S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్విభాషా చిత్రంగా ఫుల్‌మూన్

హర్షకుమార్, డాలీశర్మ, నదీమ్ భార్గవ్ ప్రధాన తారాగణంగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ పతాకంపై దీపక్ బలదేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ రూపొందించిన చిత్రం ఫుల్‌మూన్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బల్‌దేవ్ మాట్లాడుతూ, యువతకు నిండుచంద్రుడు అంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టం వారి జీవితాలలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది అనే కథనంతో ‘బ్యాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్’ అన్న పాయింట్‌తో ఈ చిత్రాన్ని సంగీతభరిత చిత్రంగా రూపొందించామని తెలిపారు.

అరకు రోడ్డులో సరికొత్త అందం

రాంశంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో నక్కా రామేశ్వరి, మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ ఇందుకూరి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు సరికొత్తగా వుంటాయని, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. పూర్తి యాక్షన్ తరహాలో సాగే థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో తన పాత్ర బాగా వుందని, షూటింగ్ సమయంలో కథనం చూసి ఆశ్చర్యపోయానని కథానాయిక నికిషా పటేల్ తెలిపారు.

కార్పొరేటర్‌కు గాయాలు

విజయవాడ:తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌కు వ్యతిరేకంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసిన సంఘటనలో అపశ్రుతి కలిగింది. దిష్టిబొమ్మను తగలబెడుతూండగా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ సత్తా దేశానికి తెలియాలి :కెసిఆర్

హైదరాబాద్:తెలంగాణ సత్తా ఏమిటో దేశానికి తెలియాలని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మన నీళ్లు మనమే వాడుకోగలుగుతున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరామ్ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వరప్రదాయని అన్నారు. ఉపఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించామని, ఏపీ సరిహద్దుల్లో ఉన్న పాలేరులోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టంగట్టారని, తెలంగాణ సమాజంలో రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ ఫలితాలు చెబుతున్నాయని ఆయన అన్నారు.

తమిళనాడులో 14మంది దుర్మరణం

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని మేలుమళై ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో 14మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. కర్నాటకకు చెందిన వీరంతా ఓ ప్రైవేటు బస్సులో వెళుతూండగా లారీ ఢీకొట్టింది. దుర్ఘటన స్థలంలోనే 12మంది మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో పదిహేనుమందికి గాయాలయ్యాయి.

రెండు విడతలుగా ఉద్యోగుల తరలింపు

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సచివాలయ ఉద్యోగులంతా కొత్త రాజధాని అమరావతికి తరలిపోవాలన్న విషయంపై ఉద్యోగుల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్‌ను కలసి వినతిప్రతం సమర్పించారు. ఉద్యోగులను రెండు విడతలుగా తరలించాలని కోరారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్నవారిని వెంటనే తరలించాలని, మిగతావారిని అక్కడ పూర్తి వౌలిక సదుపాయాలు పూర్తయ్యాక తరలించాలని కోరారు. ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వం రోడ్‌మాప్ ఏమిటో తెలపాలని వారు కోరారు.

హైదారాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్:హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఎల్‌బినగర్, హయత్‌నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో మధ్యాహ్నం నాలుగు గంటలనుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీవర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.:

గ్రీస్‌లో శరణార్థులు గల్లంతు

జెనీవా:700మంది శరణార్థులతో వెడుతున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయింది. వందలాదిమంది నీళ్లలో మునిగిపోయారు. ముగ్గురు అప్పటికప్పుడే మరణించారు. 300మందిని సహాయబృందాలు రక్షించాయి. మిగతావారికోసం గాలిస్తున్నారు. గ్రీసు ప్రభుత్వం పంపిన నాలుగు ఓడలు, రెండు హెలికాప్టర్లసహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా ఎవరన్నది ఇంకా తేలలేదు.

హరీశ్ నేతృత్వంలో ఢిల్లీకి బృందం

హైదరాబాద్:గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి ఆయా ప్రాజెక్టులపై ఏపీనుంచి వస్తున్న అభ్యంతరాలను గట్టిగా ఎదరించాలని నిర్ణయించింది. ఈ విషయంలో తన వాటాను రాబట్టుకోడానికి, తమ వాదనను గట్టిగా విన్పించడానికి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ నేతృత్వంతో రాజధానికి ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఓ బృందం వెళ్లాలని అభిప్రాయపడింది.

ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా:సురేశ్‌ప్రభు

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు హామీ ఇచ్చారు. శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఎన్నికకు సహకరించిన తెలుగుదేశం పార్టీ అధినేతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

సమస్యలు ప్రస్తావిస్తా: టిజి

ఏపీ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావిస్తానని టిజివెంకటేష్ అన్నారు. రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తరువాత ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాజ్యసభలో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు.

Pages