S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/17/2017 - 02:16

వరంగల్, అక్టోబర్ 16: వరంగల్ నగరం సుబేదారి ప్రాంతంలోని రోహిణి ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీకైంది. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ తలెత్తడంతో ఆగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు రోగులు మృత్యువాత పడ్డారు. రోగులు, అగ్నిమాపక దళం, ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సంభవించిన సమయంలో ఆస్పత్రిలో కనీసం 150మంది రోగులు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.

10/17/2017 - 02:13

హైదరాబాద్, అక్టోబర్ 16: కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు.

10/17/2017 - 02:09

అమరావతి, అక్టోబర్ 16: తన పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన నిర్వహిస్తామని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తొలిసారి నిర్వహించిన బీసీ సెల్ సమావేశంలో మాట్లాడారు. 10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు, బీసీలను మోసం చేశారని, దీన్ని బీసీలను వివరించాలన్నారు.

10/17/2017 - 02:07

కర్నూలు, అక్టోబర్ 16: రాష్ట్ర మంత్రివర్గాన్ని మరోమారు విస్తరించనున్నట్లు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల ద్వారా తెలుస్తోంది. డిసెంబర్ మొదటి, రెండవ వారంలో ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ఈ విస్తరణలో ఐదు లేదా ఆరుగురు కొత్తవారికి చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరు, ముగ్గురికి ఉద్వాసన కూడా ఉంటుందని భావిస్తున్నారు.

10/17/2017 - 02:04

విశాఖపట్నం, అక్టోబర్ 16: రక్షణ రంగాన్ని మరింత పటిష్టపరచనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారత నౌకాదళంలో కొత్తగా చేరిన ఐఎన్‌ఎస్ కిల్పాన్ యుద్ధ నౌకలను సోమవారం లాంఛనంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ రంగానికి మరిన్ని అధిక నిధులు కేటయిస్తామన్నారు.

10/17/2017 - 02:01

అమరావతి, అక్టోబర్ 16: గ్రేడింగ్‌ల కోసం విద్యార్థులను వేధిస్తూ, వారి ఆత్మహత్యలకు కారకులవుతున్న కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలపై సిఎం చంద్రబాబు కనె్నర్ర చేశారు. మీ గ్రేడింగుల కోసం వారిని వేధించి విద్యాకుసుమాలను నేల రాలుస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ఈ క్షణం నుంచే మీ విధానంలో మార్పు కనిపించకపోతే ఎంతవారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మీ ఇష్టానుసారం నడుచుకుంటామంటే సహించేది లేదని మందలించారు.

10/16/2017 - 03:43

శ్రీశైలం, అక్టోబర్ 15: శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,09,912 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శనివారం 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయగా ఆదివారం మూడు గేట్లను మూసివేశారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 883.7 అడుగులుగా ఉంది.

10/16/2017 - 03:42

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్ర విభజన జరిగి మూడున్నర సంవత్సరాలు దాటుతున్నా ఉద్యోగుల్లో రాష్టస్థ్రాయి క్యాడర్ పోస్టుల విభజన, ఆస్తుల పంపిణీ అంశాలు నేటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇక జోనల్, జిల్లా స్థాయిలో పనిచేసే వారి బదిలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

10/16/2017 - 03:11

హైదరాబాద్, అక్టోబర్ 15: దేశంకోసం, మన కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు అమోఘమని, రక్షణలో పోలీసులే కీలకమని రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ అన్నారు. దేశ భద్రతతోపాటు ప్రజల ధన, మాన ప్రాణాలకోసం అసువులు బాసిన పోలీసులను మనమంతా విధిగా స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం అమర పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 2కే రన్ నిర్వహించారు.

10/16/2017 - 03:02

అమరావతి, అక్టోబర్ 15: పది లక్షల మంది సభ్యులతో పాటు, విస్తారమైన క్యాడర్ ఉన్నా సర్కారుపై యుద్ధం చేయలేని అరడజను మంది అగ్రనేతలే పొత్తు కోసం వెంపర్లాడుతూ పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు.

Pages