S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

తలమడుగు, జూన్ 3: మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలు కృషి చేస్తోందని, అందులో భాగంగానే రాయితీపై నిధులను అందిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో 21 డ్వాక్రా గ్రూప్ మహిళలకు రూ.10లక్షల 50వేల రుణాలను అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేనంత పెద్ద మొత్తంలో రుణాలను తెరాస ప్రభుత్వం అందిస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేస్తోందని అన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి

ఆదిలాబాద్ టౌన్, జూన్ 3: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శాంతినగర్‌లోని మసీద్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంధర్భంగా మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రెండేళ్ల కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సమంజసం కాదన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంతో వారు అన్ని రంగాల్లో నష్టపోవాల్సి వస్తుందన్నారు.

ఎట్టకేలకు మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం

నిర్మల్, జూన్ 3: కొన్ని నెలలుగా మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమిస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లికి చెందిన కొమ్ముల దేవేందర్‌రెడ్డిని నియమించగా, వైస్ చైర్మన్‌గా కొప్పుల శ్రీ్ధర్‌ను నియమించింది. అలాగే డైరెక్టర్లుగా ఎం.డి వౌలానా, సాద వనిత, టి.బలిరాం, కట్ల ప్రభాకర్‌రెడ్డి, ధనె నర్సయ్య, బర్మ నర్సయ్య, మంత్రి రాజ్‌గోపాల్, చిటికేశి కాశీనాథ్‌లను నియమించారు.

సామాజిక సేవలతో ప్రజలకు చేరువవుతాం

ఆదిలాబాద్, జూన్ 3: సామాజిక సేవలతో ప్రజలకు చేరువవుతూ పోలీసు సంస్కరణలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని వరంగల్ డిఐజి టి.ప్రభాకర్ రావు అన్నారు. ఇటీవలే నూతనంగా వరంగల్ రేంజ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటిసారిగా జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం పోలీసు విశ్రాంతి భవనంకు చేరుకున్నారు. ఈ సంధర్భంగా జిల్లా పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ పుష్పగుచ్చం అందించి డిఐజికి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో నేర సమాచారం తెలుసుకొనుటకు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాజ్యసభకు కెప్టెన్ ఎన్నిక ఏకగ్రీవం

హుజూరాబాద్ రూరల్, జూన్ 3: రాజ్యసభకు మాజీ మంత్రి టిఆర్‌ఎస్ నేత కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండు రోజుల క్రితం కెప్టెన్ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మే 31న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. మొత్తం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఉండడంతో కెప్టెన్‌తో పాటు డి.శ్రీనివాస్‌లకు టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో టిఆర్‌ఎస్‌కు బలం ఉండడంతో కేవలం వీరిద్దరు మాత్రమే నామినేషన్లు వేశారు. ఇతర పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.

ఎన్టీపిసి నిర్లక్ష్యంపై కుందనపల్లి లొల్లి

రామగుండం, జూన్ 3: రామగుండం ఎన్టీపిసి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత గ్రామాల సంక్షేమాన్ని విస్మరిస్తుందని కుందనపల్లి గ్రామమంతా కూడా ఎన్టీపిసిపై ‘లొల్లి’కి దిగింది. కుందనపల్లిలోని విద్యుత్ ప్రాజెక్ట్‌కు చెందిన యాష్ పాండ్ (బూడిద చెరువు) నుంచి వెలువడే విషబూడిదతో ఊరంతా కమ్ముకపోగా తాగునీరు కలుషితమవుతుందని ఊరు గర్జించింది. నిర్వాసిత గ్రామం కుందనపల్లి గ్రామస్థులు సంక్షేమం.. ఊరు అభివృద్ధి.. ఉపాధి సౌకర్యాల విషయాలపై ఎన్టీపిసి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందంటూ మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గాలి వాన బీభత్సం

కరీంనగర్ టౌన్, జూన్ 3: జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. గాలి తీవ్రస్థాయిలో వీచడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మంకమ్మతోటలోని ముత్తూట్ ఫైనాన్స్‌కు సంబంధించిన అద్దాలతో కూడిన భారీ డెకరేషన్ కుప్పకూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. రెండు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయి. ఈసమాచారం అందుకున్న కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యలు త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

బడుగుల్లో ‘జూన్’ పీవర్..!

కరీంనగర్, జూన్ 3: బడుగుల్లో జూన్ మాసం ఫీవర్ మొదలైంది. పది రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న దరిమిలా పిల్లల చదువుల ఫీజులు, సరంజామాను సమకూర్చడంపై తల్లిదండ్రులు దిగులు పడుతున్నారు. ఓ వైపు అకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న స్కూల్ ఫీజులు వెరసి సామాన్యులకు పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో జూన్ మాసం వస్తుందంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. అయినా, పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఎంతకష్టమైనా..ఎప్పటిలాగే అప్పులు చేస్తూ పిల్లలను బడులకు పంపుతూనే ఉంటారు.

4-6-2016

Pages