S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/09/2016 - 06:34

హైదరాబాద్, మే 8:తామొకటి తలిస్తే కేంద్రం మరొకటి తలవడంతో ఇద్దరు చంద్రులు రాజకీయంగా చిక్కుల్లో పడనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 119 స్థానాలున్న తెలంగాణలో 150, 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో 228 అసెంబ్లీ స్థానాలు అవుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపి సీఎం చంద్రబాబునాయుడు భావించారు. ఆ మేరకు రెండు అసెంబ్లీల్లోనూ తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపించారు.

05/08/2016 - 05:28

హైదరాబాద్, మే 7: జల వివాదాల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం దత్తాత్రేయ బ్యాంకర్లతో ముద్ర బ్యాంకు రుణాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో త్వరలో ముద్ర మేళా నిర్వహిస్తామని చెప్పారు.

05/08/2016 - 05:26

హైదరాబాద్, మే 7: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో జూలై 1 నుండి తరగతులు ప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. జూన్ 21లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌనె్సలింగ్ పూర్తి చేస్తామని, ఇంకా భారీ ఎత్తున సీట్లు మిగిలితే స్లయిడింగ్ లేదా స్లయిడింగ్‌తో పాటు కౌనె్సలింగ్‌కు ప్రయత్నిస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు.

05/08/2016 - 04:58

గుంటూరు, మే 7: అమరావతిలో సెక్రటేరియట్ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, మంత్రులకు విల్లాలు అద్దెకు తీసుకోవాలని ముందు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెయిన్ ట్రీ పార్కులో భవనాలు, విల్లాలు లీజుకు తీసుకునే పరిస్థితులులేవు. మంత్రులు విజయవాడ, గుంటూరులో కార్యాలయాలు, నివాసాలు చూసుకుంటున్నారు. అవసరమైతే రెయిన్ ట్రీ పార్కులో విల్లాలు లీజుకు తీసుకుంటారు.

05/08/2016 - 04:51

హైదరాబాద్, మే 7: కాంట్రాక్టు రావాలంటే టెండరు వేయాలి, టెండరు వేయాలంటే బిడ్డింగ్‌లో పాల్గొనాలి, తీరా బిడ్డింగ్ పూర్తయిన తర్వాత కూడా టెండరులో పాల్గొనని సంస్థకు కాంట్రాక్టు దక్కితే దానిని ఏమనాలా? ఇలాంటి వింత పోకడలకు ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ (ఐటిసి) పోతోంది. ఇ ప్రగతి ప్రాజెక్టుకు సంబంధించి ఎపిటిఎస్ ద్వారా టెండర్లు పిలిచారు.

05/08/2016 - 04:49

హైదరాబాద్, మే 7: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ రెసిడెన్షియల్ , డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల కోసం ఈ నెల 12న ఎపిఆర్‌జెసి , డీసీ సెట్-2016ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 320 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వీటిని నిర్వహిస్తారు.

05/08/2016 - 02:33

భద్రాచలం, మే 7: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా కటేకళ్యాణ్ పోలీసుస్టేషన్‌కు చెందిన బలగాలతో పాటు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. మార్జూన్ గ్రామ సరిహద్దు గుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.

05/08/2016 - 02:23

ఖమ్మం, మే 7: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి తమ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.

05/08/2016 - 01:53

హైదరాబాద్, మే 7: మహానగరంలోని వారికి ఇది చిన్న సమస్యగానే అనిపించవచ్చు కానీ, గ్రామాల్లో మాత్రం చిన్నగా కనిపించే ఓ పెద్ద సమస్య. కోతులు వందలకు వందలు ఊళ్లమీద పడుతున్నాయి. పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. చివరకు మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల్లో పర్యటించినప్పుడు పలు గ్రామాల వారు ఆయన దృష్టికి తీసుకు వచ్చిన సమస్య ఇది.

05/08/2016 - 01:51

హైదరాబాద్, మే 7: కృష్ణా నదిలో అడుగంటిన జలాలను తోడుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు కుస్తీ పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు చేరాలంటే మరో నాలుగైదు నెలలు పడుతుంది. అదీ నైరుతి రుతుపవనాలు చురుకుగా పనిచేసి మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రలో కుండపోత వర్షాలు కురిస్తేనే సాధ్యమవుతుంది.

Pages