S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/16/2017 - 02:18

హైదరాబాద్, అక్టోబర్ 15: దేశంలోని ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు రెవెన్యూలో మిగులు సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాదీ (2017- 18) రెవెన్యూ మిగులు దశకు చేరాలని నిర్దేశించుకున్నా, ఆ పరిస్థితి సాధ్యమేనా అన్న అనుమానాలు లేకపోలేదు.

10/16/2017 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు జోన్ల వ్యవహారంలో భారీ మార్పు లు తేవాలని నిర్ణయించడంతో ఈ అంశం యుద్ధప్రాతిపదికన ముందుకు సాగుతోంది. జోన్ల విధానం కొనసాగించడమే కాకుండా, వీటి సంఖ్య పెంచాలని సిఎం తాజాగా నిర్ణయించడంతో అందుకు సంబంధించిన కార్యక్రమాలు అతివేగంగా సాగుతున్నాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ అప్పుడే రంగంలోకి దిగింది.

10/16/2017 - 02:15

హైదరాబాద్, అక్టోబర్ 15: హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన కోకపేట భూములపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చిచెప్పడంతో ఖజానాకు కాసుల వర్షం కురవబోతుంది. గతంలో వేలం వేసిన భూములతో పాటు, ఇంకా వేలం వేయని భూముల విలువ దాదాపు రూ.14 వేల నుంచి 15 వేల కోట్లు ఉంటుందని అంచన.

10/16/2017 - 02:12

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: కల్వకుర్తి ప్రాంత రైతులకు మూడు రోజులు ముందుగానే దీపావళి పండుగ వచ్చిందని, దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న కృష్ణాజలాలు తమ బీడువారి నెర్రలు బారిన పొలాల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కడం అంటేనే అంతకన్నా పండుగ మరేముంటుందని ఇది రైతులకు దీపావళి ధమాకానేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.

10/16/2017 - 01:58

విశాఖపట్నం, అక్టోబర్ 15: కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ పోరాట నేత ముద్రగడ పద్మనాభం మరోసారి అల్టిమేటం ఇచ్చారు. విశాఖ నగరంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 6లోగా కాపు రిజర్వేషన్లపై ఎటూతేల్చని పక్షంలో మళ్ళీ రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. అంబేద్కర్ సాక్షిగా రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

10/16/2017 - 01:56

విజయవాడ, అక్టోబర్ 15: ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖలో వెలుగుచూస్తున్న అక్రమాలపై ఆ శాఖ మంత్రి తరచూ విచారణకు ఆదేశించడం వినా, నివేదికలు వెలుగుచూస్తున్న దాఖలాలు లేవు. వివిధ ఘటనలపై విచారణకు ఆదేశించడానికే పరిమితవౌతున్న మంత్రి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్న సందర్భాలు దాదాపు ఉండటం లేదు. ఆంధ్ర వర్శిటీలో గతంలో ఫిజిక్స్, గణితం పేపర్లు లీక్ అయినప్పుడు విచారణకు ఆదేశించారు.

10/16/2017 - 01:51

విశాఖపట్నం, అక్టోబర్ 15: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి వెల్లడించా రు. అల్పపీడనం అతి నెమ్మదిగా బలపడుతోందని, మరో రెండు రోజులకు వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలపై స్పష్టత లేదన్నారు. వాయుగుండం ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించి తీరం దాటే అవకాశం ఉందన్నారు.

10/16/2017 - 01:27

విజయవాడ, అక్టోబర్ 15: రానున్న కాలంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పూర్తిగా చదివించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పుడిస్తున్న 6,500 ప్రతిభా పురస్కారాలకు మరో వెయ్యి జోడిస్తామని, ఇందుకోసం అదనంగా రూ.30 కోట్లు కేటాయస్తా మని సిఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాల్సి ఉందన్నారు. తల్లిదండ్రులపై ఆధారపడకుం డా, విద్యార్థులు తమ ప్రతిభా పురస్కారాలతో చదివే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.

10/15/2017 - 04:26

హైదరాబాద్, అక్టోబర్ 14: దీపావళి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-కాకినాడ పోర్టు-కాచిగూడ మధ్య రెండు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 18న సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో ఈనెల 22న సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరుతుంది.

10/15/2017 - 04:25

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలుగు అకాడమి విభజన విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో పీటముడిపడింది. తెలుగు అకాడమి పేరిట బ్యాంకుల్లో 300 కోట్ల రూపాయిల మేర ఫిక్సిడ్ డిపాజిట్లు ఉండటంతో ఆ నిధులు ఎవరు తీసుకోవానే అంశంపై అస్పష్టతే దీనికి కారణమని తెలిసింది. ఆ నిధులను పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ చెబుతుండగా, ఎక్కడి ఆస్తులు అక్కడవేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

Pages