S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/20/2017 - 03:27

ఢాకా, జూన్ 19: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఓడిపోవడంతో సర్వత్రా విషాదం అలుముకుంది. ఈ ఓటమిని సహించలేక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ భారత అభిమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 180 పరుగుల భారీ తేడాతో, అదీ పాకిస్తాన్‌పై ఓడిపోవటం అతణ్ణి కలచివేసిందని, దీంతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

06/20/2017 - 03:26

ఇస్లామాబాద్, జూన్ 19: చాంపియన్స్ ట్రోఫీలో 180 పరుగుల తేడాతో దాయాది భారత్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని పాకిస్తాన్ నమోదు చేయటంపై ఆ దేశ ఆర్మీ సంబరాలు చేసుకుంది. బలూచిస్తాన్ సెక్టార్‌లోని సైనిక శిబిరంలో పాక్ సైనికులు ఆనందంతో కేరింతలు కొట్టిన ఫోటోలను ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా విజయ సంకేతంతో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘ఇదే మన బలోచిస్తాన్. జోక్యం చేసుకోకండి.

06/20/2017 - 03:25

న్యూఢిల్లీ, జూన్ 19: భారత హాకీ స్టార్ సర్దార్ సింగ్ పట్ల బ్రిటన్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో సర్దార్ సింగ్‌పై దాదాపు ఏడాది క్రితం నమోదైన కేసులో విచారణకు రావలసిందిగా బ్రిటన్ పోలీసులు సోమవారం అతడిని ఆదేశించారు.

06/20/2017 - 03:23

న్యూఢిల్లీ, జూన్ 19: టీమిండియా వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌పై వేటు పడింది. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ రంజీ క్రికెట్ జట్టు కోచ్ కెపి.్భస్కర్‌తో ఘర్షణకు దిగినందుకు శనివారం గంభీర్‌పై నిషేధం విధించి నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేశారు.

06/20/2017 - 03:22

గాంగ్జూ (చైనా), జూన్ 19: చైనాలోని గాంగ్జూలో ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల మధ్య జరుగుతున్న క్రీడా పోటీల్లో భారత ఉషు జట్టు ఆరు పతకాలతో సత్తా చాటుకుంది. వీటిలో రెండు పసిడి పతకాలు, రెండు రజత పతకాలు, మరో రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పోటీల్లో భారత ఉషు క్రీడాకారులు తమకంటే ఎంతో అనుభవజ్ఞులైన చైనా, రష్యా క్రీడాకారులకు తీవ్రమైన పోటీ ఇవ్వడం గమనార్హం.

06/19/2017 - 02:07

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని దాయాది దేశం పాకిస్తాన్ ఎగరేసుకుపోయంది. అన్ని విభాగాల్లో పేలవమైన ఆట తీరు ప్రదర్శించిన కోహ్లీ సేన సునాయాసంగా చేతులెత్తేసింది. దీంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని తొలిసారి ముద్దాడే అవకాశం పాక్‌కు దక్కింది.

06/19/2017 - 01:59

లండన్, జూన్ 18: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా ఘోరంగా చతికిలబడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఆదివారం ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై టైటిల్‌ను చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా చక్కగా రాణించారు. ప్రత్యేకించి కొత్త ఆటగాడు ఫఖర్ జమన్ తొలి వనే్డలోనే సెంచరీతో సత్తా చాటుకున్నాడు.

06/19/2017 - 01:56

లండన్, జూన్ 18: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్లో దాయాది పాక్ చేతిలో ఘోరంగా ఓడినప్పటికీ హాకీలో మాత్రం మనవాళ్లు పాక్‌ను చిత్తు చేసి అభిమానులకు కాస్త ఊరట కలిగించారు.

06/19/2017 - 01:54

లండన్, జూన్ 18: వచ్చే ఏడాది జరగాల్సిన ట్వంటీ-20 ప్రపంచ చాంపియన్‌షిప్ ఏడో ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్‌ను రద్దు చేసి 2020లో దీనిని నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సిద్ధమవుతోంది. ప్రపంచంలోని ప్రధాన క్రికెట్ జట్లు 2018లో పలు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడాల్సి ఉండటమే ఇందుకు కారణం. ఐసిసిలోని ఉన్నతాధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

06/19/2017 - 01:53

లండన్, జూన్ 18: భారత్, పాకిస్తాన్‌ల మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కారణంగా ఇరు దేశాల్లోను అభిమానులు వెర్రెక్కి పోతున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చెందిన ఒక ఫోటో కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ముఖాలపై చిరునవ్వులను తీసుకు వచ్చింది. ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలో ధోనీ పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కుమారుడ్ని ఎత్తుకొని ఉన్నాడు.

Pages