S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయో కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలి

శ్రీకాకుళం(టౌన్), మే 30: డి.మత్స్యలేశం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన బయో కెమికల్ ఫ్యాక్టరీ వలన పరిసర గ్రామాల జలవనరులు కలుషితమవుతున్నందున తక్షణమే ఆ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం, రాళ్లుపేట, ఎస్.డి.పాలెం, కె.డి.పాలెం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మత్స్యకార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమం అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. హేచరీ వలన చుట్టుపక్కల ఉన్న చెరువులు, గుంటలు కనుమరుగైపోయాయన్నారు.

ప్రతీ ఇంటా నవనిర్మాణ దీక్ష

శ్రీకాకుళం, మే 30: ప్రతీ ఇంటా నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ప్రజలను కోరారు. నవ నిర్మాణ దీక్ష నిర్వహణపై సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవ నిర్మాణదీక్ష కార్యక్రమంలో భాగంగా జూన్ 2వ తేదీనుంచి 8వరకు ప్రతీ రోజు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. జూన్ 2న జిల్లా కేంద్ర, డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల, గ్రామస్థాయిలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామన్నారు.

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి!

సంతకవిటి, మే 30: మండలంలోని మోదుగులపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి యజ్జాడ గోపి సోమవారం ఎసిబి అధికారులు జరిపిన దాడిలో చిక్కారు. రూ.2వేలు ఆదే గ్రామానికి చెందిన మజ్జి రాము అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఎసిబి డిఎస్పీ రంగరాజు వెల్లడించారు. ఈ దాడికి సంబంధించి వివరాలివి. ఈ ఏడాది జనవరి 22 తేదీన మోదుగుల పేట గ్రామానికి చెందిన మజ్జి అప్పలనాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం రాము గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నాడు. తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తనకు మంజూరు చేయలేదని రాము తెలిపారు.

పేదల సమస్యలు పరిష్కరించరా?

శ్రీకాకుళం(టౌన్), మే 30: జిల్లాలోని హిరమండలంలో నివశిస్తున్న నిరుపేద కుటుంబాలకు సర్వే నెం.96, 97లో ఇచ్చిన స్థలాలు కొంతమంది ఆక్రమించుకుంటున్నారని, ఇదే విషయంపై తహశీల్దారు దృష్టికి తీసుకువచ్చినా సంబంధం లేదంటున్నారని గ్రామానికి చెందిన పి.శంకరరావు, బి.మల్లేశ్వరరావు, ఎం.రమణ తదితరులు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంనకు ఫిర్యాదు చేశారు. సోమవారం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడారు. ఆరేళ్ళ కిందట అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆదేశానుసారం నిర్వాసితులకు 431 పట్టాలిచ్చారన్నారు.

పరనిందలకు వేదిక మహానాడు!

శ్రీకాకుళం(టౌన్), మే 30: టిడిపి అట్టహాసంగా, ఆర్భాటంగా మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి, పరనిందలకు మాత్రమే వేదికగా మారిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి విమర్శించారు. ఈ మేరకు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తరువాత టిడిపి మొదటిసారిగా నిర్వహించిన మహానాడులో ప్రజలకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశం కరవైందన్నారు.

నేటి నుంచి అభయాంజనేయస్వామి వార్షికోత్సవాలు

పోలాకి, మే 30: మండలంలో 31వ తేదీ మంగళవారంనుంచి అభయాంజనేయస్వామి జయంతి వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నట్టు వెదళ్లవలస, గంటపేట గ్రామ ఆంజనేయ స్వామి నిర్వాహకులు చిన్నినాయుడు, ఆర్.రాజారావు తెలిపారు. మంగళవారం మబగాం, గుప్పిడిపేట, గుళ్లవానిపేట, తలసముద్రం వెదుళ్లవలస, డోల గ్రామాలలో 23వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఉపాధిలో అక్రమాలపై విచారణ జరిపించండి

శ్రీకాకుళం(టౌన్), మే 30: జిల్లాలోని భామిని మండలం దిమ్మిడిజోల పంచాయతీకి చెందిన కొత్తచెరువులో ఉపాధి హామీపథకంలో భాగంగా బినామీ మస్తర్లు వేసి మేట్ సొమ్ము కాజేశారని విచారణ చేయించి తగిన చర్యలు తీసుకోవాలని దిమ్మిడిజోలకు చెందిన కె.రామారావు, పి.రామ్మూర్తిలు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంను కోరారు. కలెక్టర్ ఫిర్యాదుల విభాగంలో సోమవారం కలెక్టర్‌తో పాటు జెసి వివేక్ యాదవ్‌లు అర్జీలు స్వీకరించారు. బకాయిపడిన ఐదు నెలల వేతనాలు చెల్లించేలా సంబంధిత ఏజెన్సీని ఆదేశించాలని రిమ్స్ కాంట్రాక్టు, ఔట్‌సోర్శింగ్ వర్కర్స్ యూనియన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వైకాపా జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై ఇద్దరు ఎంపిల తర్జనభర్జన

ఒంగోలు,మే 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా నూతన అధ్యక్ష పదవి ఎంపికపై ఒంగోలు, నెల్లూరు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి చర్చించుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. శనివారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేకపాటి ఎంపి వైవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులు, పార్టీ మారుతున్న శాసనసభ్యులపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

నీటి సంరక్షణ పనులతో కరవురహితంగా జిల్లా

ఒంగోలు,మే 30:కరవురహితంగా జిల్లాను మార్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నీటి సంరక్షణ పనులను ప్రారంభించిందని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. సోమవారం ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంటు (ఐఎఫ్‌ఎడి) అంతర్జాతీయ సంస్థ బృందం సభ్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బృందసభ్యులు, జిల్లాకలెక్టర్ మధ్య జిల్లాలో నీటివసతి, ఉపాధిపనులు, చెక్‌డ్యాంలు, పంటసంజీవిని, సాయిల్ హెల్త్‌కార్డులు, నిరుపేద మహిళల్లో జీవనోపాదులు పెంచుట తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వర్షాభావంపై ఆధారపడి ఉందని అయితే వర్షాలులేని కారణంగా నీటిసమస్య కరువు ఏర్పడిందన్నారు.

ప్రత్యేక హోదా సాధనకై సిపిఐ ఉద్ధృత పోరాటం

పామూరు, మే 30: విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి ఎన్నికల అనంతరం మాట మార్చిందని, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు సిపిఐ ఆధ్వర్యంలో విస్తృత పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోస్ట్ కోటేశ్వరరావు ఫంక్షన్ హాలులో సిపిఐ జిల్లా సమితి సమావేశంలో పాల్గొన్న ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైందని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రత్యేక హోదాను విస్మరించిందన్నారు.

Pages