S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/22/2016 - 08:15

గుంటూరు, అక్టోబర్ 21: అదో అరుదైన సన్నివేశం.. రాజధానిలేని అవశేష ఆంధ్రప్రదేశ్‌కు దిక్సూచిగా నిలిచిన ప్రపంచ నగరం అమరావతికి అంకురార్పణ జరిగిన మధుర ఘట్టాలు.. దేశ ప్రధాని.. కేంద్రమంత్రులు.. ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు.. ఒకరేంటి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన వేళ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిన అద్భుత ఘడియలు..

10/22/2016 - 07:18

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తొలగిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేవారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.

10/22/2016 - 07:14

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రపంచ స్ట్రోక్ కాంగ్రెస్ సమావేశాలు ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు వరల్ట్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎస్‌ఓ) అధ్యక్షుడు స్టీఫెన్ డేవిస్, భారత్ నుంచి ఈ సదస్సుకు కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జయరాజ్ పాండియన్ తెలిపారు.

10/21/2016 - 02:31

హైదరాబాద్, అక్టోబర్ 20: పోలీసు డిఎస్పీలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నేరుగా నియమితులైన అధికారులు, పదోన్నతులు పొందిన అధికారుల సీనియారిటీ జాబితాను పోలీసు శాఖ రూపొందించని విషయమై దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు ధర్మాసనం స్వీకరించింది.

10/21/2016 - 02:07

హైదరాబాద్, అక్టోబర్ 20: కృష్ణా జలాల వాటాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగాధాన్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 1001 టిఎంసి నీటిలో నికర జలాలు, అదనపు జలాల్లోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో తెలంగాణలోని నాలుగు ప్రతిష్టాకరమైన ఎత్తిపోతల పథకాలకు నికర జలాల సమస్య ఉత్పన్నమవుతోంది.

10/21/2016 - 02:06

హైదరాబాద్, అక్టోబర్ 20: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

10/21/2016 - 02:04

తిరుపతి, అక్టోబర్ 20: భక్తుల సౌకర్యాల కల్పన, పరిశుభ్రత తదితర విషయాల్లో వాటికన్ సిటీ, డిస్నీ తరహాలో తిరుమలలో ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటిస్తున్నారని హైదారాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి చెందిన అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ జె.బెర్రెట్ ట్రవీస్ కొనియాడారు. గురువారం ఉదయం ఆయన సంప్రదాయ వస్తధ్రారణలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

10/21/2016 - 02:02

తిరుపతి, అక్టోబర్ 20: తిరుమలలో పర్యావరణ హితమైన బ్యాటరీ బస్సులు నడపాలని నిర్ణయించినట్టు టిటిడి ఇఓ సాంబశివరావు చెప్పారు.ప్రయోగాత్మకంగా త్వరలో రెండు బ్యాటరీ బస్సులను నడపనున్నట్లు ఆయన వివరించారు. టిటిడి రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆయుధ పూజ జరిగింది. ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ తిరుమలలోని ధర్మరథాలు భక్తులకు వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేసేందుకు సహకరిస్తున్నట్లు వివరించారు.

10/21/2016 - 01:59

అనంతపురం, అక్టోబర్ 20: మద్దెలచెరువు సూరి హత్య కేసులోప్రధాన నిందితుడైన భానుకిరణ్ ముఖ్య అనుచరుడు మధుసూదన్‌రెడ్డిని బెంగళూరులో కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌స్టర్లు దేహశుద్ధి చేశారు. గురువారం ఉదయం బెంగళూరుకు చెందిన మంజునాథ్(బెట్టు మంజు) గ్యాంగ్ మధుసూదన్‌రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అనంతరం ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అతని బట్టలూడదీసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదినట్లు తెలుస్తోంది.

10/21/2016 - 01:52

హైదరాబాద్, అక్టోబర్ 20: దేశంలో ఏడు రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేయాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. బిజెపిని సంస్థాగతంగా నిర్మించడానికి, బలోపేతం చేయడానికి ఆయా రాష్ట్రాల్లో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వివిధ రాష్ట్రాల మోర్చాల అధ్యక్షులతో గురువారం నాడు సమావేశం అయ్యారు.

Pages