S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడదెబ్బతో ఒకరి మృతి

బొబ్బిలి, మే 30: పట్టణ పరిధిలో ఉన్న తారకరామా కాలనీకి చెందిన కె.సత్యం (55) వడదెబ్బ తగిలి సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు ఇంటి నిర్మాణంనకు సంబంధించిన సామాన్లు కొనుగోలు నిమిత్తం మార్కెట్‌కు వెళ్లి ఇంటి వద్దకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో మంచినీళ్లు పట్టడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విఆర్‌ఒ కృష్ణమూర్తి మృతదేహాన్ని పరిశీలించారు. వడదెబ్బ కారణంగా మృతిచెందినట్టు స్పష్టం చేశారు.

మహాకవి మన్నించు!

విజయనగరం(పూల్‌బాగ్),మే 30: మహాకవి గురజాడ అప్పారావుపట్ల ప్రభుత్వం, అధికారుల వ్యవహార శైలికి నిరసన తెలుపుతూ మహాకవిని మన్నించమని కోరుతు తాను విజయనగరం వచ్చానని ప్రముఖ సాహితీవేత్త పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. సోమవారం గురజాడ స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతు గురజాడ జన్మించిన విజయనగరం అంటే తనకెంతో భక్తి, గౌరవమని చెప్పారు. ఈరోజున తెలుగుభాషా సంస్కృతులు దయనీయమైన స్థితిలో ఉన్నాయన్నారు. గురజాడ ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అనుమతించినా అధికారుల్లో మాత్రం చిత్తశుద్ధి లోపించిందని పేర్కొన్నారు.

ఆర్‌ఆర్ ప్యాకేజీ కోసం ఉద్యమబాట పట్టాలి

నెల్లిమర్ల, మే 30: సారిపల్లి గ్రామపంచాయితీకి ఆర్ ఆర్ ప్యాకేజీ కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమబాట పట్టాలని సిపి ఎం కేంద్రకమిటీ సభ్యులు ఎస్. పుణ్యవతి అన్నారు. సారిపల్లి గ్రామం వద్ద నిర్మాణం చేపడుతున్న తారకరామ రక్షణగట్టును సోమవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె నిర్వాసితులతో మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ఒక పక్క ప్రాజెక్టులు మరో పక్క చంపావతి నది మధ్యలో ఈ గ్రామస్తులు మగ్గిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు గ్రామస్తుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని అన్నారు.రిజర్వాయర్ నిర్మాణానికి గ్రామస్తుల మొత్తం భూమిని ఇచ్చారని గుర్తు చేసారు.

ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని ఉపాధి కూలీల ధర్నా

విజయనగరం(టౌన్), మే 30: ఉపాధిహామీ నిధుల్లో అక్రమాలకు పాల్పడిన నెర్లిమర్లమండలం చినబూరాడపేట ఫీల్లుడ అసిస్టెంట్‌ను విధలునుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీలు పెద్దసంఖ్యలో సోమవారం కల్టెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఈకార్యక్రమానికి నాయకత్వం వహించిన గ్రామ మారుతీ యువజన సంఘం అధ్యక్షుడు బెల్లానరామారావు మాట్లాడుతూ సుమారు లక్షానలభైవేల రూపాయలవరకు ఉపాధినిధులు అక్రమానికి ఫీల్డు అసిస్టెంట్ పాల్పడిందని సామాజిక తనిఖీలో వెల్లడిఅయిందని అన్నారు.

సద్దుమణిగిన మహాకవి గురజాడ వారసుల స్థల వివాదం

విజయనగరం (్ఫర్టు), మే 30: పట్టణంలో మహాకవి గురజాడ అప్పారావువారసులకు మున్సిపల్ స్థలాన్ని కేటాయించేందుకు మున్సిపల్ పాలకవర్గం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు గురజాడ వారసులకు స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ సోమవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. గురజాడ వారసులకు స్థల కేటాయింపులో చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో పలు రాజకీయపార్టీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సాహితీసంస్థలు పెద్దఎత్తున నిరసన తెలియజేశాయి. ఈ పరిణామాల నేపధ్యంలో మున్సిపాలిటీ పరిధిలో టౌన్‌సర్వేనెంబర్ 14లో సంతపేట సౌత్‌వార్డులో 45 సెంట్లు భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యుద్ధ ప్రాతిపదికన ఎన్టీఆర్ జలసిరి పనులు చేపట్టాలి

