S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/23/2017 - 01:06

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 22: ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఢీకొని, పరాజయాన్ని చవిచూసినప్పటికీ, వెస్టిండీస్‌పై టీమిండియా పేవరిట్ ముద్రతోనే బరిలోకి దిగుతున్నది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు.

06/23/2017 - 01:05

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 22: అత్యుత్తమ క్రికెటర్‌గా అనిల్ కుంబ్లేను గౌరవిస్తానని, అతను దేశానికి చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుంటాయని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే, కోచ్‌గా కుంబ్లే సాధించిన విజయాలను అతను ప్రస్తావించలేదు.

06/23/2017 - 01:03

న్యూఢిల్లీ, జూన్ 22: భారత బాక్సర్ విజేందర్ సింగ్, చైనాకు చెందిన జుల్పీకర్ మైమైతియాలి మధ్య డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్, డబ్ల్యుబివో ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ కోసం ఆగస్టు మొదటి వారంలో ఫైట్ జరగనుంది. డబ్లుబివో ఈ విషయాన్ని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫైట్ గురించి విజేందర్ మాట్లాడుతూ, జుల్పీకర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు.

06/23/2017 - 01:01

సిడ్నీ, జూన్ 22: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ పోరాడనున్నారు. ప్రీ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 15-21, 21-13, 21-13 ఆధిక్యంతో సన్ వాన్ హోను ఓడించగా, మరో మ్యాచ్‌లో ప్రణీత్ 21-15, 18-21, 21-13 తేడాతో హువాంగ్ యు జియాంగ్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.

06/23/2017 - 01:00

క్రైస్ట్‌చర్చి, జూన్ 22: న్యూజిలాండ్ వికెట్‌కీపర్ ల్యూక్ రోన్చీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా టి-20 ఫార్మాట్‌లో జరిగే టోర్నీల్లో అతను ఆడతాడు. న్యూజిలాండ్‌లో పుట్టినప్పటికీ, ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన అతను ఆ దేశం తరఫున నాలుగు వనే్డలు, మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆతర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి, కివీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

06/23/2017 - 00:59

న్యూఢిల్లీ, జూన్ 22: కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పూర్తిగా కోలుకోక పోవడంతో, ఈ ఏడాది అక్టోబర్ మాసంలో కెనడాలో జరిగే ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్ నుంచి దీపా కర్మాకర్ వైదొలగింది. రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడం ద్వారా సంచలనం సృష్టించిన ఆమె ఆతర్వాత అంతర్జాతీయ పోటీలకు హాజరుకాలేదు. కాలి కండరాలు బెణకడంతో బాధపడిన ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో శస్త్ర చికిత్స చేశారు.

06/23/2017 - 00:56

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య ఇప్పటి వరకూ 116 వనే్డ ఇంటర్నేషనల్స్ జరిగాయి. భారత్ 53 విజయాలు నమోదు చేయగా, విండీస్ 60 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. రెండు వనే్డల్లో ఫలితం వెల్లడికాలేదు. ఈ గణాంకాలను బట్టి చూస్తే భారత్‌పై విండీస్ ఆధిపత్యం స్పష్టమవుతుంది.

06/22/2017 - 03:00

న్యూఢిల్లీ, జూన్ 21: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అద్భుతమైన ఎత్తుగడతో చిత్తుచేశాడనే చెప్పాలి. సరైన సమయంలో అతను వేసిన గుగ్లీకి కోహ్లీ ఆత్మరక్షణలో పడిపోయాడు. కోహ్లీకి తనంటే పడడం లేదని, తమ మధ్య సయోధ్య అసాధ్యమని పేర్కొంటూ కోచ్‌గా తన నిష్క్రమణ సమయంలో కుంబ్లే బాంబు పేల్చాడు.

06/22/2017 - 02:59

న్యూఢిల్లీ, జూన్ 21: టీమిండియాకు కొత్త కోచ్‌ని నియమించే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కసరత్తును ముమ్మరం చేసింది. వెస్టిండీస్ టూర్ ముగిసే వరకూ కోచ్‌గా కొనసాగాల్సిందిగా చేసిన సూచనను అనిల్ కుంబ్లే నిరాకరించడంతో బిసిసిఐ కోచ్ పదవికి మరికొన్ని దరఖాస్తులను తీసుకోవాలని నిర్ణయించింది.

06/22/2017 - 02:58

న్యూఢిల్లీ: వచ్చేనెల శ్రీలంక టూర్‌కు టీమిండియా వెళ్లనుండగా, ఈలోపే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. కోచ్ ఎంపికకు ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలోనే సిఎసి ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపాడు. కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని అతను పరోక్షంగా అంగీకరించాడు.

Pages