S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/27/2017 - 00:57

న్యూయార్క్, ఆగస్టు 26: ఫ్లషింగ్ మెడోస్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల విభాగంలో రాఫెల్ నాదల్, మహిళల విభాగంలో కరొలినా ప్లిస్కోవా టాప్ ర్యాంకింగ్స్‌ను సంపాదించారు. నాదల్ ఇటీవలే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను తిరిగి పొందిన విషయం తెలిసిందే. ప్లిస్కోవా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది.

08/27/2017 - 00:54

ముంబయి, ఆగస్టు 26: మోనూ గోయత్ విజృంభణతో తమిళ తలైవాస్‌పై పాట్నా పైరేట్స్ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పైరేట్స్ 35 పాయింట్లు చేయగా, తలైవాస్ జట్టు 24 పాయింట్లకు పరిమితమైంది. మోనూ 11 పాయింట్లు చేసి పైరేట్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పర్‌దీప్ నర్వాల్ 6, జైదీప్ 5 చొప్పున పాయింట్లు సంపాదించారు. తలైవాస్ ఆటగాడు అజయ్ ఠాకూర్ శ్రమ వృథా అయింది.

08/25/2017 - 00:30

గ్లాస్గో, ఆగస్టు 24: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పివి సింధు క్వార్టర్ పైనల్స్ చేరింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. 2013, 2014 సంవత్సరాల్లో కాంస్య పతకాలను సాధించిన సింధు ప్రీ క్వార్టర్స్‌లో హాంకాంగ్‌కు చెందిన చెన్ గన్ ఇని 19-21, 23-21, 21-17 తేడాతో ఓడించింది.

08/25/2017 - 00:28

పల్లేకల్, ఆగస్టు 24: శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వనే్డలో టీమిండియా నిలకడలేని ఆటను ప్రదర్శించి, అతి కష్టం మీద మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

08/25/2017 - 00:27

శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్‌విల్లా సి శిఖర్ ధావన్ బి జస్‌ప్రీత్ బుమ్రా 31, దనుష్క గుణతిలక స్టంప్డ్ మహేంద్ర సింగ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 19, కుశాల్ మేండిస్ ఎల్‌బి యుజువేంద్ర చాహల్ 19, ఉపుల్ తరంగ సి విరాట్ కోహ్లీ బి హార్దిక్ పాండ్య 9, ఏంజెలో మాథ్యూస్ ఎల్‌బి అక్షర్ పటేల్ 20, మిలింద సిరివర్దన సి రోహిత్ శర్మ బి జస్‌ప్రీత్ బుమ్రా 58, చమర కపుగడేర బి జస్‌ప్రీత్ బుమ్రా 40, అకిల దనంజయ సి అక్షర్ పట

08/25/2017 - 00:26

పారిస్, ఆగస్టు 24: ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, పతకాన్ని సాధించే సత్తా ఉందనుకున్న వినేష్ ఫొగట్ ఇక్కడ ప్రారంభమైన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించారు. మహిళల 60 కిలోల విభాగంలో జర్మనీకి చెందిన లాసా నిమెచ్‌తో తలపడిన సాక్షి 1-3 తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

08/25/2017 - 00:26

టైపీ సిటీ, ఆగస్టు 24: ఇక్కడ జరుగుతున్న 29వ ప్రపంచ యూనివర్శిటీ గేమ్సలో భారత అథ్లెట్ సంజీవని జాధవ్ రజత పతకాన్ని సాధించింది. మహిళల 10,000 మీటర్ల పరుగులో పాల్గొన్న ఆమె 33:22.00 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానాన్ని సంపాదించింది. కిర్జిస్తాన్‌కు చెందిన డరియా మాస్లోవా 33:19.27 నిమిషాల సమయంతో స్వర్ణ పతకాన్ని అందుకుంది.

08/25/2017 - 00:26

హాంబర్గ్, ఆగస్టు 24: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత బాక్సర్లు సిద్ధమయ్యారు. 2009, 2011, 2015 ఈవెంట్స్‌లో భారత్ ఒక్కో కాంస్య పతకాన్ని అందుకుంది. తొలుత విజేందర్ సింగ్ పతకాన్ని సాధించగా, 2011లో వికాస్ క్రిషన్, 2015లో శివ థాపా భారత్‌కు పతకాలు అందించారు. ఈసారి మరింత ఉత్తమ ఫలితాలను రాబట్టడమే లక్ష్యంగా భారత బృందంలోని బాక్సర్లు స్పష్టం చేశారు.

08/24/2017 - 02:26

పల్లేకల్: శ్రీలంకతో జరిగిన మొదటి వనే్డలో ఆడిన జట్టునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పు లేకుండా గురువారం నాటి రెండో మ్యాచ్‌లో మైదానంలోకి దించే అవకాశాలున్నాయి. ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి కోహ్లీ సుముఖత వ్యక్తం చేయడని చాలా సందర్భాల్లో రుజవైంది. చివరికి వెస్టిండీస్ టూర్‌లోనూ అతను ప్రయోగాలకు సిద్ధపడలేదు.

08/24/2017 - 02:25

పల్లేకల్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోస్యం చెప్పాడు. రానున్న మూడు నెలల్లో రెండు పదులకుపైగా వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉన్నందున అతని ఆట గాడిలో పడుతుందన్న నమ్మకం తనకు ఉందని కోహ్లీ అన్నాడు. 2019 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచి జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కోహ్లీ తెలిపాడు.

Pages