S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వాహనం సీజ్

శివ్వంపేట, జూన్ 3: ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఎలాంటి అనుమతి లేకుండా రైతులను నకిలీ విత్తనాలు విక్రయిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్న సంఘటన శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

వేతనాల కోసం అపెక్స్ పరిశ్రమ కార్మికుల నిరసన

జిన్నారం, జూన్ 3: రెండు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని అపెక్స్ పరిశ్రమ కార్మికులు నిరసనకు దిగారు. శుక్రవారం కార్మికుడు బాయిలర్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలపడంతో స్పందించిన బొల్లారం పోలీసులు ఘటనా స్దలానికి చేరుకున్నారు. ఎస్‌ఐ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకుడు అనీల్‌రెడ్డిలు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. సోమవారం వరకు స్పందిస్తుందని యాజమాన్యం హామీ నివ్వడంతో కార్మికులు క్రిందకు దిగారు. సమస్యను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకుడు అనీల్‌రెడ్డి కోరారు.

ఆకట్టుకున్న ఛాయాచిత్ర ప్రదర్శన

మెదక్, జూన్ 3: మెదక్ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శన శుక్రవారం కూడా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురష్కరించుకొని మెదక్ పిఆర్‌ఓ మంగ నాగభూషనంగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఘణపురం ఆనకట్ట కుడి, ఎడమ కాలువల ఆధునీకరణకు శంకుస్థాపన చేసిన చిత్రాలు కూడా ఏర్పాటు చేశారు.

కేంద్ర పథకాలపై ప్రచారంతో పార్టీ అభివృద్ధి

కోదాడ, జూన్ 3: నరేంద్రమోది నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి బిజెపి శ్రేణులు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమార్ పిలుపునిచ్చారు. కోదాడ వాసవీభవన్‌లో శుక్రవారం జరిగిన నియోజకవర్గస్ధాయి బిజెపి ముఖ్యకార్యకర్తల సమావేశానికి అసెంబ్లీ కన్వీనర్ యాదా రమేష్ అద్యక్షత వహించారు.

కాంగ్రెస్ సీనియర్లు పరస్పర విమర్శలు మానాలి

నల్లగొండ, జూన్ 3: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పరస్పరం విమర్శలు మానుకుని హుందాగా వ్యవహారించి పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాలని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సిఎల్పీ నేత కె.జానారెడ్డి ఐదు రూపాయల భోజనం బాగుందంటు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓటమికి దారితీశాయంటు కాంగ్రెస్ మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ తాజాగా మరోసారి విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

కేసుల సత్వర పరిష్కారం దిశగా పనిచేయాలి

చిట్యాల, జూన్ 3: సమస్యలు ఇబ్బందులు ప్రమాదాలకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కారం జరిగేలా ఎస్‌ఐలు, సిబ్బంది ఆదిశగా పనిచేయాలని జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక స్టేషన్, సిబ్బంది, మండలానికి సంబంధించిన వివరాలను చౌటుప్పల్ రూరల్ సిఐ శివరాంరెడ్డి, స్థానిక ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ తగాదాలు సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు.

గాలివాన బీభత్సం

చౌటుప్పల్, జూన్ 3: చౌటుప్పల్ మండలంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పది నిమిషాలు ప్రజలను అతలాకుతలం చేసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. కోళ్ల ఫారాల పైకప్పులు ఎగిరిపోయి తీవ్రమైన నష్టం ఏర్పడింది. చెట్లు విరిగిపడ్డాయి. వ్యవసాయ బావుల వద్ద పశువుల కొట్టాలు కూలిపోయాయి. గడ్డివాములు లేచిపోయాయి. ఉదయం నుంచి ఉక్కపోత తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత మేఘాలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున వర్షం వస్తుందన్న వాతావరణం ఏర్పడింది. అంతలోనే విపరీతమైన గాలి ప్రారంభమై అతలాకుతలం చేసింది.

కాలేజీల సమాయత్తమవుతున్న ఎంజియు అధికారులు

రామగిరి, జూన్ 3: జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పని చేస్తున్న 28విద్యా కళాశాలలపై వార్షిక తనిఖీలు ఈనెల 3వ వారం నుండి ప్రారంభం కానున్నాయి. ఎంజియు పరిధిలోని కళాశాలల్లో తనిఖీలు నిర్వహించడానికి అధికారులు సమాయత్తవౌతున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుండి బిఈడి కోర్సును రెండేళ్ల కోర్సుగా మారుస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం విదితమే. ఆ మేరకు ఒక విద్యా సంవత్సరం పూర్తయ్యంది. అయితే ఈసారి బిఈడి కళాశాలల తనిఖీలు గతంలో మాదిరిగా ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రంలోనూ పునరావాసం కోసం ’మాజీ‘ల పడిగాపులు!

నిజామాబాద్, జూన్ 3: గత దశాబ్ద కాలం క్రితం వరకు కూడా నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల జాబితాలో ముందువరుసలో నిలుస్తూ వచ్చిన నిజామాబాద్ జిల్లాలో మాజీ నక్సలైట్లు దైన్య స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నారు. సర్కారు పిలుపునందుకుని జనజీవన స్రవంతిలో కలిసినా, ప్రభుత్వం తరఫున ఎలాంటి తోడ్పాటు లభించక వందలాది మంది ఉపాధి అనే్వషణలోనే కాలం వెళ్లదీస్తూ చిక్కిశల్యమవుతున్నారు. ‘లొంగుబాట’ను ఎంచుకుని సంవత్సరాల కాలం గడుస్తున్నా, సర్కారు సాయం కరువవడంతో తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ అనునిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పాఠశాలల్లో బయోమెట్రిక్

ఇందూర్, జూన్ 3: ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని మానిటరింగ్ చేసేందుకు ప్రతి జిల్లాలోని జిల్లాలో 25శాతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు పద్దతిని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Pages