S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/23/2016 - 03:28

గుంటూరు, అక్టోబర్ 22: రాష్ట్రంలో నకిలీ విత్తనాల నియంత్రణకు త్వరలో ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ విత్తన చట్టంలో లొసుగుల కారణంగా నకిలీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయని, ఇందులో సవరణలు తీసుకువచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

10/23/2016 - 03:26

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తమ శాఖలను తెలంగాణలో మరింత విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకొచ్చింది. రాబోయే రెండు మూడేళ్ళలో దేశవ్యాప్తంగా లక్షకుపైగా శాఖలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ, అన్ని సామాజిక వర్గాలనూ ఆకర్షించాలన్న పట్టుదలతో ఉంది.

10/23/2016 - 03:19

విజయవాడ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ మోనిటరీ అధారిటీల మధ్య శనివారం ముఖ్యమంత్రి నివాసంలో ఫిన్‌టెక్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన ఒప్పందం కుదిరింది. సిఎం సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐటి సలహాదారు జెఎ చౌదరి, సింగపూర్ మోనిటరీ అధారిటీ ఆర్థిక సాంకేతిక ముఖ్య అధికారి సప్నేద్ మొహంతి ఈ ఒప్పందం పత్రాలపై సంతకం చేశారు.

10/23/2016 - 03:10

హైదరాబాద్, అక్టోబర్ 22: అకౌంటింగ్, ఆడిటింగ్, పన్ను విధానంలో అనైతిక పద్ధతులకు పాల్పడరాదని, భారత చార్టెడ్ అకౌంటెంట్లకు ప్రపంచంలో మంచి పేరుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 67 ఏళ్లలో ఐసిఏఐ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుందన్నారు.

10/23/2016 - 03:08

హైదరాబాద్, అక్టోబర్ 22: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయనున్నట్టు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. అదే విధంగా పెరిగిన జనాభా ప్రకారం గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు చెప్పారు.

10/23/2016 - 03:05

నెల్లూరు రూరల్, అక్టోబర్ 22: తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. ఒక చికెన్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణ భారం మోస్తూ తాను వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడాలని కలలుగన్న ఆ యువకుడి మెదడుకు స్ట్రోక్ రావడంతో మృత్యుతీరానికి చేరుకున్నాడు. పోతూపోతూ అవయవాలను ఆరుగురికి దానం చేశాడు. నెల్లూరు నగరంలోని నవాబుపేటకు చెందిన చిల్లకూరు వసంతలక్ష్మి శ్రీ్ధర్‌రెడ్డి దంపతుల కుమారుడు దినేష్‌రెడ్డి (32).

10/23/2016 - 03:02

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటామని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని సౌదీ అరేబియా రాయబారి మహ్మద్ అల్ సతి తెలిపారు. సౌదీ అంబాసిడర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును శనివారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తెలంగాణ అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి సాధిస్తోందని తమ దృష్టికి వచ్చినట్టు మహమ్మద్ అల్‌సతి తెలిపారు.

10/23/2016 - 02:59

నెల్లూరు, అక్టోబర్ 22: కృష్ణపట్నం పోర్టు శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని ఓడరేవు పారిశ్రామిక అభివృద్ధితో జిల్లా పారిశ్రామికంగా పరుగులు తీస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. శనివారం ఆయన కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. అంతకు ముందు ఆయన కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటి అకాడమి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

10/23/2016 - 02:57

హైదరాబాద్, అక్టోబర్ 22: మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడమనే పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో మూడు సార్లు తలాక్ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.

10/23/2016 - 02:55

హైదరాబాద్, అక్టోబర్ 22: ఇంజనీరింగ్ సర్ట్ఫికెట్ రేటు రూ. 80వేలు, ఎంబిఏ సర్ట్ఫికెట్ రేటు రూ. 40 వేలు, ఎంసిఏ సర్ట్ఫికెట్ రేటు రూ. 50 వేలు, డిగ్రీ సర్ట్ఫికెట్ రేటు రూ. 40 వేలు, ఇంటర్ సర్ట్ఫికెట్ రేటు రూ. 15 వేలు. ఏ కాలేజీలో చదవకుండానే ఈ సొమ్ము చెల్లిస్తే మీకు వెంటనే సర్ట్ఫికెట్ దొరుకుతుంది.

Pages