S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/12/2016 - 00:19

లక్నో, డిసెంబర్ 11: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాలపై కనే్నసింది. మొదటి మ్యాచ్‌లో కెనడాను 5-0 తేడాతో చిత్తుచేసిన హర్జీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌పై 5-3 ఆధిక్యంతో విజయం సాధించింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది.

12/12/2016 - 00:17

మాడ్రిడ్, డిసెంబర్ 11: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగా టోర్నమెంట్‌లో భాగంగా ఒసాసునాతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ చెలరేగిపోయాడు. చివరి వరకూ వ్యూహాత్మక డిఫెన్స్‌తో సరిపుచ్చిన బార్సిలోనా మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు దాడులకు ఉపక్రమించింది. మెస్సీ రెండు మెరుపు గోల్స్ చేయగా, లూయిస్ సౌరెజ్ ఒక గోల్ చేశాడు. ఒసాసునా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

12/11/2016 - 07:38

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ. కెరీర్‌లో 15వ టెస్టు సెంచరీని సాధించిన అతను 147 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు
ఎనిమిదో టెస్టు శతకాన్ని నమోదు చేసిన మురళీ విజయ్

12/11/2016 - 07:34

లండన్, డిసెంబర్ 10: ఇక్కడ ప్రారంభమైన లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ మొదటి రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతను తొలి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఫాబియానో కరువానాతో తలపడి, డ్రాగా ముగించాడు. మరో గేమ్‌లో మైఖేల్ ఆడమ్స్‌ను లెవోన్ ఆరోనియన్ ఓడించగా, వెస్లే సో తన ప్రత్యర్థి హికారూ నాకమూరపై గెలుపొందాడు.

12/11/2016 - 07:33

త్రిపుర, డిసెంబర్ 10: జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 69 కిలోల వెల్టర్‌వెయిట్ విభాగంలో ఒలింపియన్ మనోజ్ కుమార్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. తన సాధారణ విభాగం కంటే మెరుగైన వెయట్‌లో పోటీపడుతున్న అత ను తమ ప్రత్యర్థిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి కరి పించి, టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు.

మేఘాలయకు చెందిన తిలోక్ బుద్ధాను ఓడించి, క్వార్టర్ ఫైనల్స్ చేరిన మనోజ్ కుమార్ (ఎడమ)

12/11/2016 - 07:33

లక్నో, డిసెంబర్ 10: జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని 5-3 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్, మధ్యలో విఫలమైంది. చివరి క్షణాల్లో మరోసారి చెలరేగినప్పటికీ ఫలితం లేకపోయింది. మ్యాచ్ 10వ నిమిషంలోనే జాక్ క్లీ ద్వారా ఆ జట్టుకు తొలి గోల్ లభించింది.

12/11/2016 - 07:32

సియోగ్‌విపో, డిసెంబర్ 10: కొరియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ పరాజయాన్ని చవిచూశాడు. గాయాల కారణంగా చాలాకాలం వివిధ టోర్నీలకు దూరమైన అతను ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదన్న విషయం తెలిసిందే. ఆరంభ రౌండ్స్‌తోనే అతని పోరాటం ముగుస్తున్నది. అయితే, కొరియా మాస్టర్స్‌లో అతను మెరుగైన ఆటతో రాణించాడు.

12/10/2016 - 00:50

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టడం ఇది 23వ సారి. ఎక్కువ పర్యాయాలు ఫైవ్ వికెట్స్ హౌల్ సాధించిన భారత బౌలర్ల జాబితాలో అతను కపిల్ దేవ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నాడు. అనిల్ కుంబ్లే (35), హర్భజన్ సింగ్ (25) మాత్రమే ఈ జాబితాలో అశ్విన్, కపిల్ కంటే ముందున్నారు.

12/10/2016 - 00:47

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్లకు 288): అలస్టర్ కుక్ స్టెంప్డ్ పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 46, కీటన్ జెన్నింగ్స్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 112, జో రూట్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 21, మోయిన్ అలీ సి కరుణ్ నాయర్ బి అశ్విన్ 50, జానీ బెయిర్‌స్టో సి ఉమేష్ యాదవ్ బి అశ్విన్ 14, బెన్ స్టోక్స్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 31, జొస్ బట్లర్ బి రవీంద్ర జడేజా 76, క్రిస్ వోక్స్ సి పార్

12/10/2016 - 00:46

ముంబయి, డిసెంబర్ 9: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (31), జొస్ బట్లర్ (76), చివరిలో జేక్ బాల్ (31) కొంత వరకు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించడంతో ఇంగ్లాండ్ 400 పరుగుల మైలురాయిని చేరగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 146 పరుగులు చేసింది.

Pages