S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/07/2017 - 00:55

ఆంటిగ్వా, మార్చి 6: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ క్రికెట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్ తాజాగా ఆంటిగ్వాలో జరిగిన రెండో వనే్డలోనూ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంది.

03/07/2017 - 00:54

న్యూఢిల్లీ, మార్చి 6: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ క్రికెట్ జట్టుకు సేవలు అందిస్తున్న పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (ఆర్‌పిఎస్) కొనుగోలు చేసింది. దీంతో అతను ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 10వ ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు సేవలు అందించనున్నాడు.

03/06/2017 - 00:48

బెంగళూరు, మార్చి 5: టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆతిథ్య భారత బౌలర్లను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ సమర్ధవంతంగా ప్రతిఘటించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు నష్టపోయి 237 పరుగులు సాధించిన కంగారూలు టీమిండియా కంటే 48 పరుగుల ఆధిక్యత సాధించారు.

03/06/2017 - 00:46

బెంగళూరు, మార్చి 5: భారత పర్యటనలో వయసుకు మించిన పరిణతితో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాట్ రెన్షా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌నుంచి ఎదురైన స్లెడ్జింగ్‌ను కూడా అంతే దీటుగా ఎదుర్కొన్నాడు. నిజానికి బెంగళూరు టెస్టు రెండో రోజు కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లను పదే పదే మాటల తూటాలతో రెచ్చగొడుతూనే వచ్చాడు.

03/06/2017 - 00:46

బెంగళూరు, మార్చి 5: ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్ కకావికలవుతున్నప్పటికీ తమ బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి లోపమూ లేదని చటేశ్వర్ పుజారా అంటున్నాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో ఘోరపరాజయం పాలయిన తర్వాత ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో కూడా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలవుట్ అయిన విషయం తెలిసిందే.

03/06/2017 - 00:45

భోపాల్, మార్చి 5: బెలారస్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో మ్యాచ్‌లో భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించి వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించింది.

03/06/2017 - 00:45

అకాపల్కో (మెక్సికో), మార్చి 5: మెక్సికో ఓపెన్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు శామ్ క్వెరీ సంచలనం సృష్టించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 40వ స్థానంలో కొనసాగుతున్న అతను పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన రెండో సీడ్ ఆటగాడు రాఫెల్ నాదల్‌ను 6-3, 7-6(7/3) వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకు పోయాడు.

03/06/2017 - 00:44

న్యూఢిల్లీ, మార్చి 5: బెంగళూరులో ఈ నెల 8వ తేదీన జరుగనున్న క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అనుంబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు బహిష్కరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి బిసిసిఐ ‘షరతుల’తో కూడిన ఆహ్వానాలను పంపడమే ఇందుకు కారణం.

03/05/2017 - 01:33

బెంగళూరు, మార్చి 4: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత బ్యాటింగ్ విభాగం తాజాగా శనివారం బెంగళూరులో ప్రారంభమైన రెండో టెస్టులోనూ అదేవిధంగా విఫలమైంది. 50 పరుగులకే 8 వికెట్లను కైవసం చేసుకుని టీమిండియా పతనాన్ని శాసించిన ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసుకున్నాడు.

03/05/2017 - 01:30

బెంగళూరు, మార్చి 4: ‘పాముపడగ’లాంటి కోహ్లీ వికెట్ తీసినందుకు తనకెంతో సంతోషంగా ఉందని ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో శనివారం తొలి రోజే భారత జట్టు వెన్నువిరిచిన ఆస్ట్రేలియా ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియోన్ అన్నాడు. అయితే కోహ్లీ తన స్వయంకృతాపరాధం కారణంగానే అవుటయ్యాడని అతను అభిప్రాయ పడ్డాడు. ఎలాంటి షాట్ ఆఫర్ చేయకపోవడం ద్వారా కోహ్లీ తప్పు చేశాడని, ఆ కారణంగానే అతను అవుటయ్యాడని లియోన్ అన్నాడు.

Pages