S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/14/2017 - 01:18

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణలో జోన్ల సంఖ్య పెంచే అంశంపై శుక్రవారం నాడు సుదీర్ఘ చర్చ జరిగింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌పి సింగ్ హాజరయ్యారు.

10/14/2017 - 01:12

విజయవాడ, అక్టోబర్ 13: ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ప్రాధాన్యత ఉండటం వల్ల విద్యార్థులపై ఎక్కువ ఒత్తిడి ఉంటోందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

10/14/2017 - 01:10

విజయవాడ, అక్టోబర్ 13: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ‘విలేజ్ మాల్స్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 29వేల చౌకధరల దుకాణాలను దశలవారీగా ‘విలేజ్ మాల్స్’గా మార్చాలని అధికారులకు ఆదేశించారు. తక్కువ ధరకు, నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యం కావాలని సూచించారు.

10/14/2017 - 01:07

అమరావతి, అక్టోబర్ 13: రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిని ఆయన సమీక్షించారు.

10/14/2017 - 01:02

కర్నూలు, అక్టోబర్ 13: కృష్ణానదికి వరద ముప్పు పొంచి ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం శుక్రవారం రాత్రి హెచ్చరికలు జారీ చేసింది.

10/13/2017 - 03:41

నాగార్జునసాగర్, అక్టోబర్ 12: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న వరదనీరు కారణంగా సాగర్ జలాశయ నీటిమట్టం క్రమేణా పెరుగుతూ ఉంది. సగటున రోజుకు 4 అడుగుల చొప్పున పెరుగుతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలవుతున్న నీటితో సాగర్‌లో డెడ్ స్టోరేజిలో ఉన్న నీటిమట్టం కనీస స్థాయిని దాటి 526అడుగులకు చేరుకోగా గురువారం సాయంత్రానికి 530 అడుగులకు పెరిగింది.

10/13/2017 - 03:38

హైదరాబాద్, అక్టోబర్ 12: వరుణుడి వీర విహారంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు జల సిరితో కళకళలాడుతున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల ఆనందతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖరీఫ్‌కు మంగళం పాడినా, ఆలస్యంగానైనా రబీ సీజన్‌కు శ్రీశైలం నీటిని నాగార్జునసాగర్‌కు వదిలి సగం ఆయకట్టుకైనా నీటిని విడిచే అవకాశం ఉంది.

10/13/2017 - 03:35

హైదరాబాద్, అక్టోబర్ 12: గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ నగరానికి వస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి బ్యాగులోని భారీ మొత్తంలో నగదు, నగలు చోరీకి గురయ్యాయి. సికిందరాబాద్‌లో రైలు దిగే సమయంలో గుర్తించిన బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. రాజమండ్రికి చెందిన వాణి మియాపూర్‌లో నివాసముంటోంది.

10/13/2017 - 03:34

హైదరాబాద్, అక్టోబర్ 12: డాక్టర్ కంచ ఐలయ్యపై కనిగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ హైకోర్టుకు తెలిపారు. హైదరాబాద్ హైకోర్టు ఎపికి, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా పనిచేస్తోంది. వత్సల అనే మహిళ కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

10/13/2017 - 03:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ నేటికి వాయిదా పడింది. విభజన చట్టం సెక్షన్-89 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపకాలపై విచారణ చేపట్టేందుకు గురువారం ట్రిబ్యునల్ సమావేశమైంది. తెలంగాణ తరపున సాక్షులుగా మాజీ సెంటర్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జీ.ఎస్.ఝా, (ఇంజీనీరింగ్), ప్రొ.

Pages