S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్..?

బోధన్, జూన్ 3:కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుండటంతో కొత్త మండలాలతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్‌లు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పదమూడు మండలాలతో కొనసాగుతున్న బోధన్ డివిజన్ ఏడు లేదా ఎనిమిది మండలాలకే పరిమితం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలాలు గనుక పెరిగితే కొత్తగా బాన్సువాడ కూడా డివిజన్‌గా ఏర్పాటయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బోధన్ డివిజన్‌ను బాన్సువాడకు మారుస్తారని కొంతకాలం నుండి ప్రచారం జరుగుతున్న సంగతి విధితమే.

ఎస్పీ ఆదేశాలతో అధికారుల్లో దడ..?

బోధన్, జూన్ 3:విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు..ప్రతిరోజు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి...ఆటోవాలాల ఆగడాలపై కఠినంగా వ్యవహరించాలి అంటూ విధులలో చేరిన రెండవ రోజునే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో మునుముందు ఎటువంటి పరిస్థితులు ఉంటాయోనన్న ఆందోళన క్షేత్ర స్థాయి అధికారులలో మొదలయ్యింది. ఇందుకోసం ఠాణాల వారీగా అధికారులు నిర్లక్ష్యం బయట పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు అధికారులు పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో నిమగ్నమయ్యారు. డివిజన్ కేంద్రమైన బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్‌హెచ్‌వో ఠాణాలో మారిన పరిస్థితులే ఇందుకు అద్ధం పడుతున్నాయి.

జంట హత్యల కేసును సిబిసిఐడికి అప్పగించాలి

ఇందూర్, జూన్ 3: ఎడపల్లి మండలం జానకంపేట్ దర్గాలో 2014 ఏప్రిల్ 22వ తేదీ అర్ధరాత్రి జరిగిన భార్యభర్తల దారుణ హత్య కేసును సిబిసిఐడికి అప్పగించి, నిందితులను గుర్తించేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతూ ఇండియన్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్పీ విశ్వప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు ఎంఎ.ముఖీద్ ఫారూఖీ మాట్లాడుతూ, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన సయ్యద్ దావూద్‌అలీ, సయ్యద్ రిహానాబేగంలు దర్గాలో ముజావర్లుగా భక్తులకు సేవలందించేవారన్నారు.

15లోగా దరఖాస్తు చేసుకోవాలి

ఇందూర్, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన 2014 జూన్ 2వ తేదీ లోపు సాదాబైనామీల ద్వారా కొనుగోలు చేసిన భూములను ఉచితంగా రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు ఈ నెల 15లోగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సన్న, మధ్యతరహా రైతులు సాదాబైనామీల ద్వారా కొనుగోలు చేసిన ఐదు ఎకరాల వరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 153ను విడుదల చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ భూములకు మాత్రమే సాదాబైనామీల ఉచిత రెగ్యులరైజేషన్ నిబంధనలు వర్తిస్తాయని అన్నారు.

7నుండి జిల్లాలో 3వ విడత ఇంద్రధనుష్

ఆదిలాబాద్, జూన్ 3: ఏడవ తేదీ నుండి జిల్లాలో నిర్వహించే మూడవ విడత ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్కరు మిగిలి పోకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో మూడవ విడత ఇంద్రధనస్సు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

మినీ ట్యాంక్‌బండ్‌గా ధర్మసాగర్ చెరువు

నిర్మల్, జూన్ 3: ఎట్టకేలకు నిర్మల్ పట్టణ వాసుల ‘కల’ నెరవేరనుంది. పట్టణ నడి ఒడ్డున బస్టాండ్‌కు అత్యంత సమీపంలోనే ఉన్న ధర్మసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. ఈ చెరువులో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ది చేసేందుకు రూ.17 కోట్లతో తయారుచేసిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం ఈ పనులను ఆమోదించగానే టెండర్లు నిర్వహిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చెరువులో బోటింగ్ పాయింట్‌తోపాటు పార్కు, కట్ట వెడల్పు పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

కార్మికులకు ఇచ్చిన వాక్ధానాలను నిలబెట్టుకోవాలి

శ్రీరాంపూర్ రూరల్, జూన్ 3: సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాక్ధానాలను రాష్ట్ర ముఖ్య మంత్రి కేసి ఆర్ నిలబెట్టుకోవాలని హెచ్‌మ్మెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని సిసిసి సిహెచ్‌పి కార్మికులను కలుసుకుని మాట్లాడారు. సింగరేనిలో కార్మికులకు భద్రత కరువైయిందని,గెలించిన గుర్తింపు కార్మిక సంఘం కార్మిక సమస్యలను కేసి ఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైయ్యారని అన్నారు.

ఇంకిపోయిన చెరువులు - వాగులు

వాంకిడి, జూన్ 3: మండలంలో ఏర్పడిన కరువువల్ల చిన్నచిన్న వాగులు, వంకలతోపాటు, చెరువులు ఇంకిపోయి పలు గ్రామాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడడంతో మండల ప్రజలు నీటి కోసం పడరాని తిప్పలుపడతున్నారు. ఇదిలా ఉండగా, మండలం చుట్టుపక్కల అడవుల్లో సైతం ఈ సంవత్సరం జంతువులకు తాగడానికి నీరు లభించక అనేక అడవి జంతువులు గ్రామాల్లో చుక్క నీటికోసం వచ్చి జనం చేతిలో బలవుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణతోపాటు వాటికి తాగు నీటి కోసం అడువుల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు చేపట్టకపోవడమే దీనికి కారణమని మండల వాసులు ఆరోపిస్తున్నారు.

ఉద్యమకారులనే సన్మానించాం

మంచిర్యాల, జూన్ 3: తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి జైలు పాలైన ఉద్యమకారులనే సన్మానించామని, లేనిపోని ఆరోపణలు చేయడం మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అవివేకానికి నిదర్శనమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచావన్నారు. ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఏ పనీ చేయలేదన్నారు. పట్టణంలోని భూదాన యజ్ఞ భూములను రియల్టర్లు కబ్జా చేస్తే నిద్రపోయావా అని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమిగా గుర్తించి స్వాదీనపరుచుకున్నామని తెలిపారు.

నేడు డిప్యూటీ సిఎం మహమూద్ అలీ జిల్లా పర్యటన

ఆదిలాబాద్, జూన్ 3: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ జిల్లా మంత్రులతో కలిసి శనివారం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ జగన్మోహన్ తెలిపారు. డిప్యూటి సిఎం ఉదయం 10.30 గంటలకు నిర్మల్ చేరుకుంటారని, 11 గంటలకు నిర్మల్‌లో వౌలాలు, ఇమామ్‌లకు గౌరవ వేతనం కింద చెక్కుల పంపిణీ చేస్తారని అన్నారు. తిరిగి మధ్యాహ్నం నిర్మల్ నుండి 3.15కు ఆదిలాబాద్ చేరుకొని ఇమామ్, వౌజాంలకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటి సిఎం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు జిల్లా అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారని కలెక్టర్ వివరించారు.

Pages