S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/08/2017 - 00:18

పెర్త్, అక్టోబర్ 7: ఆస్ట్రేలియా హాకీ లీగ్‌ను భారత మహిళల 3ఎ2 జట్టు తొమ్మిదో స్థానంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఈ జట్టు ఆస్రేటలియా క్యాపిటల్ టెరిటరీ చేతిలో 0-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. టెరిటరీ సాధించిన రెండు జట్లు జెసికా స్మిత్ ద్వారా లభించినవే కావడం విశేషం.

10/08/2017 - 00:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: అండర్-17 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ భారత జట్టు ఎన్నో పాఠాలు నేర్చుకుందని చీఫ్ కోచ్ లూయిస్ నార్టన్ డి మటోస్ వ్యాఖ్యానించాడు. ఈ మెగా టోర్నీ మొదటి రోజైన శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఢీకొన్న భారత్ 0-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

10/08/2017 - 00:06

పారిస్, అక్టోబర్ 7: అల్బేనియాను 3-0 తేడాతో చిత్తుచేసి స్పెయిన్ 2018 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. ప్రత్యర్థిని చెలరేగకుండా కట్టడి చేసిన స్పెయిన్ 16వ నిమిషంలో తొలి గోల్ చేసింది. రోడ్రిగో ఈ గోల్‌ను అందించాడు. మరో ఏడు నిమిషాల్లోనే ఇస్కో ద్వారా స్పెయిన్‌కు రెండో గోల్ లభించింది. ఆ వెంటనే థియాగో మరో గోల్ చేశాడు.

10/08/2017 - 00:06

జాతీయ టెన్నిస్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించిన 16 ఏళ్ల యువ సంచలనం మహక్ జైన్. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఫైనల్‌లో ఆమె జీల్ దేశాయ్‌ని 7-5, 6-3 తేడాతో ఓడించి టైటిల్‌ను అందుకుంది. పురుషుల సింగిల్స్‌లో దల్వీందర్ సింగ్ 6-3, 6-4 ఆధిక్యంతో సూరజ్ ప్రబోధ్‌పై విజయాన్ని నమోదు చేసి టైటిల్ సాధించాడు

చిత్రం.. మహక్ జైన్

10/07/2017 - 03:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అండర్-17 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య దేశ హోదాలో మెయిన్‌డ్రాకు అర్హత సంపాదించిన భారత్ మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసింది. పటిష్టమైన అమెరికాను ఢీకొన్న ఈ జట్టు 0-3 తేడాతో ఓడింది. మ్యాచ్ ప్రారంభం నుంచే అమెరికా క్రీడాకారులు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ, భారత్‌పై ఒత్తిడి పెంచారు.

10/07/2017 - 00:34

చిత్రం..న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్
తొలిరోజు భారత జట్టును కలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

10/07/2017 - 00:32

పారిస్, అక్టోబర్ 6: డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హతను సంపాదించింది. ఇక్కడ జరిగిన కీలక క్వాలిఫయర్‌లో ఈ జట్టు నార్తన్ ఐర్లాండ్‌ను 3-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ రెండో నిమిషంలోనే సెబాస్టియన్ రూడీ ద్వారా జర్మనీకి తొలి గోల్ లభించింది. ఆతర్వాత కూడా అదే దూకుడును కొనసాగించిన జర్మనీ 21వ నిమిషంలో రెండో గోల్ సాధించింది.

10/07/2017 - 00:30

మలక్కా (మలేసియా): సిరియాతో జరిగిన కీలక క్వాలిఫయర్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కి రిఫరీగా వ్యవహరించిన అలిరెజా ఫఘానీపై మండిపడుతున్నది. మ్యాచ్ ప్రథమార్ధంలోనే గోల్ చేసిన ఆస్ట్రేలియా ఆతర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించి, డిఫెన్స్‌కు పరిమితమైంది. ద్వితీయార్ధంలోనూ అదే విధానాన్ని అనుసరించింది.

10/07/2017 - 00:29

రాంచీ, అక్టోబర్ 6: ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 4-1 తేడాతో గెల్చుకొని, ఆ ఫార్మాట్‌లో మళ్లీ ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన భారత్ టి-20 ఇంటర్నేషనల్స్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో, అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్‌ను ఆసీస్ వనే్డల్లో సమర్థంగా ఎదుర్కోలేకపోయిందనేది వాస్తవం.

10/07/2017 - 00:28

కరాచీ, అక్టోబర్ 6: పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సోదరుడి కుమారుడు ఇమామ్ ఉల్ హక్‌కు శ్రీలంకతో జరిగే వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో, ఇటీవల ఇంగ్లాండ్‌లో చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న జట్టును ఒక మార్పు మినహా యథాతథంగా కొనసాగిస్తున్నారు.

Pages