S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయం విడగొడితే... భాష మళ్ళీ కలుపుతుంది

విజయవాడ (బెంజిసర్కిల్), మే 31: రాజకీయాలు మనుషులను, ప్రాంతాలను విడగొడితే, భాష ఒక్కటే అందరినీ కలుపుతుందని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగు భాషా ప్రాబల్యం తగ్గుతున్న తరణంలో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్‌టిఆర్ ట్రస్ట్ సంయుక్తంగా మంగళవారం నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో తెలుగుభాషా సాంస్కృతిక సమ్మేళనం, మండలి బుద్ధప్రసాద్ షష్ఠిపూర్తి మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు.

జంక్షన్‌లో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

హనుమాన్ జంక్షన్, మే 31:మంగళవారం హనుమంతుని జన్మదినోత్సవం సందర్భంగా హనుమాన్ జంక్షన్‌లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్యదైవం స్థానిక అభయాంజనేయుని దేవస్థానంలో విశేషపూజలు జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు దర్శనాన్ని కొనసాగించారు. స్వామివారిని 40,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెవిఆర్ నాగేశ్వరరావు తెలిపారు. స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు శాస్రోక్తంగా నిర్వహించారు.

తెలుగు భాషకు పూర్వ వైభవం

విజయవాడ (కల్చరల్), మే 31: తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన సమయంలో తెలుగుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరూ ఉద్యమంలో మంచి స్ఫూర్తితో కృషి చేయాలని తెలుగు భాషా ప్రేమికులు, కవులు, సాహితీ వేత్తలు అభిలషించారు. అధునిక పోకడలు సమాజాన్ని శాసిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష అవశ్యకతను, ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బాధ్యతను ప్రభుత్వంతో పాటు అందరూ తీసుకోవాలని, ముఖ్యంగా ఈ విషయంలో యువత ముందుండి నడిపించాలని వారు సూచించారు.

పుష్కర సేవల్లో పునీతులుకండి

విజయవాడ, మే 31: పుష్కరాల్లో యాత్రికులకు అన్న ప్రసాద వితరణ, వాలంటరీ సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇస్కాన్, రామకృష్ణా మిషన్, ప్రేమ్ సాయి, ఆర్యవైశ్య, లయన్స్ క్లబ్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి, విశ్వహిందూ పరిషత్, భారత వికాస్ పరిషత్, అక్షయపాత్ర ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

పూర్తి స్థాయిలో రెవెన్యూ సేవలు

విజయవాడ, మే 31: రాష్ట్రంలో రెవెన్యూ సర్వీసులను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు సిసిఎల్‌ఎ కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి మంగళవారం జిల్లాలోని జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డివోలు రెవెన్యూ యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగ్ పిటిషన్లను, ముఖ్యమంత్రి కార్యాలయ గ్రీవెన్స్ జన్మభూమి పిటిషన్ల ప్రగతిని సమీక్షించారు. భూ సంబంధ ఫిర్యాదుల పరిష్కారంలో సివిల్ కోర్టు కేసులు మినహా మిగిలిన అన్ని ఫిర్యాదులను జూన్ 15కల్లా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేసారు.

భద్రతతో పాటు.. ఆర్థిక అసరాకూ భరోసా ఇవ్వాలి

విజయవాడ (క్రైం), మే 31: కాల్‌మనీ.. ఒకప్పుడు ఊసే లేని మాట.. ఇప్పుడు రాష్టవ్య్రాప్తంగా చర్చ లేవనెత్తిన పదం.. ఎంతోమంది అబలలు అవసరాల కోసం అప్పులు చేసి.. అధిక వడ్డీలు చెల్లించడమే కాక.. ఆస్తులు సైతం వదులుకోవాల్సిన దుస్థితి.. ఇంకా చెప్పాలంటే ప్రాణాలే కాదు, తమ మానాలు సైతం పణంగా పెట్టాల్సిన దౌర్భాగ్యం.. మరి ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్న కాల్ నాగుల భరతం పట్టేందుకు నడుం బిగించిన పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ప్రయత్నాన్ని సమాజం మెచ్చుకుంటోంది. కాల్‌మనీ వ్యాపారులకు హెచ్చరికలిస్తున్న పోలీసు చర్యలకు చప్పట్లు కొట్టింది..

దేవాదాయ కౌలు రైతుల ధర్నా

గుంటూరు, మే 31: రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో దేవాదాయ భూములు కోల్పోయిన కౌలురైతులకు కూడా ప్రభుత్వం కౌలు చెల్లింపుతో పాటు, భూ సమీకరణ ప్యాకేజీని అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ఈ విషయమై కౌలురైతులు ధర్నా నిర్వహించారు. మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో గత కొనే్నళ్లుగా దేవాదాయ భూములను కౌలుకు తీసుకుని ఎక్కువ మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. భూ సమీకరణలో భాగంగా ప్రభుత్వం దేవస్థానం భూములను స్వాధీన పర్చుకోవడంతో కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

కాల్‌మనీ బాధితులకు న్యాయం చేస్తాం

విజయవాడ (క్రైం), మే 31: రాష్ట్రాన్ని పట్టి కుదిపేసిన కాల్‌మనీ ఉదంతం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతోమంది బాధితులకు న్యాయం చేశామన్న సంతృప్తి ఉందని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అన్నారు. నష్టపోయిన వారికి భద్రతే కాకుండా చట్టపరిధిలో వారికి న్యాయం చేసేందుకే పోలీసు శాఖ కృషి చేస్తుందని, దీంతోపాటు సంస్కరణలకు సంబంధించి మరిన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాల్‌మనీ - స్థితిగతులు అంశంపై నగర పోలీసు శాఖ ఆధ్వర్యాన మంగళవారం ఎ-వన్ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వర్క్‌షాపులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సుకు సమాజంలోని అన్ని వర్గాలు హాజరయ్యారు.

కదం తొక్కిన కర్షకులు

కర్నూలు, మే 31 : సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నీరుగార్చాలన్న లక్ష్యంతో పోలీసు బలగాలను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్తనదుల సంగమేశ్వరం వద్ద మంగళవారం రాయలసీమ రైతు సంఘం, సిద్ధేశ్వరం అలుగు సాధన సమితి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం అలుగు కోసం చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 15వేల మంది రైతులు సంగమేశ్వరం వద్దకు చేరుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అండ లేకపోయినా కేవలం రైతు సంఘాల పిలుపునకు స్పందించి రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.

ట్రావెల్స్ దగా!

ఖమ్మం, మే 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 65మంది ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజన్సీ ద్వారా నేపాల్, మానస సరోవర్ యాత్రకు వెళ్ళగా, వారిని ట్రావెల్స్ యజమాన్యం అక్కడే వదిలేయటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాకు చెందిన తొమ్మిది మందితో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారంతా కలిసి హైదరాబాద్‌కు చెందిన ఒక ట్రావెల్ ఏజన్సీ ద్వారా యాత్రకు వెళ్ళారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 2లక్షల రూపాయలు తీసుకున్న సదరు యజమాన్యం ఖాట్మండ్ సరిహద్దులో వారిని వదిలేసింది. యాత్రికుల వెంట ఉన్న ట్రావెల్స్‌కు చెందిన రమణ అనే ఉద్యోగి ఆ ప్రాంతం నుంచి కన్పించకుండా వెళ్ళాడు.

Pages