S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/06/2017 - 01:18

* ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభమయ్యే ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.

10/06/2017 - 01:17

* ఫిఫా అండర్-17, ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీలను సాధించిన ఏకైక ఆటగాడిగా రొనాల్డిన్హో (బ్రెజిల్) రికార్డులకెక్కాడు. అతను 1997లో అండర్-17 వరల్డ్ కప్‌ను గెల్చుకున్న బ్రెజిల్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతరం జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ, 2002లో ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని సగర్వంగా అందుకున్నాడు. స్పెయిన్‌కు చెందిన ఇకర్ కాసిలాస్ ముందు అండర్-17 వరల్డ్ కప్‌లో ఆడాడు.

10/05/2017 - 22:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: అండర్-17 సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి పోటీపడుతున్న భారత జట్టుపై చాలా మందికి గొప్ప అంచనాలేవీ లేవు. అయితే, పోర్చుగీస్ మాజీ ఫుట్‌బాలర్ లూయిస్ నార్టన్ డి మటోస్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న కారణంగా, భారత జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తుందని, ఈ మెగా టోర్నీలో తన ఉనికిని చాటుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

10/04/2017 - 23:01

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత క్రికెట్ జట్టు రానున్న రెండుమూడు నెలల్లో తీరిక లేకుండా సిరీస్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో టెస్టు, వనే్డ సిరీస్‌లను విజయవంతంగా ముగించిన విరాట్ కోహ్లీ సేన ఇప్పుడు టి-20 సిరీస్‌కు సిద్ధమవుతున్నది. ఇందులో మొదటి టి-20 ఈనెల 7న రాంచీలో జరుగుతుంది. 10న గౌహతిలో, 13న హైదరాబాద్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు ఆడుతుంది.

10/05/2017 - 21:07

లండన్, అక్టోబర్ 4: మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ ట్రయికర్ హారీ కేన్‌పైనే భారం వేసి, ప్రపంచ కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌కు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమైంది. ఇటీవల కాలంలో ఆడిన ఎనిమిది క్లబ్, కౌంటీ మ్యాచ్‌ల్లో 13 గోల్స్ సాధించి కేన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వెంబర్లీలో శుక్రవారం స్లొవేనియాతో జరిగే మ్యాచ్‌లోనూ అతను రాణిస్తాడని, జట్టుకు గొప్ప ఆరంభాన్నిస్తాడని అంతా ఆశిస్తున్నారు.

10/04/2017 - 22:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే గొప్ప ఆస్తి అని, అందుకే, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా అనేక విజయాలను సాధించగలుగుతున్నాడని మాజీ కెప్టెన్ నయన్ మోంగియా వ్యాఖ్యానించాడు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, 2014 డిసెంబర్ 30న ధోనీ హఠాత్తుగా టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగాడు. దీనితో టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లీ చేతికి వచ్చాయి.

10/05/2017 - 21:06

దుబాయ్, అక్టోబర్ 3: మహిళల వనే్డ క్రికెట్‌లో భారత్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వనే్డ ర్యాంకింగ్స్ టీం విభాగంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఈ రెండు జట్లు సమానంగా 128 రేటింగ్ పాయింట్లను సంపాదించాయి. అయితే, ఇంగ్లాండ్ 34 మ్యాచ్‌లు ఆడగా, ఆస్ట్రేలియా 40 మ్యాచ్‌లు ఆడింది.

10/03/2017 - 23:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మైదానంలోకి దిగిన తర్వాత దూకుడుగా ఆడాలని, ప్రతి మ్యాచ్‌నీ అదే చివరి పోరాటంగా భావించాలని భారత అండర్-17 ఫుట్‌బాల్ జట్టుకు కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పిలుపునిచ్చారు. జట్టులోని 21 మంది సభ్యులను ఆయన మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సన్మానించారు. కెప్టెన్ అమర్‌జిత్ సింగ్ కియామ్‌కు ఒక జ్ఞాపికనిచ్చి సత్కరించారు.

10/03/2017 - 23:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సమర్థుడు కాబట్టే ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాలో వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు అవకాశం కల్పించారా? ఫిట్నెస్ సమస్యలు తప్ప ఫామ్ కోల్పోవడం అనే సమస్య అతనికి ఎప్పుడూ ఎదురుకాలేదా? యువ ఫాస్ట్ బౌలర్లతో పోటీపడే సత్తా అతనికి ఉందా? నెహ్రా 38 సంవత్సరాలను పూర్తి చేసుకొని బుధవారం నాటికి 158 రోజులు పూర్తవుతుంది.

10/03/2017 - 23:29

చెన్నై, అక్టోబర్ 3: ప్రో కబడ్డీ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్థానిక జట్టు తమిళ్ తలైవాస్‌పై తెలుగు టైటాన్స్ 21 పాయింట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. సూపర్ స్టార్ రాహుల్ చౌదరి 16 పాయింట్లతో రాణించగా, మొసెన్ మగ్‌సొద్లూ 12, నీలేష్ సాలుంకే 11 చొప్పున పాయింట్లు సంపాదించారు. వీరి విజృంభణకు టైటాన్స్‌కు 58 పాయింట్లు సాధమయ్యాయి.

Pages