S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/24/2016 - 04:57

విజయవాడ/తిరుపతి, అక్టోబర్ 23: కృష్ణా జలాల వాటా వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల హక్కులను ఎట్టి పరిస్థితిల్లోనూ వదులుకునే ప్రసక్తే ఉండదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బ్రిజేశ్ కుమార్, సుప్రీం కోర్టుల ముందు సమర్థంగా వాదనలను వినిపించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

10/24/2016 - 04:55

హైదరాబాద్, అక్టోబర్ 23: కమ్యూనిస్టుల ఆగడాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కనె్నర్ర చేసింది. కమ్యూనిస్టుల కోటలు బద్దలుకొట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఘట్‌కేసర్ అన్నోజిగుడాలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి కీలక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భాగవత్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలు ప్రారంభించారు.

10/24/2016 - 06:57

హైదరాబాద్, అక్టోబర్ 23: బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. బడ్జెట్‌లో ఇదివరకే కేటాయించిన రూ.100 కోట్ల నిధిని ట్రస్టుకు బదలాయించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో పనె్నండు ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదనం నిర్మించి, ట్రస్ట్ ద్వారానే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.

10/23/2016 - 04:35

హైదరాబాద్, అక్టోబర్ 22: న్యాయవిద్యా కళాశాలలు వ్యాపార సంస్థలు కారాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ పలు న్యాయ విద్యా కళాశాలల అనుమతిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది.

10/23/2016 - 04:07

హైదరాబాద్, అక్టోబర్ 22: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అశనిపాతమేనని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయపోరాటం జరపాలని నిర్ణయించుకుంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ జరగాలని తెలంగాణ వాదించగా, బ్రిజేష్ ట్రిబ్యునల్ మాత్రం రెండు రాష్ట్రాల మధ్యే నీటి పంపిణీ సాగాలని తీర్పునిచ్చింది.

10/23/2016 - 04:06

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను నియమించింది. సిఎం కెసిఆర్ శనివారం సంతకం చేసిన తరువాత బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సామాజికవేత్త బిఎస్ రాములు అధ్యక్షుడిగా వ్యవహరించే కమిషన్‌లో వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరీశంకర్, ఆంజనేయ గౌడ్ సభ్యులుగా ఉంటారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. కమిషన్ పదవీ కాలం మూడేళ్లు.

10/23/2016 - 04:01

హైదరాబాద్/నెల్లూరు, అక్టోబర్ 22:్భగ్యనగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కందికట్ల సురేశ్‌బాబు అనే ఓ వ్యాపారిని, సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెల్మాల్ కిశోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు విచారణలో తెలిసింది.

10/23/2016 - 03:37

కాకినాడ, అక్టోబర్ 22: హైదరాబాద్ నగరం నేడు మతకలహాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లో మతకలహాలు రూపుమాపానని, అప్పట్లో రాష్ట్రంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించి, అలిపిరిలో తీవ్రవాదుల దాడికి గురయ్యానన్నారు.

10/23/2016 - 03:32

హైదరాబాద్, అక్టోబర్ 22: దేశంలో సమగ్ర మైనింగ్ వర్శిటీ ఏర్పాటుకు కొత్తగూడెం సరైన ప్రదేశమని హైదరాబాద్‌లో శనివారం సమావేశమైన ఉన్నతస్థాయి సమావేశం ఖరారు చేసింది.

10/23/2016 - 03:30

నంద్యాల, అక్టోబర్ 22: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని కుందూనది వంతెన వద్ద శనివారం మధ్యాహ్నం రైల్వేట్రాక్ కుంగిపోయింది. ఐదు నిమిషాలకు ముందు ఇదే ట్రాక్‌పై గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లింది. రైలు ఏమాత్రం ఆలస్యమైనా ఘోర ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు, సిబ్బంది యుద్దప్రాతిపదికన ట్రాక్‌ను పునరుద్దరించారు.

Pages