S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి పట్టివేత

జి.మాడుగుల, మే 30: మన్యం నుండి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధంగా వున్న ఎండు గంజాయిని ముందస్తు సమాచారంతో స్ధానిక పోలీసులు సోమవారం పట్టుకున్నారు. జి.మాడుగుల ఎస్.ఐ. డి.శేఖరం విలేఖరులకు అందించిన వివరాలు ప్రకారం మండలంలోని సొలభం పంచాయితీ వట్టివెగిసె గ్రామంలో సుమారు 950 కిలోలు 270 ప్యాకెట్లుగా చేసి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధపడుతుండగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. గంజాయి తరలించడానికి ప్రయత్నిస్తున్న వారిలో ముగ్గురు పరారీ కాగా ఒకరు పట్టుబడ్డారని ఆయన అన్నారు. గంజాయితో పట్టుబడిన సంపతి క్రిష్ణబాబుపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు.

అది ప్రమాదమే..!

విశాఖపట్నం(క్రైం)అనకాపల్లి, మే 30: అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లావణ్య కేసుకు ఎట్టకేలకు నగర పోలీసు కమిషనర్ టి.యోగానంద్ తెర దించారు. కావాలనే హేమంత్‌కుమార్ అతని స్నేహితులు ఆమెను అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయం వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడి అనంతరం ఆమె మోటారుబైక్‌పై వెళ్తుండగా సాలాపువానిపాలెం వద్ద కారుతో ఢీకొట్టి హత్య చేశారన్న ఆరోపణలను సిపి కొట్టి పారేశారు. కేసు మాఫీ చేయడానికి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున బేరసారాలు సాగించినట్టు ప్రచారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అన్ని ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ - కార్నర్ సేవలు

నర్సీపట్నం, మే 30: ఈ- కార్నర్ విధానం ద్వారా బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు మరింత చేరువ అయ్యాయని ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజయ్‌కుమార్ పండిట్ అన్నారు. స్థానిక ఎస్‌బిఐ వ్యవసాయ శాఖ బ్రాంచిలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కార్నర్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 29 బ్రాంచ్‌ల్లో ఈ - కార్నర్ కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ విధానం ద్వారా 24 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సిడిఎం .మిషన్లు నిరంతరం పని చేసేందుకు వీలుగా ఛానల్ కో ఆర్డినేటర్లను ఏర్పాటు చేశామన్నారు.

సమీకృత క్రీడా గ్రామానికి మరింత మెరుగైన డిజైన్లు

విశాఖపట్నం, మే 30: అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత క్రీడా గ్రామాన్ని తీర్చి దిద్దే చర్యల్లో భాగంగా మరింత మెరుగైన డిజైన్ల కోసం విశాఖ నగరాభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసిన ఆర్కిటెక్టులకు మరింత మెరుగైన డిజైన్లను అందచేసేందుకు వీలు కల్పించింది. జిల్లాలోని ఆనందపురం మండలం గండిగుండం వద్ద దాదాపు 79 ఎకరాల్లో సమీకృత క్రీడా గ్రామాన్ని వుడా నిర్మించేందుకు నిర్ణయించడం తెలిసిందే. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు వేదికల కొరతను అధిగమించేందుకు వీలుగా ఈ క్రీడా గ్రామాన్ని దాదాపు 350 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

జూన్ 3 నుంచి ‘సినిమా వర్క్‌షాప్

విశాఖపట్నం, (కల్చరల్) మే 30: చలనచిత్ర మాధ్యమంపై ఆసక్తి కనబరిచే వారి కోసం ప్రత్యేకంగా జూన్ మూడవ తేదీ నుంచి మూడు రోజులపాటు వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్టు సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకులు ఎంవి రఘు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పౌరగ్రంథాలయంలో ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు స్టోరీ, స్ట్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎడిటింగ్, సౌండ్, ప్రొడక్షన్ వంటి అంశాలపై ఫండమెంటల్ సినిమా వర్క్‌షాప్ ఉంటుందని రఘు వెల్లడించారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ధ్రువపత్రం అందజేస్తామన్నారు. ఇతర వివరాలకు కార్యక్రమ సంధాన కర్తలైన వైజాగ్ ఫిల్మ్ సొసైటీ, బాదంగీర్ సాయిలను సంప్రదించవచ్చన్నారు.

