S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/22/2017 - 02:58

సిడ్నీ, జూన్ 21: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధు ఇక్కడ ప్రారంభమైన ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ విభాగంలో శుభారంభం చేశారు. మొదటి రౌండ్‌లో సైనా కొరియాకు చెందిన సంగ్ జీ హ్యున్‌ను 21-10, 21-16 తేడాతో ఓడించి, రెండో రౌండ్ చేరింది. సింధు 21017, 14-21, 21-18 ఆధిక్యంతో జపాన్ క్రీడాకారిణి సయాకా సాటోపై విజయం సాధించింది.

06/22/2017 - 02:57

వెస్టిండీస్‌లో భారత జట్టు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సునీల్ గవాస్కర్. ‘లిటిల్ మాస్టర్’ గవాస్కర్ అంటే విండీస్ క్రికెట్ అభిమానులకు వల్లమాలిన అభిమానం. భారత జట్టును గవాస్కర్ జట్టుగా పిలిచేవారంటే, అతనిని వారు ఎంతగా ఆరాధించేవారో స్పష్టమవుతుంది. విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ గవాస్కరే కావడం విశేషం. అతను 27 మ్యాచ్‌ల్లో 46 ఇన్నింగ్స్ ఆడి, 2,749 పరుగులు చేశాడు.

06/22/2017 - 02:56

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (జమైకా), జూన్ 21: వెస్టిండీస్ టూర్ కోసం బుధవారం ఇక్కడికి చేరుకున్న భారత క్రికెటర్లకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఘన స్వాగతం లభించింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) అధికారులతోపాటు, పలువురు ప్రముఖులు టీమిండియాకు ఆహ్వానం పలికారు. విమానాశ్రయం నుంచి వీరిని నేరుగా హోటల్‌కు తీసుకెళ్లారు.

06/21/2017 - 01:57

న్యూఢిల్లీ, జూన్ 20: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే గుడ్‌బై చెప్పాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, కుంబ్లేకి మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయన్న వదంతుల నడుమ అతను కోచ్ పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఉన్నతాధికారులెవరూ అందుబాటులో లేరు.

06/21/2017 - 01:56

లండన్, జూన్ 20: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఇకమీదట జరగదా? భారత్ వేదికగా 2021లో జరగాల్సిన ఈ టోర్నీ తదుపరి ఎడిషన్‌ను రద్దు చేసి, ఈ నాలుగేళ్ల వ్యవధిలో రెండు సార్లు ప్రపంచ కప్ ట్వంటీ-20 చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించాలనుకుంటున్నామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సిఇఓ డేవిడ్ రిచర్డ్‌సన్ వెల్లడించాడు.

06/21/2017 - 01:54

సిడ్నీ, జూన్ 20: కామనె్వల్త్ క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన భారత షట్లర్ పారుపల్లి కశ్వప్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఆరంభంలోనే విషమ పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం ఇక్కడ వరుసగా రెండు క్వాలిఫయింగ్ పోటీల్లో విజయం సాధించి మెయిన్ డ్రాకు అర్హత సాధించిన కశ్యప్ తొలి రౌండ్‌లో కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సన్ వాన్ హోతో తలపడనున్నాడు.

06/21/2017 - 01:53

లండన్, జూన్ 20: హాకీ వరల్డ్ లీగ్ (డబ్ల్యుహెచ్‌ఎల్) సెమీ ఫైనల్ టోర్నమెంట్‌లో భారత జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఈ టోర్నీలో వరుసగా స్కాట్లాండ్, కెనడా, పాకిస్తాన్ జట్లను చిత్తుచేసి ‘హ్యాట్రిక్’ సాధించిన భారత జట్టు మంగళవారం ఇక్కడ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానంలో ఉన్న నెదర్లాడ్స్ జట్టు చేతిలో 1-3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి.

06/21/2017 - 01:51

చెన్నై, జూన్ 20: త్వరలో ప్రారంభమయ్యే ఐదో సీజన్ ద్వారా ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్)లో అరంగేట్రం చేయబోతున్న చెన్నై ఫ్రాంచైజీ తమ జట్టుకు ‘తమిళ్ తలైవాస్’ అని పేరు పెట్టుకుంది. ఈ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ ‘ట్విట్టర్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

06/20/2017 - 03:32

సిడ్నీ, జూన్ 19: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా ఆవిర్భవించి కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న గుంటూరు యువకుడు కిదాంబి శ్రీకాంత్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌పై దృష్టి కేంద్రీకరించాడు.

06/20/2017 - 03:30

దుబాయ్, జూన్ 19: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియాను మట్టికరిపించి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకున్న పాకిస్తాన్ జట్టు అంతర్జాతీయ ఉత్తమ వనే్డ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఒకేసారి రెండు స్థానాలను మెరుగు పర్చుకుని ఆరో ర్యాంకుకు దూసుకెళ్లింది.

Pages