S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/24/2016 - 05:37

హైదరాబాద్, అక్టోబర్ 23: జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు జైళ్ల శాఖ ఇటీవల మస్తత్వ పరీక్షలు నిర్వహించింది. శిక్ష పూర్తి చేసుకొని సత్ప్రవర్తనతో విడుదలైన 150 మంది ఖైదీల్లో ఇద్దరు మాత్రమే మళ్లీ నేరాలకు పాల్పడుతుండడంతో వారిని తిరిగి జైల్లోనే కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదువేల మంది ఖైదీలు వివిధ నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

10/24/2016 - 05:29

హైదరాబాద్, అక్టోబర్ 23: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఈ ప్రాజెక్టుపై వైకాపా, కాంగ్రెస్ పార్టీలు అవాకులు, చవాకులు మాట్లాడితే సహించే ప్రసక్తిలేదని టిడిపి ఎమ్మెల్సీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

10/24/2016 - 05:27

హైదరాబాద్, అక్టోబర్ 23: నష్టాల్లో ఉన్న డిస్కాంలను ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం ఎష్యూరెన్స్ యోజన (ఉదయ్)లో ఆంధ్రప్రదేశ్ డిస్కాంలు చేరాయి. ఈ స్కీం కింద రాష్ట్రప్రభుత్వం రెండు డిస్కాంలను ఆదుకునేందుకు రూ. 7376 కోట్ల విలువైన ప్రత్యేక సెక్యూరిటీ బాండ్స్‌ను విడుదల చేసింది. ఈ స్కీంను కేంద్రం 2015లో ప్రారంభించింది. ఏపి డిస్కాంలకు రూ.

10/24/2016 - 05:25

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజికవేత్త, మానవతామూర్తి నడిగడ్డపాలెంలోని ‘ఉభయ వేదాంతాచార్య పీఠాధిపతి’ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు (షష్టిపూర్తి ఉత్సవాలు) 2016 అక్టోబర్ 24 నుండి నవంబర్ 6 వరకు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.

10/24/2016 - 05:21

హైదరాబాద్, అక్టోబర్ 23: షిర్డీసాయిబాబా దేవుడు కాదని, మామూలు మనిషేనని, ఆయనను పూజిస్తే భూతప్రేత పిశాచాలను, దయ్యాలను పూజించినట్టేనని ఉత్తరామ్నాయ బదరీ జ్యోతిష్య పీఠం, పశ్చిమామ్నాయ ద్వారకా శారదాపీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీస్వరూపానంద సరస్వతీ మహాస్వామి పేర్కొన్నారు.

10/24/2016 - 05:11

హైదరాబాద్, అక్టోబర్ 23: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బ్లాకులతో పాటు శాసనసభ, శాసనమండలి భవనాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రిమండలిలో చేసిన తీర్మాన పత్రాన్ని గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

10/24/2016 - 05:10

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అక్రమ కొలువులు బయటకొచ్చాయి. ఏ చదువూ లేకపోయినా ఏదో ఒక గుడిలో పని చేస్తున్నట్టు సృష్టించి ఆ తరువాత ఎంఏలు, పిహెచ్‌డిలు చేసినట్టు రికార్డులు చూపించి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అడ్డదారుల్లో కొలువులు పొందుతున్న అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

10/24/2016 - 05:09

భద్రాచలం, అక్టోబర్ 23: అడవిబిడ్డలు బానిస రాజకీయ వ్యవస్థలో మగ్గిపోతున్నారు. గడచిన ఆరు దశాబ్దాల కాలంలో గిరిపుత్రులకు రాజకీయ బానిసత్వం పరిణమించింది. భద్రాచలం నుంచి బల్లార్షా వరకు ఆదివాసీల గోండ్వానా రాజ్యాలు కొనసాగాయన్న చరిత్రను ఆదివాసీలు మరచిపోయారు. 14వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు గోండ్వానా రాజ్యాలు బ్రహ్మాండంగా విలసిల్లాయి. తిరిగి మన ప్రాంతంలో మనం స్వయంగా పాలించుకుందాం.

10/24/2016 - 05:05

హైదరాబాద్, అక్టోబర్ 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) ఇటు విద్యార్థులకు, అటు టీచర్లకు తలనొప్పిగా తయారైంది.

10/24/2016 - 04:58

హైదరాబాద్, అక్టోబర్ 23: వచ్చే నెల మొదటి వారంలో రబీ పంట కోసం నీటి కేటాయింపులను చేసేందుకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఈ విషయాన్ని కృష్ణా బోర్డు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాసింది. వచ్చే రబీ పంట నిమిత్తం తమకు 130టిఎంసిల నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి అవసరమవుతాయని ఏపి ప్రభుత్వం కృష్ణాబోర్డును కోరనుంది.

Pages