S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫీజుల పెంపు రద్దు చేయాలి

విశాఖపట్నం, జూన్ 2: ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కైందని సిపిఎం కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు విమర్శించారు. సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజుల పెంపును రద్దు చేసి, పాత ఫీజులనే కొనసాగించాల్సిందిగా కోరారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన సమాచారం పూర్తిగా అక్రమాలపుట్టగా పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం మొత్తం 309 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకుగాను 174 కళాశాలలకు ఏ గ్రేడు 117కి బి గ్రేడ్, 18కి సి గ్రేడ్ కేటాయించారన్నారు. ఇప్పటి వరకు ఉన్న డిగ్రేడ్‌ను తొలగించారన్నారు.

ఎయు పాలకమండలి సమావేశానికి ఏర్పాట్లు

విశాఖపట్నం, జూన్ 2: ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశాన్ని నిర్వహించే అంశంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎయు బడ్జెట్ సమావేశం తరువాత జూన్ నెలాఖరులోగా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రతిపాదించారు. తేదీ నిర్ణయం, అజెండా అంశాల ఖరారు తదితర అంశాలపై కొంతమంది పాలక మండలి సభ్యులు గురువారం రిజిస్ట్రార్ ఉమా మాహేశ్వరరావుతో సమావేశమయ్యారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలపై చర్చించారని తెలిసింది.

కొనసాగుతున్న ఆసెట్ ప్రవేశాల కౌనె్సలింగ్

విశాఖపట్నం, జూన్ 2: ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పిజి కోర్సులు, ఎయు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆరేళ్ళ సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆసెట్, ఆఈట్ 2016 ప్రవేశ పరీక్షల కౌనె్సలింగ్ రెండవ రోజు కొనసాగింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 900 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సాయంత్రం వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుని తమ సర్ట్ఫికెట్ల పరిశీలన జరిపించుకున్నారు. మొదటి రోజు ఎయు క్యాంపస్‌లోని కౌనె్సలింగ్ కేంద్రానికి 75 మంది విద్యార్థులు హాజరై సర్ట్ఫికెట్ల పరిశీలన జరిపించుకున్నారు.

ఐఐపిఇ ప్రారంభానికి తుది ఏర్పాట్లు

విశాఖపట్నం, జూన్ 2: ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) ప్రారంభానికి తుది ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఈ పెట్రోలియం వర్సిటీని తాత్కాలికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు సబ్బవరం వద్ద ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. కానీ అక్కడ పూర్తి స్థాయిలో భవనాలు తదితర సౌకర్యాలు కల్పించేందుకు కొంత సమయం పడుతుందని భావించి తాత్కాలికంగా ఎయులో ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.

ప్రత్యేక హోదా... ప్రజల ఆకాంక్ష

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్ర విభజన వల్ల బాధపడటం కన్నా కసి, పట్టుదలతో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. నవ నిర్మాణ దీక్షను గురువారం ఇక్కడి ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద నిర్వహించారు. అక్కడ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రాన్ని విభజించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. విభజన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుందన్నారు.

అటవీ భూములపై పె(గ)ద్దల కన్ను!

రాజమహేంద్రవరం, జూన్ 2: జిల్లాలో కోట్ల విలువజేసే అటవీ భూమిపై కొంతమంది పెద్దల కన్నుపడింది. రాజమహేంద్రవరానికి అతి సమీపంలోని రాజానగరం మండలం దివాన్ చెరువువద్ద 16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూమిని కాజేయడానికి ఈ పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ భూమిని ఏదోవిధంగా తన్నుకుపోయేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి అటవీ శాఖాధికార్లు తమ వంతు కృషిచేస్తున్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు పెట్రోలు బంకు నుండి 16వ నెంబరు జాతీయ రహదారి వెంబడి సుమారు 250 హెక్టార్ల అటవీ భూమి ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 15 కిలోమీటర్ల వెడల్పున లోపలికి ఈ భూమి ఉంది.

నవ నిర్మాణ దీక్షలో బాహాబాహీ

కొత్తపేట, జూన్ 2: కొత్తపేటలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం గురువారం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వంపై, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై సభలో విమర్శలు చేయటంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. తొలుత నవ నిర్మాణ దీక్షా సభ ప్రత్యేకాధికారి శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిధులుగా ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావులు పాల్గొన్నారు.

కాకినాడ రోడ్డులో లోడు లారీ బోల్తా

సామర్లకోట, జూన్ 2: ఇటీవల కాకినాడ రోడ్డులో పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా తవ్విన భారీ పైపులైన్ల గోతుల పూడికలో సంబంధిత వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాత్రివేళల్లో అవి భారీ వాహనదారులకు పెనుశాపంగా మారాయి. తరచూ ఈ గోతుల్లో పడి భారీ వాహనాలు బోల్తాపడుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కాకినాడ నుండి భద్రాచలం అట్టల చెత్త లోడుతో వెళుతున్న లారీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో డ్రైవర్‌కు సరిగా కనిపించకపోవడంతో ఈ పైపులైన్ తవ్విన ప్రాంతంమీదుగా నడపడంతో లోడు లారీ ఒక్కసారిగా బోల్తాపడింది. డ్రైవర్, క్లీనర్‌లు స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలిసింది.

కేంద్ర సాయం తక్కువే!

రాజమహేంద్రవరం, జూన్ 2: రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం తక్కువగానే ఉందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని కోరారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా స్థానిక పుష్కరాలరేవు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విభజన సందర్భంగా ఎపికి సరైన న్యాయం చేయకపోవడం వల్లే యుపిఏ ప్రభుత్వం డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు.

పేదరికం లేని సమాజమే లక్ష్యం

కాకినాడ, జూన్ 2: పేదరికం లేని సమాజమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని బాలాజీ చెరువు జంక్షన్‌లో గురువారం నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీక్షకు ముందు కలెక్టర్ కార్యాలయం నుండి బాలాజీ చెరువు జంక్షన్ వరకు నవ నిర్మాణ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

Pages