S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ తత్వవేత్తల దినోత్సవంగా ఆదిశంకరుడి జయంతి?

న్యూఢిల్లీ, మే 30: ఆదిశంకరాచార్యుల జయంతి రోజైన మే 11న జాతీయ తత్వవేత్తల దినోత్సవంగా పాటించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఎన్‌జివో సంస్థ ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ సభ్యుడు పి పరమేశ్వర్ నవోదయం పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. కేంద్ర సాంస్కృతి వ్యవహారాల సహాయ మంత్రి మహేశ్ శర్మ ముఖ్యఅతిధిగా హాజరైన ఓ సమావేశంలో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆదిశంకరాచార్యుల జయంతిని జాతీయ తత్వవేత్తల దినోత్సవంగా పాటించాలన్న ప్రతిపాదన తమకు అందిందని దాన్ని తాము పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.

విధానానికి విరుద్ధంగాపొత్తా?

న్యూఢిల్లీ, మే 30: ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) రాష్ట్ర శాఖ అనుసరించిన ఎన్నికల వ్యూహాలు.. పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాలకు, పార్టీ రాజకీయ ఎత్తుగడల పంథాకు అనుగుణంగా లేవని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. సిపిఐ(ఎం) రాజకీయ ఎత్తుగడల పంథా ప్రకారం పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి అవగాహన కుదుర్చుకోవడానికి కాని పొత్తు పెట్టుకోవడానికి కాని వీల్లేదు.

కామెరాన్ భవితవ్యం ప్రశ్నార్థకం

లండన్, మే 30: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందా లేదా అన్నదానిపై అంతర్జాతీయంగా చర్చలు చెలరేగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నాయకత్వానికి తీవ్రసవాళ్లు ఎదురవుతున్నాయి. వచ్చేనెల 23న ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతోంది. ఐరోపా యూనియన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ సభ్యత్వం విషయంలో కామెరాన్ వ్యవహరించిన తీరు అసంబద్ధంగా ఉందంటూ అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

స్టేషన్ల అభివృద్ధి వేగవంతం కావాలి

న్యూఢిల్లీ, మే 30: దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో రైల్వేలు మరింత ఆశావహ దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. రైల్వే శాఖతో పాటు రోడ్లు, రహదారుల శాఖ పనితీరుపై సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించి న సమీక్షా సమావేశంలో ప్రధాని ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ నమూనాలను అధ్యయనం చేసి రోడ్ల అభివృద్ధికి అత్యుత్తమ విధానాలను అవలంబించడంతోపాటు ఈ రంగంలోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు.

శాస్ర్తియ దృక్పథం లేని కోర్టు ఆదేశాలు

పనాజీ, మే 30: న్యాయస్థానాలు జారీ చేస్తున్న కొన్ని ఆదేశాలు అర్థరహితంగా ఉన్నాయని, వాటికి ఎలాంటి శాస్ర్తియ పునాదిలేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సోమవారం ఇక్కడ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సైన్స్ అంటే తెలియని కొందరు వ్యక్తులు వాటిని అన్వయిస్తున్నారని, ఎలాంటి శాస్ర్తియ దృక్పధం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి సంబంధించిన ఓ వార్తను ఉదహరించారు.

పొగాకు వినియోగ నియంత్రణకు కృషి చేయండి

న్యూఢిల్లీ, మే 30: పొగాకు వినియోగాన్ని నిరోధించడంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు భాగస్వాములు కావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా పిలుపునిచ్చారు. ఒక్కో సంస్థ అయిదారు పాఠశాలలను దత్తత తీసుకొని, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించడంద్వారా చిన్న వయస్సులోనే వారిని చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంవల్ల వచ్చే వివిధ రకాల వ్యాధుల వివరాలను తెలియజేస్తూ భారీ పరిమాణంలో గ్రాఫిక్ చిత్రాలతో కూడిన హెచ్చరికలను విడుదల చేయాలని ఆయన సూచించారు.

సొంత లాభం కొంత చూసుకుని...

న్యూఢిల్లీ, మే 30: ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయమంతా తన కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతుందనేది మరోసారి రుజువు చేశారు. తన కూతురు మీసా భారతిని రాజ్యసభకు ఎంపిక చేయటంద్వారా ఆయన మరోసారి కుటుంబ సభ్యులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాననేది ప్రకటించుకున్నారు. గతంలో తన భార్యను బిహార్ ముఖ్యమంత్రిగా నియమించి జైలునుండి పరోక్షంగా బిహార్ ప్రభుత్వాన్ని నడిపించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు తేజ్ ప్రసాద్ యాదవ్, తేజస్వీ ప్రసాద్ యాదవ్‌లు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలోని బిహార్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మహానాడుతో ఒరిగిందేమిటి?

విజయనగరం(టౌన్), మే 30: మూడు రోజుల పాటు తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలుగుజాతి అభివృద్ధి కోసం చేసింది శూన్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచేవిధంగా ఈమహానాడు ద్వారా ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోగా ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టే విధంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కనీసం ఖండించలేని స్థితిలో మహానాడు మిగిలిందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాతామని తీర్మానం చేయలేదని చెప్పారు.

నేడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హనుమజ్జయంతి

విజయనగరం (పూల్‌బాగ్),మే30: పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతిని పురస్కరించుకుని మంగళవారం విశేషపూజలు నిర్వహిస్తామని పైడితల్లి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజాతెలిపారు.సోమవారం తన కార్యాలయంలో హనుమజ్జయంతి వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పైడితల్లి అమ్మవారి ఆలయ దత్తాలయమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువైన ఆంజనేయస్వామివారికి వేకువజాము ఐదు గంటలనుండి 11గంటలవరకు విశేష పంచామృతాభిషేకం, లక్ష తమలపాకులసేవ, సింధూరపూజలు జరుగుతాయని చెప్పారు. ఈసమావేశంలో ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు, నగేష్ ఆచార్యులు,రామారావు,రమణమూర్తి సిబ్బంది పాల్గొన్నారు.

పిడుగుపడి ఒకరి మృతి

రామభద్రపురం, మే 30 మండల పరిధిలోని మిర్తివలస గ్రామానికి చెందిన రాంబార్కి సన్యాసి (52) గుడ్డిగెడ్డ వద్ద పొలం వెళ్లి వస్తుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఇతనికి భార్య పిల్లలున్నారు. ఎస్‌ఐ భీంనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pages