S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/19/2017 - 01:51

జకార్తా, జూన్ 18: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 22వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన క్వాలిఫయర్ ఆటగాడు కజుమసా సకాయ్‌ని వరుస గేముల తేడాతో మట్టికరిపించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

06/18/2017 - 01:50

లండన్, జూన్ 17: దాయాది దేశాలయిన భారత్, పాక్‌ల మధ్య ఏ పోటీ జరిగినా రెండు దేశాల్లో అభిమానులకు పండగే. అది జాతీయ క్రీడ అయిన హాకీ కావచ్చు లేదా అత్యధికులు అభిమానించే క్రికెట్ కావచ్చు.. ఇరు దేశాల్లోను అభిమానులు తమ దేశమే విజయం సాధించాలని కోరుకొంటూ ఉంటారు. ఈ క్రీడా శత్రుత్వం ఈ నాటిది కాదు.. శతాబ్దాలుగా ఉన్నదే.

06/18/2017 - 01:13

లండన్, జూన్ 17: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదుల భీకర సమరానికి మరికొద్ది గంటల్లో తెర లేవబోతోంది. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం ఆదివారం ఇక్కడ జరుగనున్న తుది పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు సిద్ధమవడంతో ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఈ మ్యాచ్‌పై కేంద్రీకృతమై ఉంది.

06/18/2017 - 01:07

లండన్, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం ఫైనల్‌లో తలపడబోతున్న భారత జట్టుకు చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ కోసం శనివారం ఇక్కడ భారత జట్టు సాధన చేస్తుండగా, ఫీల్డింగ్ సెషన్‌లో ప్రీమియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుడి మోకాలికి స్వల్ప గాయమైంది.

06/18/2017 - 01:06

కరాచీ, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురయిన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్‌కు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ ఓ సువర్ణావకాశమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయ పడ్డాడు.

06/18/2017 - 01:04

లండన్, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగే ఫైనల్ పోటీలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఆటగాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.

06/18/2017 - 01:02

లండన్, జూన్ 17: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) సెమీ-ఫైనల్ టోర్నమెంట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 4-1 గోల్స్ తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు తాజాగా శనివారం ఇక్కడ రెండో మ్యాచ్‌లో 3-0 తేడాతో కెనడాను మట్టికరిపించి వరుసగా మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

06/18/2017 - 01:01

జకార్తా, జూన్ 17: ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌కు చేరువయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 22వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ శనివారం జకార్తా కనె్వన్షన్ సెంటర్ (జెసిసి)లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సన్ వాన్ హోపై సంచలన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

06/17/2017 - 00:22

న్యూఢిల్లీ, జూన్ 16: తైవాన్‌లో జరుగుతున్న ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారతీయులు శుక్రవారం ఐదు పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటుకున్నారు. వీటిలో మహిళా రెజ్లర్లు మూడు పతకాలను సాధించగా, పురుషుల గ్రీకో-రోమన్ విభాగంలో మరో రెండు పతకాలు లభించాయి.

06/17/2017 - 00:22

ముంబయి, జూన్ 16: అంతర్జాతీయ వనే్డ క్రికెట్ చరిత్రలో 300 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ కూడా చేరాడు.

Pages