S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/15/2017 - 01:19

నాగార్జునసాగర్, అక్టోబర్ 14: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న వరదనీరు శనివారం సాయంత్రానికి భారీగా పెరిగింది. శనివారం మధ్యాహ్నం వరకు కూడా 2 లక్షల క్యూసెక్కుల మేరకు ఇన్‌ఫ్లో వస్తుండగా సాయంత్రం 6గంటల నుండి 2,71,717 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకుంటుంది. దీంతో సాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతూ వస్తుంది.

10/15/2017 - 01:10

హైదరాబాద్, అక్టోబర్ 14: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 190 టిఎంసికి చేరుకోవడం, సగటున రోజుకు 2.7 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో తెలంగాణ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలనే యోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కృష్ణాబోర్డు తీసుకునే నిర్ణయం కోసం వేచి ఉంది.

10/14/2017 - 03:23

శ్రీశైలం, అక్టోబర్ 13: శ్రీశైలం జలాశయం మరో రెండు గేట్లు తెరుచుకున్నాయ. గురువారం రెండు గేట్లు ఎత్తగా శుక్రవారం రాత్రికి మరో రెండు గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 884.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 211.95 టిఎంసిల నీరు ఉంది.

10/14/2017 - 01:34

తిరుపతి,అక్టోబర్ 13: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు త్వరలోనే పోటు ఆధునీకరణకు ప్రణాళికలను రూపొందించాలని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్యభవనంలో పలు అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఒక రోజుకు 5లక్షల లడ్డూలు తయారు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సంబంధిత అధికారులు రూపొందించాలని తెలిపారు.

10/14/2017 - 01:32

హైదరాబాద్, అక్టోబర్ 13: కోర్టు ధిక్కారం కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, విజయవాడ కనకదుర్గ దేవాలయం కార్యనిర్వహణాధికారి ఏ సూర్యకుమారికి రెండు వేల రూపాయల చొప్పున జరిమానాను విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనకదుర్గ ఆలయంలో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాలను అమలుచేయలేదని దాఖలైన సుమోటో కేసును హైకోర్టు విచారించింది.

10/14/2017 - 01:31

భద్రాచలం టౌన్, అక్టోబర్ 13: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘సంధ్యా హారతి’ ఆర్జిత సేవను త్రిదండి చిన జీయర్‌స్వామి శుక్రవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. భక్తుల జయ జయధ్వానాల నడుమ స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఉత్తరద్వారంలో ఉంచిన ఉయ్యాలలో కూర్చోబెట్టి పూజలు చేశారు. దీపారాధన ఇచ్చి మంగళశాసనాలు పలికారు.

10/14/2017 - 01:22

హైదరాబాద్, అక్టోబర్ 13: శాసనసభ వర్షాకాల కాల సమావేశాలు ఈ నెల నాలుగవ వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత శాసనసభ సమావేశాలు ముగిసి ఈ నెల 29కి ఆరు నెలలు గడవడంతో ఆ లోగానే సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది.

10/14/2017 - 01:21

హైదరాబాద్, అక్టోబర్ 13: నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ఆదేశించారు. కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డితో పాటు వైద్య విద్య అధికారులతో సచివాలయంలో శుక్రవారం మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు.

10/14/2017 - 01:20

హైదరాబాద్, అక్టోబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం 4000 ఎకరాల అటవీ భూమి సేకరణకు సంబంధించిన అనుమతుల కోసం వారం రోజుల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపించాలన్నారు.

10/14/2017 - 01:18

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ సంఘం చైర్‌పర్సన్‌గా గుడిమెట్ల రవికుమార్, సభ్యులుగా మరో ఏడుగురుని నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎంఎన్‌వి శ్రీనివాసరావు, పోచంపల్లి అచ్యుత రావు, నారా నాగేశ్వరరావు, దారనికోట రాము అనే వ్యక్తులు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు.

Pages