S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/12/2016 - 05:36

హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సేవ చేసే విధంగా రాష్టప్రతికి ఆరోగ్యం,శక్తి ప్రసాదించాలని దేవున్ని కోరుకుంటున్నట్టు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్టప్రతికి పుష్పగుచ్ఛంతో పాటు లేఖ పంపించారు.
ఈద్ శుభాకాంక్షలు

12/12/2016 - 05:37

కాకినాడ, డిసెంబరు 11: బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అలల ఉద్ధృతితో సముద్ర తీరం తీవ్రరూపం దాల్చింది. తుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో రెండవ నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రపు అలల ఉద్ధృతికి కాకినాడ-ఉప్పాడ తీర మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

12/12/2016 - 05:34

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎక్స్‌లెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఆర్బిట్ సొల్యూషన్స్ సంస్థల పేరుతో మోసానికి పాల్పడి కోర్టుకు లొంగిపోయిన ఘరానా మోసగాడిని సిసిఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే రెండు నెలల్లోనే 30 నుంచి 35 శాతం లాభాలు ఇస్తానంటూ రూ. 20 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

12/12/2016 - 05:29

ఖమ్మం, డిసెంబర్ 11: ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా విధానాలను ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులో లేకుండా చేశారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు సంస్కరణలు అవసరమని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

12/12/2016 - 05:27

ఖమ్మం, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో 73వేల మంది ఆడపిల్లలు విద్యనభ్యసిస్తున్న కస్తూర్బా పాఠశాలల అభివృద్ధికి 1200 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి విద్యార్థినులకు ఆయన రగ్గులు పంపిణీ చేశారు.

12/12/2016 - 02:57

హైదరాబాద్, డిసెంబర్ 11: మరో 17 రోజుల్లో రద్దయిన పెద్ద నోట్ల డిపాజిట్ చేసేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంలో వెలుగుచూస్తున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. అసాధారణమైన బ్యాం కింగ్ లావాదేవీలు, డిపాజిట్లుపైన కాకుండా,కొత్త కరెన్సీని సమకూర్చుకున్న వారిపై దాడులు తీవ్రతరం చేయాలని నిర్ణయించింది.

12/12/2016 - 02:55

న్యూఢిల్లీ,డిసెంబర్ 11: దేశంలో సంపద, అవకాశాలు, ఉద్యోగాలు జనాభా దామాషా ప్రకారం పంపిణీ జరగాలని, దానికి వర్గీకరణే మార్గమని ఎమ్మర్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం నాడు కేంద్ర సామాజిక న్యాయ,సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథావలేతో అయన కార్యాలయంలో మందకృష్ణ సమావేశం అయ్యారు.

12/12/2016 - 02:51

హైదరాబాద్, డిసెంబర్ 11: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12 నుంచి 16 వరకు దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది నిరశన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కార్మిక సంఘం తెలిపింది.

12/12/2016 - 02:48

కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 11: రోడ్డు ప్రమాదం కేసులో ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేసిన పంజగుట్టలో రమ్య, పెద్దఅంబర్‌పేటలో తల్లీ,కూతుళ్లు శ్రీదేవి, సంజన ఘటనలను మరవకముందే కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని బాచుపల్లిలో ఆదివారం మరో దారుణం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు స్కార్పియో నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటన కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

12/12/2016 - 02:39

రామాయంపేట, డిసెంబర్ 11: మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు ఆదివారం రూ.16 లక్షల కొత్త నోట్లను పట్టుకున్నారు. బాసం శ్రీనివాస్, రాజు అనే వ్యక్తులు కారులో కొత్త నోట్లను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గొల్పర్తి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేసి ఈ సొమ్మును పట్టుకున్నామని ఎస్‌ఐ నాగార్జున గౌడ్ తెలిపారు. పట్టుబడిన సొమ్ములో రూ.15.90 లక్షల రెండువేల కొత్త నోట్లు, మరో రూ.10 వేల వంద రూపాయల నోట్లు ఉన్నాయన్నారు.

Pages