S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జివో 279 రద్దుచేయాలని మున్సిపల్ కార్మికుల ధర్నా

ఒంగోలు, మే 30: మున్సిపల్ కార్మికుల ఉపాధి దెబ్బతీసే జీవో 279ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ (సిఐటియు) నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు బి వెంకట్రావు, కొర్నెపాటి శ్రీనివాసరావు మట్లాడుతూ జీవో 279ని రద్దుచేయాలని గత ఐదు నెలలుగా మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 30న చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్లు వారు తెలిపారు.

మండుటెండ... జోరువాన

చీరాల, మే 30: అప్పటి వరకూ మండుటెండ కాసింది. అంతలోనే వాతావరణం చల్లబడి జోరువాన కురిసింది. పొద్దునంతా వడగాల్పులు, సాయంత్రం ఈదురుగాలులు. ఒకే రోజు పరస్పరం భిన్నమైన వాతావరణ పరిస్థితులు సోమవారం నెలకొన్నాయి. వరుసగా రెండు రోజుల పాటు శని, ఆది వారాల్లో వాతారణం చల్లబడడంతో ఇక ఎండలు తగ్గినట్లేనని జనం భావించారు. అయితే సోమవారం ఉదయం 10 గంటలకే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. క్రమంగా అది మధ్యాహ్నానికి 42 డిగ్రీలకు చేరింది. దీంతో పాటు వడగాల్పులు కూడా వీచడంతో జనం బెంబేలెత్తారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. తీవ్రమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.

గురజాడ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ఒంగోలు, మే 30: మహాకవి గురజాడ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎర్రన విగ్రహం వద్ద సాహితీవేత్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రన, గురజాడ చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇక... ‘తీన్’మార్!

‘రాష్ట్రం ఏర్పడగానే అదీ ఇదీ అంటూ గాబరాపడి ఆగమాగమయ్యే ప్రభుత్వం కాదు మాది. ఉమ్మడిలో తెలంగాణకు ఎక్కడ అన్యాయం
జరిగింది, దాన్ని ఎలా
పూడ్చుకోవాలో లోతుగా అధ్యయనం చేస్తాం. మూలాలను తెలుసుకుని
క్షేత్రస్థాయి నుంచి చేపట్టాల్సిన
చర్యలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు పకడ్భందీగా రూపొందించిన తరువాతే ముందుకు సాగుతాం’

వెల్జాల చంద్రశేఖర్

రాజభాషా షీల్డుల ప్రదానం

ఏలూరు, మే 30: కార్యాలయాల్లో రాజభాషను సమర్ధంగా అమలుచేస్తున్న విభాగాలకు రాజభాషా షీల్డులను సోమవారం అందజేశారు. స్ధానిక టెలికం జనరల్ మేనేజరు కార్యాలయంలో టెలికం జాయింట్ జనరల్ మేనేజరు కెఎస్‌వి ప్రసాద్ అధ్యక్షతన నగర రాజభాషా కార్యాన్వయన సమితి సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాజభాష అమలును సమీక్షించారు. 2015-16 సంవత్సరంలో రాజభాష అమలులో ప్రధమస్ధానం సాధించిన ఎస్‌బిహెచ్ రీజనల్ కార్యాలయంలో అసిస్టెంటు జనరల్ మేనేజరుగా ఉన్న ఎం తులసీదాస్‌కు ఈ షీల్డ్‌ను అందజేశారు. అలాగే ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయంలో అసిస్టెంటు జనరల్ మేనేజరుగా ఉన్న ఎం గురుమూర్తికి ద్వితీయ రాజభాషా షీల్డ్‌ను అందజేశారు.

లంచ్ బ్రేక్ అరగంట మాత్రమే...!

ఏలూరు, మే 30 : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ బ్రేక్ అరగంట మాత్రమేనని ఇతర సమయాల్లో కార్యాలయాల సిబ్బంది విధిగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

జఠాఝూటం అలంకరణకు అంకురార్పణ

వీరవాసరం, మే 30: శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసివున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ శివదేవ స్వామివారికి జఠాఝూటం అలంకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం అంకురార్పణ ప్రారంభమైంది. వేద మంత్రాల నడుమ స్వామివారికి వేదపండితులు లక్ష బిల్వార్చన నిర్వహించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక పుష్పాలను ఆలయ ప్రాంగణంలో ఉంచారు. వాటిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

ఔట్ గోయింగే అన్‌లిమిటెడ్!

ఏలూరు, మే 30 : ఇంతకుముందు పశ్చిమగోదావరి జిల్లాలో పోస్టింగ్ అంటే ఎగిరి గంతేసి, ఎంతంటే అంత మూల్యం చెల్లించి దక్కించుకునే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా మారిపోయింది. ఇదంతా రాజకీయ జోక్యం ఎక్కువయ్యో లేక ప్రజాప్రతినిధుల వ్యతిరేకత వల్లో అనుకుంటే పొరపాటే. పరిపాలన వ్యవహారంలో జిల్లాలో వున్న పరిస్థితులే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనితో ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న బదిలీల అంశంలో జిల్లా నుంచి ఔట్ గోయింగ్ అధికారుల సంఖ్యే ఎక్కువ వుందంటే ఆశ్చర్యం కాదు. ఇదే సమయంలో ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న అధికారుల సంఖ్య కూడా బాగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

బిగ్ ‘బెట్టింగ్’!

భీమవరం, మే 30: ఈ ఏడాది ఐపిఎల్-9 టోర్నీలో జరిగిన పందాలు సంగతి ఎలా ఉన్న ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు మధ్య బిగ్ బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఐపిఎల్ -9లో ఇదే పెద్ద బెట్టింగ్‌గా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈ ఐపిఎల్-9లో నష్టపోయిన పందాలరాయుళ్లు ఫైనల్ మ్యాచ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌తో నష్టపోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి వ్యూహాలు రచించి పందాలువేశారు. అయితే పందెంరాయుళ్లకు బెంగళూరు క్రీడాకారుడు క్రిస్‌గేల్ చుక్కలు చూపించాడు. మ్యాచ్ టాస్ ప్రారంభం నుండి పందాలు ఆరంభమయ్యాయి.

ఏంచేస్తున్నారు...!

ఏలూరు, మే 30: ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకోవడమే కాకుండా అక్రమణదారుడు ఆ స్ధలాన్ని వేరొకరికి అమ్మివేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తుంటే మీరేం చేస్తున్నారని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణను కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీకోసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టరు విజ్ఞప్తులు స్వీకరించారు.

Pages