S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/26/2016 - 03:24

హైదరాబాద్, అక్టోబర్ 25: ‘ట్రిపుల్ తలాఖ్‌పై ముస్లింలు ఆలోచన చేయాలి’ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారత సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) సురేష్ జోషీ (్భయ్యాజీ జోషి) హితవు చెప్పారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు మంగళవారం ముగిసాయి. భయ్యాజీ జోషి సమావేశాల వివరాలను మీడియాకు వెల్లడించారు.

10/25/2016 - 03:59

మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. దశాబ్దాల వారి సురక్షిత ప్రాంతమూ
తుడిచిపెట్టుకు పోయింది. మల్కాన్‌గిరి అడవుల్లో మావోల ప్లీనమ్‌పై ఆంధ్ర-ఒడిశా పోలీసులు సోమవారం తెల్లవారు జామున జరిపిన దాడిలో 24మంది మావోయిస్టులు హతమయ్యారు. అగ్రనేత రామకృష్ణ తప్పించుకున్నాడు. ఆయన కుమారుడు మున్నా సహా గాజర్ల రవి, చామల కిష్టయ్య, వెంకటరమణ వంటి పలువురు

10/25/2016 - 03:12

హైదరాబాద్, అక్టోబర్ 24: రాబోయే తొమ్మిదేళ్ళలో దేశ వ్యాప్తంగా తన శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లక్ష్యంగా పెట్టుకున్నది.

10/25/2016 - 02:57

తవణంపల్లె, అక్టోబర్ 24: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం గ్రామ పంచాయతీ పైపల్లె గ్రామానికి చెందిన చలపతి మరణించటంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. పైపల్లె గ్రామానికి చెందిన శివలింగారెడ్డి కుమారుడు మావోయిస్ట్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ చలపతి (57).

10/25/2016 - 02:52

విశాఖపట్నం/ పాడేరు, అక్టోబర్ 24: మావోయిస్ట్ ఉద్యమానికి చావు దెబ్బ తగిలింది. విధ్వంసాలకు పాల్పడుతూ, పోలీసులకు సవాళ్లు విసిరే మావోయిస్ట్ నేతలు పోలీసుల కాల్పుల్లో నేలకొరిగారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వేళ్లూనుకున్న మావోయిస్ట్ ఉద్యమానికి పెను విఘాతం తగిలింది. ఒకే ఒక్క ఎన్‌కౌంటర్‌తో ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మావోయిస్ట్ ఉద్యమమే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది.

10/25/2016 - 03:49

బూషిపట్టు ఎన్‌కౌంటర్‌లో మరణించిన 24మంది మావోయిస్టుల్లో పలువురు కీలక నేతలు నేలకొరిగారు. వారి వివరాలివే..
గాజర్ల రవి అలియాస్ ఉదయ్ బోర్డర్ కమిటీ కార్యదర్శి
సుధాకర్ అలియాస్ చలం సెంట్రల్ కమిటీ మెంబర్
చలపతి అలియాస్ కైలాసం తూర్పు డివిజన్ కార్యదర్శి
రమణ అలియాస్ గణేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు
మీనా మల్కాన్‌గిరి కమిటీ మెంబర్

10/25/2016 - 02:48

విశాఖపట్నం, అక్టోబర్ 24: ‘‘ఏఓబిలో ఎదురు కాల్పులు జరిగాయి. గత కొద్ది రోజులుగా ఆంధ్ర, ఒడిశా పోలీసులు జాయింట్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. వారిని లొంగిపోవలసిందిగా పోలీసులు మైకులో హెచ్చరించారు. కానీ మావోయిస్ట్‌లు కాల్పులు ప్రారంభించారు. విధిలేని పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది’’ అని డిజిపి సాంబశివరావు తెలియచేశారు.

10/25/2016 - 02:45

విశాఖపట్నం (గాజువాక), అక్టోబర్ 24: ధైర్య సాహసాలున్న ఒక రక్షక భటుణ్ని పోలీస్‌శాఖ కోల్పోయింది. ఎఒబి సరిహద్దుల్లో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ తుపాకీ తూటాకు విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని అజీమాబాద్‌కు చెందిన మహ్మద్ అబూబకర్ (24) మృతి చెందారు.

10/25/2016 - 02:41

భద్రాచలం/వరంగల్, అక్టోబర్ 24: పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీ దాకా అప్పగించిన అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి కేంద్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగిన బలమైన నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్. ఆయన సోమవారం ఎఒబిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆయన మృతితో ఒకరకంగా గ్రేహౌండ్స్‌లో విజయగర్వం తొణికిసలాడుతుందనడంలో సందేహం లేదు.

10/25/2016 - 02:37

హైదరాబాద్, అక్టోబర్ 24: సిపిఐ మావోయిస్టు చర్చల ప్రతినిధి సహా మొత్తం 2ఆ మందిని ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి ప్రాంతం జంత్రి అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చడాన్ని విరసం నేత వరవరరావు, సిపిఐ (ఎంఎల్) ప్రతిఘటన, సిపిఐ (ఎంఎల్) రాంచంద్రన్, ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి.

Pages