S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/05/2016 - 05:42

హైదరాబాద్, మే 4: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2018 డిసెంబర్ నాటికే పూర్తవుతుందని లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి)కి చెందిన మెట్రోరైలు విభాగం తేల్చేసింది. ఈ ఏడాది జూన్ 2 నాటికి మెట్రో రైలు ప్రాజెక్టు కమ్మర్షియల్ అపరేషన్స్‌ను ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

05/05/2016 - 05:24

హైదరాబాద్, మే 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం నెమ్మదిగా మబ్బులను తొలగిస్తోంది. ప్రత్యేక హోదా ఆలోచనే కేంద్రానికి లేదని, అందుకు వీలుగా 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది.

05/05/2016 - 04:16

హైదరాబాద్/ విశాఖపట్నం, మే 4: తెలంగాణ, ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సజావుగా సాగేందుకు జగడాలు మానుకుని, సజావుగా చర్చించుకుందాం అంటూ తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు చేసిన ప్రతిపాదనకు ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. హరీశ్‌రావు బుధవారం దేవినేనికి ఫోన్ చేసి ప్రాజెక్టులపై మాట్లాడారు. హరీశ్‌రావుతో దేవినేని సుహృద్భావంగానే మాట్లాడారని తెలిసింది.

05/05/2016 - 05:54

హైదరాబాద్, మే 4: ‘కుళ్లు రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి. మీరు చేసే గోల నీళ్ల కోసమైతే, గోదావరిలో పుష్కలంగా ఉన్నాయి. వాటిని వాడుకునే తెలివి, తీసుకునే దమ్ముంటే సహకరిస్తాం. అంతేకానీ గిల్లి కజ్జాల కోసం లేచి కూర్చున్న బెబ్బులిని తట్టిలేపవద్దు’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

05/05/2016 - 04:08

హైదరాబాద్, మే 4: ఆంధ్రప్రదేశ్‌లో 25 మంది సీనియర్ ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. మరో ఐదుగురిని డిజిపికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఎ ఆర్ అనురాధను ప్రభుత్వం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆమె విజిలెన్స్ విభాగానికి పూర్తి అదనపు బాధ్యతలు సైతం నిర్వహించనున్నారు.

05/04/2016 - 08:24

హైదరాబాద్, మే 2: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) ఆధ్వర్యంలో మంగళవారం ఉపరితల బొగ్గు గనుల (ఓపెన్‌కాస్ట్) అధ్యయన యాత్రను ప్రారంభిస్తున్నట్టు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లో కొనసాగుతున్న దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

05/04/2016 - 08:22

మాచర్ల, మే 2: రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్న తరుణంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన రెడ్డి విమర్శించారు. సోమవారం గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన ‘కరవు దీక్ష’లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

05/04/2016 - 08:06

ప్రత్తిపాడు/డి.గన్నవరం, మే 3: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం సంభవించిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలావున్నాయి... ప్రత్తిపాడు మండలం రాచపల్లివద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం పెళ్లిబృందంతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని రాంగు రూటులో వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది.

05/04/2016 - 07:56

తిరుమల, మే 3: టిటిడికి విరాళాలు అందిస్తున్న దాతలకు పారదర్శకంగా సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఎస్‌ఎంఎస్ అలర్ట్ పంపేందుకు అప్లికేషన్ రూపొందించాలని టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమల్లోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

05/04/2016 - 07:51

హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృష్ణా నదిపై తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం వల్ల ఆంధ్ర రాష్ట్రం దాదాపు 150 టిఎంసి కృష్ణా జలాలను కోల్పోతుందని, దీని వల్ల రాయలసీమ, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడికాల్వ కింద సాగవుతున్న ఆయకట్టు ఎడారిలాగా మారుతుందని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

Pages