S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/19/2017 - 00:47

బార్సిలోనాలో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటన మృతులకు బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ నివాళులర్పించింది. స్పానిష్ సాకర్ లీగ్ లా లిగా సీజన్‌కు సిద్ధమవుతున్న బార్సిలోనా క్లబ్ శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు రెండు నిమిషాలు వౌనం పాటించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ తదితర దేశాల్లోనూ వివిధ సాకర్ క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని సంతాపం తెలిపారు.

08/19/2017 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 18: తనకు కూడా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న ఇవ్వాలని కేంద్రానికి పారాలింపియన్ దీపా మాలిక్ లేఖ రాసింది. రియో పారాలింపిక్స్ మహిళల షాట్‌పుట్‌లో రజత పతకం సాధించిన దీపా మాలిక్ పేరు గత ఏడాది చర్చకు వచ్చింది. కానీ, అవార్డుల కమిటీ ఆమె అభ్యర్థిత్వం పట్ల ఆసక్తిని చూపలేదు.

08/19/2017 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 18: అవార్డుల విషయంలో పురుషులను అందలమెక్కిస్తూ, మహిళలను విస్మరిస్తున్నారని భారత మాజీ ఫుట్‌బాలర్ ఒయినమ్ బెమ్‌బెమ్ దేవి విమర్శించింది. ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు వరుసగా మూడోసారి దరఖాస్తు చేసుకొని విఫలమైన ఆమె మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని పిటిఐతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

08/19/2017 - 00:42

లక్నో, ఆగస్టు 18: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో అంతర్-మండల పోటీల్లో భాగంగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా మూడు పాయింట్ల తేడాతో యుపి యోద్ధపై విజయం సాధించింది. షాబీర్ బప్పు 13, అనూప్ కుమార్ 8, సురీందర్ సింగ్ 5 పాయింట్లతో రాణించడంతో యు ముంబా 37 పాయింట్లు సాధించింది. గాయం నుంచి కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన బప్పు తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం.

08/19/2017 - 00:40

మెల్బోర్న్, ఆగస్టు 18: భారత్‌లో పర్యటించే వనే్డ, టి-20 జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. రెండు జట్లు ఐదు వనే్డలు, మూడు టి-20 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీని స్టీవెన్ స్మిత్‌కే అప్పగించారు. అతనికి డిప్యూటీగా డేవిడ్ వార్నర్ ఉంటాడు. మిచెల్ స్టార్క్‌కు ఉద్వాసన పలికిన సెలక్టర్లు వనే్డల్లో జేమ్స్ ఫాల్క్‌నెర్‌కు మళ్లీ అవకాశం కల్పించారు.

08/19/2017 - 00:40

ముంబయి, ఆగస్టు 18: ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌కు సిద్ధమయ్యేందుకు భారత్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 97వ స్థానంలో ఉన్న భారత్ శనివారం తొలి ఫ్రెండ్లీలో మారిషస్‌ను ఢీ కొంటుంది. ర్యాంకింగ్స్‌లో మారిషస్ 160వ స్థానంలో ఉంది. ఆతర్వాత మరో ఫ్రెండ్లీలో, 125వ ర్యాంక్ జట్టు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌ను ఎదుర్కొంటుంది.

08/19/2017 - 00:40

న్యూఢిల్లీ, ఆగస్టు 18: సిన్సినాటి ఓపెన్ రోజర్స్ కప్‌లో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో పోపడుతున్న భారత ఆటగాడు రోహన్ బొపన్న క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. బొపన్న, డోడింగ్ జోడీ హోరాహోరీగా సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జువాన్ సెబాస్టియన్ కబాల్, ఫాబియో ఫోగ్నినీ జోడీని 5-7, 7-5, 10-8 తేడాతో ఓడించింది.

08/19/2017 - 00:49

న్యూఢిల్లీ, ఆగస్టు 18: భారత క్రికెట్ జట్టులో కొత్త ఒరవడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఆటగాడు ఫిట్నెస్‌పై దృష్టి సారిస్తున్నాడు. శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అతని అభిమానులు ఆశించారు. కానీ, జాతీయ సెలక్షన్ కమిటీ అతని పట్ల ఆసక్తి చూపలేదు.

08/18/2017 - 00:51

దంబుల్లా, ఆగస్టు 17: శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధమవుతున్నది. గురువారం ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించగా, అందరి దృష్టి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కేంద్రీకృతమైంది. కేదార్ జాధవ్, మనీష్ పాండే, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా తదితరులతో కలిసి 36 ఏళ్ల ధోనీ నెట్స్‌కు హాజరయ్యాడు.

08/18/2017 - 00:49

లాస్ వెగాస్, ఆగస్టు 17: పరాజం అన్నదే లేకుండా ఇంత వరకూ 49 విజయాలను నమోదు చేసిన ఫ్లాయిడ్ మేవెదర్‌కు ఓటమి తప్పదని అతనిని చాలెంజ్ చేస్తున్న అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ (యుఎఫ్‌సి) హీరో కానర్ మెక్‌గ్రెగర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈనెల 26న జరగబోయే ఫైట్ కోసం తీరిక లేకుండా శ్రమిస్తున్న అతను ఒక చాలెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేవెదర్ విజయపరంపరకు బ్రేక్ పడుతుందని జోస్యం చెప్పాడు.

Pages