S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/13/2016 - 05:01

హైదరాబాద్, డిసెంబర్ 12: మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు పివి రాజేశ్వరరావు (70) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాజేశ్వరరావు అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరుగుతాయి.

12/13/2016 - 05:00

నిజామాబాద్, డిసెంబర్ 12: ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలిస్తోంది. 2015 ఖరీఫ్‌లో ప్రతీకూల పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఏడాది కాలానికి పైగా ఎదురు చూస్తుండగా, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.

12/13/2016 - 04:58

హైదరాబాద్, డిసెంబర్ 12: వర్దా తుపాను కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రూట్లలో మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ట్రైన్ నెం. 12604 హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ట్రైన్ నెం. 17651 చెంగల్‌పట్టు-కాచిగూడ, ట్రైన్ నెం. 12669 చెన్నై సెంట్రల్-్ఛప్రా గంగా కావేరి ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నెం.

12/13/2016 - 02:35

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) నేతృత్వంలో లండన్‌లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ అసోసియేషన్ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోంది.

12/13/2016 - 02:33

హైదరాబాద్, డిసెంబర్ 12: అమెరికాలో వివిధ యూనివర్శిటీల్లో చదువుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య 40వేలకు చేరింది, అలాగే మన దేశం నుంచి మొత్తంగా అమెరికా వెళ్లి చదువుతున్న వారి సంఖ్య 2,06,582కు పెరిగింది.

12/13/2016 - 02:11

హైదరాబాద్, డిసెంబర్ 12: శాసనసభ సమావేశాలు అర్థవంతంగా జరగాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సూచించారు. రాజకీయ రచ్చకు వేదికకాకుండా ప్రజా సంబంధిత అంశాలపై విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే ఎలాంటి అంశంపైనైనా సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి పాలకపక్షం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

12/13/2016 - 02:09

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్టవ్య్రాప్తంగా 50మంది డిఎస్పీలు ఒక్కసారిగా బదిలీ అయ్యారు. డిఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు డిజిపి అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని డిజిపి ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం పోలీసు అధికారులను సర్దుబాటు చేసింది.

12/13/2016 - 02:08

హైదరాబాద్, డిసెంబర్ 12: కరెన్సీ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అయితే కేంద్ర నిర్ణయం ప్రభావం మాత్రం రాష్ట్రంపైనా, ప్రజలపై పడుతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందిపడకుండా రాష్ట్ర పరిధిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

12/13/2016 - 02:04

హైదరాబాద్, డిసెంబర్ 12: వచ్చే ఖరీఫ్‌నాటికి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని పాలమూరు ఇరిగేషన్ యంత్రాంగాన్ని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లాలో ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తి పోతల పథకాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి భూ సేకరణ పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.

12/13/2016 - 01:48

అమరావతి, డిసెంబర్ 12: ఇప్పటికే వివిధ వర్గాల సంక్షేమం పేరుతో వారికి చేరువవుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి యువకులకు చేరువయ్యే బృహత్తర పథకానికి తెరలేపనుంది. లక్షలాదిమంది యువతీ యువకులకు నిత్యావసరంగా మారిన ఇంటర్నెట్ సేవలను కారుచౌకగా అందించడం ద్వారా, వారి మనసు గెలుచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

Pages