S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/15/2016 - 08:03

మడకశిర, డిసెంబర్ 14: అనంతపురం జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లిలో బుధవారం జరిగిన భూతప్పల ఉత్సవం విశేషంగా ఆకట్టుకుంది. భూతప్పల కాలి స్పర్శ కోసం భక్తులు పరితపించారు. భక్తరహళ్లిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివార్లకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు భూతప్పసేవ కొనసాగింది.

12/15/2016 - 07:55

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను 12 శాతం వరకు పెంచాలంటూ పలు ముస్లిం సంస్థలు కోరాయి. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ బుధవారం ‘బహిరంగ విచారణ’ ప్రారంభించింది. ఈ విచారణ ఈ నెల 17 వరకు కొనసాగుతుంది.

12/15/2016 - 07:54

విశాఖపట్నం, డిసెంబర్ 14: విశాఖ సాగర తీరంలో ఇండో-రష్యా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇంద్ర 16 పేరిట నిర్వహిస్తున్న ఇండో-రష్యా సంయుక్త నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు రష్యన్ నౌకాదళ అధికారులు, సిబ్బంది విశాఖ చేరుకున్నారు. ఈ నెల 14 నుంచి ఎనిమిది రోజుల పాటు బంగాళాఖాతంలోను, తీరంలోను ఇరు దేశాల యుద్ధ నౌకలు, విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి.

12/15/2016 - 07:08

హైదరాబాద్, డిసెంబర్ 14: ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు తొమ్మిది జాతీయ ఇంధన పొదుపు అవార్డులు లభించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యుచ్ఛక్తి, బొగ్గు, కొత్త పునరుత్పాదక ఇంధనాలు, గనుల శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జిఎం వశిష్ఠ జోహ్రీ ఈ అవార్డులను అందుకున్నారు.

12/14/2016 - 04:11

విజయవాడ, డిసెంబర్ 13: పెద్దనోట్ల రద్దు పేరుతో కేంద్ర ప్రభుత్వం పేదలపై ఆర్థిక దౌర్జన్యానికి పాల్పడుతోందని, ఇది బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చేందుకేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు కోసం ప్రధాని మోదీ చెప్పిన అవినితి నిర్మూలన జరగలేదని, అవినీతి స్థాయి మరింత తీవ్రమైందని తెలిపారు.

12/14/2016 - 04:05

హైదరాబాద్, డిసెంబర్ 13: బంజారాహిల్స్‌లో బంగారు వ్యాపారులను బెదిరించి భారీ మొత్తంలో నగదు కాజేసిన ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. టప్పాచబుత్ర సిఐ రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు తిరుమలేష్ నాయుడు సహ పదిమందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.

12/14/2016 - 04:02

రాజేంద్రనగర్, డిసెంబర్ 13: పాత నోట్లపై కొత్తనోట్ల మార్పిడి చేయడానికి తీసుకువచ్చిన భారీ నగదును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలి జయబేరి ఎన్‌క్లేవ్‌లో ప్రాంతానికి చెందిన గోనా మహేందర్‌నాథ్‌రెడ్డి, శామీర్‌పేట్ జవహార్‌నగర్ ప్రాంతానికి చెందిన వడ్డరపు నాగమల్లేశ్వర్ స్నేహితులు.

12/14/2016 - 04:01

హైదరాబాద్, డిసెంబర్ 13:పెద్ద నోట్ల రద్దు తరువాత 35 రోజులు గడిచిపోయిన తరువాత కూడా బ్యాంకులు, ఎటిఎంల వద్ద భారీ క్యూలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరంలో 98శాతం ఎటిఎంలు పని చేయడం లేదు. కరెన్సీ నోట్ల రద్దు తరువాత ఎటిఎంలలో డబ్బులు కనిపించడం లేదు. దీంతో దీన్ని కూడా వ్యాపారానికి ఉపయోగించుకోవడానికి కొన్ని యాప్స్‌ను ప్రారంభించారు. ఈ యాప్స్ ఉపయోగించి ఏ నగరంలో ఏ ఎటిఎంలో డబ్బులు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

12/14/2016 - 02:55

హైదరాబాద్, డిసెంబర్ 13: మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల విధానం అమలుపై నాలుగు వారాల్లోగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వతంత్ర రాయ్ అనే వ్యక్తి పిల్‌ను దాఖలు చేశారు.

12/14/2016 - 02:47

హైదరాబాద్, డిసెంబర్ 13: మెట్రోస్టేషన్ల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చటమే గాక, మెట్రోస్టేషన్ల నుంచి ప్రయాణికుడి ఇంటి వరకు డ్రాప్ చేసేందుకు కాలుష్య రహిత వాహనాలను అందుబాటులో ఉంచాలన్న మెట్రోరైలు ప్రయత్నం ఫలించింది. మెట్రో స్టేషన్లలో ‘ఉబర్’ మొబైల్ యాప్‌కు అనుసంధానం చేసి ఉబర్ మొబైక్‌లను అందుబాటులోకి తేవాలని మెట్రోరైలు నిర్ణయించింది. రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.

Pages