S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిలీ డీడీల కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు

కదిరి టౌన్, మే 31 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నకిలీ డీడీల కుంభకోణంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు ఏడేళ్లు, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్‌తో పాటు మరో ఆరుగురికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు..

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో 50వేల కోట్ల అదనపు వ్యయం

వరంగల్, మే 31: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ఖర్చుపెడుతోందని, ఇప్పటి వరకు ప్రాజెక్టులకు 38 వేల కోట్ల ఖర్చు అవసరం ఉండగా రీడిజైన్ పేరుతో మరో 50 వేల కోట్లు అధికంగా ఖర్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు రీడిజైన్ చేస్తే వ్యయం తగ్గాలే కానీ వేల కోట్ల వ్యయం ఎలా పెరుగుతుందని అన్నారు. రీడిజైనింగ్ పేరుతో కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మిస్తే రేపు ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కాల్‌మనీ దందాను కూకటివేళ్లతో పెకలించాలి

విజయవాడ, మే 31: దశాబ్దాల తరబడి వడ్డీ వ్యాపారాలు జరుగుతుండటం చూశాం కానీ కాల్‌మనీ ముసుగులో మహిళలపై వేధింపులే గాక అరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతున్న కాల్‌మనీ దందాను కూకటివేళ్లతో పెకిలించాలి.. బాధితులకు అన్ని వర్గాలు బాసటగా నిలవాలి.. పేదలు విద్య, వైద్యం వంటి అత్యవసరాల కోసం కాల్‌మనీదారుల వద్దకు వెళ్లకుండా జాతీయ బ్యాంకులు అండగా నిలవాలంటూ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ అధ్యక్షతన తొలిసారిగా ‘కాల్‌మనీ వ్యవహారం’పై మంగళవారం నాడిక్కడ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగిన ఓపెన్ హౌస్‌లో పాల్గొన్న పలు వర్గాల ప్రతినిధులు ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నేటి నుంచి జగన్ రైతు భరోసా యాత్ర

అనంతపురం, మే 31 : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదవ విడతగా బుధవారం నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అందులో భాగంగా తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించి ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. తొలిరోజు ఆయన అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డికి కంచుకోట అయిన పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.

ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

వినాయక్‌నగర్, మే 31: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తూ, భవిష్యత్‌లో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జడ్పీ చైర్మన్ దాఫేదార్ రాజు పిలుపునిచ్చారు. ఇటీవల వెల్లడైన 10వ తరగతి ఫలితాల్లో 10జిపిఎ పాయింట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో మంగళవారం టిఎస్.పిఆర్‌టియు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పల్లెల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

మాక్లూర్, మే 31: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే టిఆర్‌ఎస్ లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పల్లెపల్లెలో గడపగడపకు రక్షిత తాగునీరు, గల్లిగల్లీలో సిసిరోడ్లు, సిసి డ్రైనేజీల నిర్మాణ పనులను శరవేగంగా జరిపిస్తున్నామన్నారు. మంగళవారం మాక్లూర్ మండలం మదన్‌పల్లితండా, అమ్రాద్‌తండా, సట్లాపూర్‌తండా, మానిక్‌బండార్‌తండా, మాక్లూర్, ధర్మారం, మామిడిపల్లి, గుత్ప గ్రామాల్లో చేపట్టిన సిసిరోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

ఇసుక అక్రమ రవాణా

నిజామాబాద్, మే 31: వరుస వర్షాభావం వెంటాడుతూ భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయిన ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం టిఎస్‌ఎండిసి పర్యవేక్షణలో ప్రవేశపెట్టిన పాలసీతో అక్రమార్కుల చెక్ పడుతుందని భావించగా, అలాంటిదేమీ జరగడం లేదు. పైపెచ్చు టిఎస్‌ఎండిసి క్షేత్ర స్థాయిలో నియమించిన అధికారులు, సిబ్బంది తోడ్పాటుతోనే వివిధ క్వారీల నుండి పెద్ద ఎత్తున ఇసుక పక్కదారి పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రామభక్త హనుమాన్‌కీ జై!

నల్లగొండ టౌన్, రామగిరి, మే 31: పట్టణంలోని ఆయా దేవాలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆర్‌పి రోడ్డులోని తులసి నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, హైద్రాబాద్ రోడ్డులోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం, రామాలయం, పాత బజార్‌లోగల భక్తాంజనేయ సహిత సంతోషిమాత ఆలయాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సుప్రభాత సేవ, దీపారాదన, గణపతి పూజ, పుణ్యావాచనం, నవగ్రహ ఆరాధన, అర్చనలు, 108 కలశాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, విష్ణు సహస్రనామ ఆకుపూజ, మూలమంత్ర హోమములు తదితర ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు.

పిలాయిపల్లి కాలువ పనులు వారం రోజుల్లో పూర్తి చేయిస్తా

చౌటుప్పల్, మే 31: వారం రోజుల్లో పిలాయిపల్లి కాలువ అసంపూర్తి పనులను పూర్తి చేయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. పిలాయిపల్లి నుంచి పెద్దకొండూరు వరకు పిలాయిపల్లి కాలువ పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. కాలువ అసంపూర్తిగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. కాలువ వెంట అడ్డుగా ఉన్న బండరాళ్లు, మట్టిగడ్డలను తొలగించకుండా ఏమి చేస్తున్నారని నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి పనులు అక్కడే ఉంటే పూర్తి జరిగేది ఎప్పుడని నిలదీశారు. ఎక్కువ యంత్రాలను ఏర్పాటు చేసి వారం రోజుల్లో పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు.

మైనార్టీ బాలికల పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పూర్తి

మిర్యాలగూడ టౌన్, మే 31: మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనార్టి ఆశ్రమ బాలికల పాఠశాలలో 5, 6, 7 తరగతులకు వచ్చిన దరఖాస్తు దారులను డ్రా ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను డిప్యూటి డిఇఓ డి.పాండునాయక్, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంఇఓ చంప్లానాయక్‌లు మంగళవారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టి ముస్లింలు పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Pages