విజయనగరం(టౌన్), మే 30: ఎన్టీ ఆర్ జలసిరి కింద మంజూ రు చేసిన బోరుబావులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీ ఆర్ జలసిరి పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం కింద జిల్లాలో అందిన 15వేల దరఖాస్తులు పరిశీలించి వెంటనే మంజూరు చేయాలని జూలై 15 నాటికి రెండువేల బోరుబావుల నిర్మా ణం పూర్తిచేయాలని డ్వామా పిడి ప్రశాంతికి కలెక్టర్ ఆదేశించారు. బోరుబావుల తవ్వకానికి అనువైన ప్రాంతాలను జియాలజిస్టుల సహకారం తీసుకోమని చెప్పారు.

మీ-కోసం గ్రీవెన్స్‌లో సామాజిక సమస్యలపై వినతుల వెల్లువ

విజయనగరం(టౌన్), మే 30: మీ-కోసం గ్రీవెన్స్ సెల్‌కు సామాజిక సమస్యలపై వినతులు జిల్లా యంత్రాంగానికి అందాయి. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో మీకోసం కార్యక్రమానికి హాజరైన అర్జీదారుల నుండి కలెక్టర్ ఎం ఎం నాయక్ వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై అందిన వినతులను పరిశీలించి పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు. 13వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు వినతి పత్రం అందజేసారు.

వాడివేడిగా మండల సమావేశం

కొత్తవలస, మే 30: మండల పరిషత్ సాధారణ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది. ఎంపిపి పొలమర శెట్టి శాంతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు, సభ్యులమధ్య వాగ్వాదం జరిగింది. ఎక్సైజ్‌శాఖ, పంచాయితీరాజ్ శాఖ, ఆర్‌డబ్ల్యు ఎస్ శాఖల అధికారులను సభ్యులు నిలదీసారు. మండలంలో మద్యం ధరలకు అదుపులేకుండా పోతుందని, ఎం ఆర్‌పి కంటే 15రూపాయల నుండి 20 రూపాయల వరకు ఎక్కువకు అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని సభ్యుడు మేస్ర్తి అప్పారావు నిలదీశారు. ఎక్సైజ్ శాఖ సిఐ గత మూడు సమావేశాలకు హాజరు కాలేదని మండిపడ్డారు. బెల్టుషాపులను నియంత్రించలేదని, నాటుసారా ఏరులైపారుతున్నా చర్యలు చేపట్టలేదని, అప్పారావు ప్రశ్నించారు.

కనీస వేతన సాధనకు సిఐటియు పోరాటం

విజయనగరం(టౌన్),మే 30: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అసంఘటితరంగ కార్మికుల కనీస వేతనాలకోసం పోరాడాలని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ శర్మ చెప్పారు. పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో రెండురోజులు జరిగిన సి ఐటియు ఎనిమిదవ జిల్లా మహాసభలు సోమవారం ముగిసాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఈ సదస్సులో పాల్గొన్న సి ఐటియు రాష్ట్ర నాయకులు పుణ్యవతి, సి.హెచ్. నర్సింగరావు ఎండగట్టారు.

చంపావతిలో చెక్ డ్యామ్‌ల నిర్మాణం

గజపతినగరం, మే 30: చంపావతి నదిలో నాలుగుచోట్ల చెక్ డ్యామ్‌లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధంచేసామని సాగునీటి పారుదల శాఖ డి ఇ ఎ.సి.హెచ్. అప్పలనాయుడు చెప్పారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పిట్టాడ గ్రామం నుండి ఆండ్ర రిజర్వాయరు వరకు నాలుగుచోట్ల ఒక్కొక్క చెక్ డ్యాం నిర్మాణానికి మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తామని తెలిపారు. ఆండ్ర రిజర్వాయర్ కుడికాలువలు పూడికతీతకోసం 20లక్షల నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు చేపడతామని తెలిపారు. ఈనెలాఖరునాటికి తాటిపూడి రిజర్వాయరు ఆధునీకరణ పను లు పూర్తి అవుతాయని చెప్పారు.

Pages