S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/17/2017 - 00:21

బర్మింగ్‌హామ్, జూన్ 16: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు పుంజుకోవడం తనను ఆకట్టుకుందని, అయినప్పటికీ ఆదివారం ఆ జట్టుతో జరిగే టైటిల్ పోరు గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం తమకు లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

06/17/2017 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 16: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రీ తన కెరీర్‌లో మరింత ఉన్నత శిఖరాన్ని అధిరోహించాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ప్రస్తుత ఆటగాళ్ల జాబితాలో అతను నాలుగో వాడిగా ఆవిర్భవించాడు. కిర్గిజ్ రిపబ్లిక్‌తో మంగళవారం జరిగిన ఎఎఫ్‌సి ఆసియా కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెత్రీ నిర్ణాయక గోల్ సాధించడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

06/17/2017 - 00:25

జకార్తా, జూన్ 16: ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న భారత ఆటగాడు హెచ్‌ఎస్.ప్రణయ్ తన జైత్రయాత్రలో మరో అద్భుతాన్ని సాధించాడు. జెయింట్ కిల్లర్2గా పేరు పొందిన అతను శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను మట్టికరిపించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

06/16/2017 - 01:00

బర్మింగ్‌హామ్, జూన్ 15: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో టైటిల్‌కు చేరువైంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

06/16/2017 - 00:57

లండన్, జూన్ 15: లండన్‌లో జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) సెమీ ఫైనల్స్‌లో భారత్ శుభారంభాన్ని సాధించింది. గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో పసికూన స్కాట్లాండ్ జట్టును మట్టికరిపించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే (6వ నిమిషంలో) స్కాట్లాండ్ కెప్టెన్ క్రిస్ గ్రాసిక్ తమ జట్టుకు అనూహ్యమైన గోల్‌ను అందించాడు.

06/16/2017 - 00:57

జకార్తా, జూన్ 15: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు హెచ్‌ఎస్.ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో వీరిద్దరూ తమతమ ప్రత్యర్థులపై సంచలన విజయాలు నమోదు చేశారు.

06/16/2017 - 00:55

జకార్తా, జూన్ 15: ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు ‘తెలుగు తేజం’ పివి.సింధుకి చుక్కెదురైంది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో వీరిద్దరూ తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

06/16/2017 - 00:54

బర్మింగ్‌హామ్, జూన్ 15: త్వరలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటన సందర్భంగా పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో ఆడేందుకు భారత సెలెక్టర్లు గురువారం ఇక్కడ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు.

06/16/2017 - 00:53

న్యూఢిల్లీ, జూన్ 15: నెదర్లాండ్స్‌లో జరుగుతున్న రీకో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటం పేలవంగా ముగిసింది.

,
06/15/2017 - 02:01

కార్డ్ఫి, జూన్ 14: చాంపి యన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్ని లో పాకిస్తాన్ మరో సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మొద టి సెమీ ఫైనల్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసి, ఫైనల్‌కు దూసుకె ళ్లింది.

Pages