S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/11/2016 - 07:37

రియో డి జెనీరో: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు రియో ఒలింపిక్స్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. సోదరి వీనస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగి ఓటమిపాలైన సెరెనాకు సింగిల్స్‌లోనూ అదే పరిస్థితి తప్పలేదు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆమెను ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటోలినా 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించింది.

08/11/2016 - 07:37

గ్రాస్ ఇస్లెట్, ఆగస్టు 10: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లోనూ రాణించి అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా సెంచరీ సాధించాడు. అశ్విన్‌కు ఇది కెరీర్‌లో నాలుగో సెంచరీ. సాహా ఖాతాలో ఇదే తొలి టెస్టు సెంచరీ.

08/11/2016 - 07:36

రియో డి జెనీరో, ఆగస్టు 10: రియో ఒలింపిక్స్‌లో రోజుకో అపశృతి దొర్లుతోంది. నిరసన ప్రదర్శనలు, సౌకర్యాల లేమి వంటివి సాధారణమైతే, తాజాగా పాత్రికేయులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

08/11/2016 - 07:36

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ఫ్లాప్ షో కొనసాగుతున్న నేపథ్యంలో, గురువారం నుంచి మొదలయ్యే బాడ్మింటన్‌పై అందరు దృష్టి కేంద్రీకరించారు. మహిళల సింగిల్స్‌లో పోటీపడుతున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్‌పైనే అభిమానులు ఆశపెట్టుకున్నారు. తెలుగు తేజం పివి సింధు కూడా బరిలోకి దిగనుంది.

08/11/2016 - 07:11

రియో డి జెనీరో: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రియో ఒలింపిక్స్ పురుషుల 75 కిలోల విభాగంలో ప్రీ క్వార్టర్స్ చేరాడు. ఒలింపిక్స్‌లో తొలిసారి అడుగుపెట్టిన అమెరికా బాక్సర్ చార్లెస్ కాన్‌వెల్‌ను సులభంగా ఓడించాడు. వికాస్ పంచ్‌ల నుంచి తప్పించుకోవడానికి తంటాలుపడిన కాన్‌వెల్ ఎదురుదాడికి దిగలేకపోయాడు. అతనిని పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టిన వికాస్ 3-0 తేడాతో గెలిచి ముందంజ వేశాడు.

08/11/2016 - 07:10

రియో డి జెనీరో, ఆగస్టు 10: భారత మహిళా ఆర్చర్ లైష్రామ్ బొంబాల్యా దేవి పతకాలపై ఆశలు పెంచింది. మహిళల ఇండివిజువల్ రికర్వ్ ఎలిమినేషన్స్‌లో చక్కటి ప్రతిభ కనబరచి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

08/10/2016 - 08:09

రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత జట్టు పెద్ద గండం నుంచి గట్టెక్కి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను మెరుగుపర్చుకుంది. మంగళవారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో భారత జట్టు 2-1 తేడాతో అర్జెంటీనా జట్టుపై విజయం సాధించింది.

08/10/2016 - 08:07

న్యూఢిల్లీ, ఆగస్టు 9: గత ఏడాది వరస విజయాలతో మహిళా టెన్నిస్‌లో సంచనాలు సృష్టించిన సానియా మీర్జా- హింగిస్ జోడీ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి గత ఏడాది మొత్తం 9 టైటిళ్లను గెలుచుకుని నంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే గత అయిదు నెలలుగా ఈ జోడీ ఆశించిన రీతిలో రాణించలేక పోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సానియా సన్నిహిత వర్గాలు తెలిశాయి.

08/10/2016 - 08:07

న్యూఢిల్లీ, ఆగస్టు 9: వచ్చే అక్టోబర్ 15 లోగా 15 సంస్కరణలను అమలు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)ని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ స్పష్టంగా ఆదేశించింది. రాజ్యాంగ సంస్కరణలు మొదలుకొని, వందలాది కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే టీవీ కాంట్రాక్ట్‌లు సహా వివిధ కాంట్రాక్ట్ ఇవ్వడానికి సంబందించిన సంస్కరణలు వీటిలో ఉన్నాయి.

08/10/2016 - 08:06

రియో డి జెనిరో, ఆగస్టు 9: ఒలింపిక్స్‌లో వాల్ట్స్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారత జిమ్నాస్టుగా చరిత్ర సృష్టించడంతో పాటు కోట్లాది మంది భారత క్రీడాభిమానుల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న దీపా కర్మాకర్‌ను అమె కోచ్ విశే్వశ్వర్ నంది ‘గృహ నిర్బంధం’లో ఉంచాడు.

Pages