S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/25/2016 - 02:36

పాడేరు, అక్టోబర్ 24: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు బెజ్జంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత రామకృష్ణ (ఆర్‌కె) త్రుటిలో తప్పించుకున్నట్టు తెలిసింది. మావోయిస్టుల ప్లీనరీలో పాల్గొనేందుకు ఆర్‌కె కూడా రావాల్సి ఉంది. మరికాసేపట్లో ఆయన సమావేశ స్థలానికి చేరుకోనుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఆయన కుమారుడు, 21 ఏళ్ల మున్నా మాత్రం హతమయ్యాడు.

10/25/2016 - 02:34

హైదరాబాద్, అక్టోబర్ 24: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను ఇరు రాష్ట్రాలకు తరలించినట్టయితే గురువారం వరకూ భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది.

10/25/2016 - 02:33

విశాఖపట్నం, అక్టోబర్ 24: నిత్యం అప్రమత్తంగా ఉండే మావోయిస్టులు తప్పటడుగు వేయడం వలనే భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారా? మావోయిస్ట్‌ల కార్యకలాపాల్లో, వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఇంటిలిజెన్స్ వ్యవస్థ సరిగా పనిచేయలేదా? మూడంచెలు, ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మావోయిస్ట్ నేతలను కాపాడుకోలేకపోయిందా? సోమవారం ఏఓబిలో జరిగిన ఎన్‌కౌంటర్ తీరు చూస్తే, వైఫల్యాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

10/25/2016 - 02:32

విశాఖపట్నం/పాడేరు, అక్టోబర్ 24: అది కొండ లోయలతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం.. కటాఫ్ ఏరియా.. మావోయిస్ట్‌లు తలదాచుకునే అత్యంత సురక్షిత ప్రదేశం. మావోయిస్ట్ అగ్ర నేతలు వచ్చినప్పుడు ఈ ప్రదేశంలోనే సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర, ఒడిశా మావోయిస్ట్‌లకు ఈ ప్రాంతం ఒక అడ్డా. ఇటువంటి అభేద్యమైన ప్రదేశంలోకి గ్రేహౌండ్స్ దళాలు ఎలా చేరుకోగలిగాయి?

10/25/2016 - 02:16

మహోబా (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 24: మూడుసార్లు ‘తలాక్’ చెప్పి విడాకులు పుచ్చుకునే పద్ధతి (ట్రిపుల్ తలాక్)పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వౌనాన్ని వీడారు. ముస్లిం మతంలో కొనసాగుతున్న ఈ దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన సోమవారం స్పష్టం చేశారు.

10/25/2016 - 02:13

హైదరాబాద్, అక్టోబర్ 24: జిల్లాలవారీగా ‘నో యువర్ డిస్ట్రిక్ట్స్- ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’ నినాదంతో ప్రణాళికలు రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల భౌగోళిక పరిస్థితులు, స్థానిక అవసరాలు, వనరులపై ముందు అవగాహన ఏర్పర్చుకుని, తరువాత ఏ జిల్లాలో ఏంచేయాలన్న దానిపై రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలన్నారు.

10/25/2016 - 02:08

హైదరాబాద్, అక్టోబర్ 24: ఇంటర్మీడియట్ (ప్లస్ టు) విద్యను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇంటర్‌తోపాటు పూర్వ విద్య (ప్రీ స్కూల్)నూ చట్టపరిధిలోకి తెచ్చే అంశంపై మంగళవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈమేరకు కేంద్ర విద్యా సలహా మండలి (కేబ్) కీలక సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది.

10/24/2016 - 07:14

హైదరాబాద్, అక్టోబర్ 23: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోంది. కృష్ణా పరీవాహకంలోని నాలుగు రాష్ట్రాల మధ్య జలాల పునఃపంపిణీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత కోరుకున్నా అది సాధ్యంకాదని దాదాపు తేలిపోయింది. ఈ అంశంపై న్యాయపోరాటం చేసినా అంతగా ఉపయోగం ఉండదనే అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వెలిబుచ్చినట్టు సమాచారం.

10/24/2016 - 05:41

హైదరాబాద్, అక్టోబర్ 23: ఉద్యోగ భద్రతతోపాటు జీతాలు పెంచాలని కోరుతూ హోంగార్డుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఆదివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అంబర్‌పేటలో చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సుమారు ఐదువందల మంది హోంగార్డులు హాజరయ్యారు. పనిగంటలతో సంబంధం లేకుండా సివిల్ పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు తగిన వేతనం లభించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

10/24/2016 - 05:41

హైదరాబాద్, అక్టోబర్ 23: వెనుకబడిన వర్గాల్లోని చేతి వృత్తుల వారికి ప్రత్యేక శిక్షణతోపాటు వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాయించాలని బిజెపి నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బిసి కమిషన్‌కు చైర్మన్, సభ్యులుగా నియమితులైన వారిని దత్తాత్రేయ అభినందించారు.

Pages