జూన్ 6 నుంచి శిక్షణ కార్యక్రమం

విశాఖపట్నం, మే 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (విశాఖపట్నం) ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా నిరుద్యోగ అభ్యర్థులకు జూన్ 6వ తేదీ నుంచి 10 వరకు ఫినిషింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో అయిదు రోజుల పాటు విశాఖపట్నం నందు కేటాయించిన కాలేజీల్లో శిక్షణనిచ్చి, శిక్షణ అనంతరం జాబ్ మేళా నిర్వహించబడునని సంస్థ అసోసియేట్ మేనేజర్ పిబి సాయిశ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు హెచ్‌టిటిపి/ఏపీఎస్‌ఎస్‌డిసి.ఇన్ వెబ్‌సైట్ లైదా ఏపీఎస్‌ఎస్‌డిసి ఏపీపీనందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా సూచించారు.

విద్యుత్ వినియోగదారుల బిల్లింగ్ తేదీల్లో మార్పు

విశాఖపట్నం, మే 30: గరిష్ట స్థాయి విద్యుత్ వినియోగదారుల విద్యుత్ వినియోగ గణన, బిల్లింగ్ ప్రక్రియల్లో సమూల మార్పులు తీసుకురావాలని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) యాజమాన్యం నిర్ణయించింది. మరింతగా పారదర్శకతతో కూడిన సేవలందించడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా ప్రతి నెలాఖరున నిర్వహిస్తున్న విద్యుత్ బిల్లింగ్ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇక నుంచి ప్రతినెల నాలుగవ తేదీ నుంచి 11 వరకు జరుపుతున్నట్టు సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

బిజెపి విజయోత్సవాలు

విశాఖపట్నం, మే 30: ప్రధాని మోదీ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్టు హరిబాబు తెలిపారు. విశాఖతో పాటు తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, విజయవాడ తదితర ప్రాంతాల్లో జరిగే విజయోత్సవ సభల్లో స్మృతి ఇరానీ, మనోహర్ పారికర్, ప్రకాష్ జవదేకర్, ఉమా భారతి, ధర్మేంద్ర ప్రధాన్, రవి శంకర్ ప్రసాద్, పాల్గొంటారని తెలిపారు. విశాఖలో జరిగే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొంటారన్నారు. విశాఖలో అరుణ్‌జైట్లీ సమావేశం ఈ నెల 15న జరిగే అవకాశం ఉందన్నారు. ఇక రెండేళ్ల పాలనలో నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు.

చిగురిస్తున్న ఆశలు

విశాఖపట్నం, మే 30: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులను కాదని, మహరాష్ట్ర నుంచి మరో కేంద్ర మంత్రిని తీసుకువచ్చి ఎపి నుంచి రాజ్యసభకు పంపడం వెనుక బిజెపి, టిడిపి రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

‘టచ్’లో ఉన్నవారు జంప్?

శ్రీకాకుళం: కొన్నాళ్ళుగా స్తబ్దతగా ఉన్న శ్రీకాకుళం రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం సంభవించబో తోంది. కొద్దిరోజులుగా ఊసేలేని నాయకుల వలస మళ్లీ ప్రారంభైనట్టు కనిపిస్తోంది. రాజాం, పాలకొండ శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరేఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల టిడిపి క్యాంపైన్ మంతనాలకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీరిద్దరి చేరిక కూడా దాదాపుగా ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ 2 లేదా 4వ తేదీన తెలుగుదేశం పార్టీ కండువా వేసుకునేందుకు వీరికంటే ముందు వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ అయిన పాతపట్నం ఎమ్మెల్యే దర్శకత్వంలో సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

Pages