఐతోపాటు 22మంది పౌరులు ఉన్నారు. కత్తులు, బాకులు, గ్రెనేడ్లు, రాళ్లతో ఆందోళనకారులు దాడులు చేశారు. తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డ ఎస్‌పి ముకుల్ ఆస్ప్రత్రిలో చేరాక వరుసగా మూడుసార్లు గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు సిఎం అఖిలేష్‌యాదవ్ ప్రకటించారు.

విజయసాయిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్

హైదరాబాద్:అక్రమాస్తుల కేసులో నిందితుడైన వైకాపా నేత, ఆ పార్టీ అధినేత వైఎస్‌జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఆ కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనారోగ్య కారణాలవల్ల కోర్టుకు రాలేకపోతున్నట్లు విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చి, ఆయన వైఖరిని తప్పుబట్టింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్‌పై వారెంట్ జారీ చేసింది. ఈనెల 10వ తేదీకి కేసు వాయిదావేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు మరింత బాధ్యతను పెంచాయి

కొత్తగూడెం, జూన్ 2: పారిశ్రామిక రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులు మనపై మరింత బాధ్యతను పెంచాయని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ అన్నారు. స్థానిక ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ ప్రధాన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మొదట జాతీయ పతాకాన్ని సిఎండి ఆవిష్కరించిన అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు.

కుమారుడిని అమరుడిగా గుర్తించాలంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 2: తన కుమారుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అమరుడైనా ప్రభుత్వం గుర్తించడం లేదంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళ ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్గొండ జిల్లా మునగాల మండలం రెపాల గ్రామానికి చెందిన సుగుణమ్మ తన కుమారుడు సుధాకర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని, సకలజనుల సమ్మె తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంది.

గూడూరుపాడులో సిపిఐ, టిఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ

ఖమ్మం రూరల్, జూన్ 2: మండలంలోని గూడూరుపాడు గ్రామంలో సిపిఐ, టిఆర్‌ఎస్ వర్గీయుల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. గ్రామంలో ఒకవైపున సిపిఐ వర్గీయులు పుచ్చకాయల శ్రీనివాసరావు వర్ధంతి సభను జరుపుకోగా, మరోవైపున టిఆర్‌ఎస్ వర్గీయులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు.

ఉత్తమ కార్మికులను సన్మానించిన సింగరేణి సిఎండి

కొత్తగూడెం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణిలో అంకితభావంతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్న పదిమంది ఉద్యోగులను ఉత్తమ కార్మికులుగా ఎంపిక చేసిన యాజమాన్యం స్థానిక ప్రకాశం స్టేడియంలో గురువారం జరిగిన ప్రధాన వేడుకల్లో వారిని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించింది.

సుదర్శన హోమం

భద్రాచలం, జూన్ 2: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. అనంతరం స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేసి బాలభోగం సమర్పించారు. బేల మండపంలో నిత్యకల్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. తర్వాత యాగశాలలో సుదర్శన హోమం చేశారు. సుదర్శన జపం, మంత్రం, హోమం నిర్వహించారు.
ఆదివాసీల జిల్లా సాధన దీక్షలకు సంపూర్ణ మద్దతు

అమరుల కుటుంబాలకు అండ

ఖమ్మం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఖమ్మం జిల్లా పురుడు పోసిందని, జిల్లాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలోని అభివృద్ధిలో ప్రథమ స్థానం సాధించేలా కృషి చేస్తామన్నారు. గురువారం స్థానిక పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీంతో కలిసి ఆవిష్కరించారు.

ఉత్తమ పంచాయతీయలకు ప్రోత్సాహకాలు

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అధికంగా పనులు చేపట్టే గ్రామ పంచాయితీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసిందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గత నెల 31న జీవోను విడుదల చేసిందన్నారు. జిల్లాలోని గ్రామీణ పంచాయతీలన్నీ ఈ ప్రోత్సాహలకు పోటీ పడేలా అన్ని మండలాల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ జీవో ప్రకారం ఉపాధి హామీలో ప్రతిభ కనబరిచే, లక్ష్యాలను అధిగమించే తొలి 50 పంచాయతీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు.

Pages