S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/08/2016 - 01:49

న్యూఢిల్లీ, మే 7: ఎస్సీ వర్గీకరణ సాధించేందుకు కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నెల 8 నుండి ఐదు రోజులపాటు జంతర్ మంతర్ వద్ద రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

05/08/2016 - 01:46

హైదరాబాద్, మే 7: కొత్తగా ఏర్పడే జిల్లాల సంఖ్యనే తప్ప పేర్లను ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక పోయినా కొత్త జిల్లాల వివాదాలు మొదలయ్యాయి. నగర శివారు ప్రాంతాలను భువనగిరిలో ఎలా కలుపుతారని కొందరు ఆందోళనకు దిగితే, ఆలేరును జిల్లా కేంద్రం చేయాల్సిందే అని కొందరు ఆందోళన చేస్తున్నారు. గద్వాలను జిల్లా కేంద్రం చేయాల్సిందే అని డికె అరుణ నాయకత్వంలో జిల్లాలో గతంలో ఆందోళన చేశారు.

05/08/2016 - 01:45

కర్నూలు/ కడప, మే 7: ఎన్నికల సమయంలోనే పార్టీలు, రాజకీయాలు, పట్టింపులని, ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ప్రతినిధులేనని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అభివృద్ధిని ఆమోదించే తెలుగుదేశం పార్టీలోకి పలువురు ఎమ్మెల్యే సోదరులు వస్తున్నారని పేర్కొన్నారు.

05/08/2016 - 01:43

హైదరాబాద్, మే 7: హైదరాబాద్‌ను ఐదు జిల్లాలుగా మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి.
1.సికిందరాబాద్ జిల్లా (సికిందరాబాద్, సికిందరాబాద్ కంటోనె్మంట్, సనత్‌నగర్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాలు)
2.హైదరాబాద్ ఈస్ట్ జిల్లా (్భవనగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట).

05/08/2016 - 01:42

హైదరాబాద్, మే 7: అసెంబ్లీ ఆవరణలో బ్యాంకు ఉన్నట్లే, వాటర్ బ్యాంకూ ఏర్పాటు చేశామని, దీంతో ఒక్క నీటి చుక్క బయటకు వెళ్లకుండా చూస్తామని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆవరణలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు, ఇదివరకే ఉన్న గుంతల మరమ్మతు పనులను శనివారం అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి, కౌన్సిల్ చైర్మన్ ఎ. స్వామిగౌడ్ లాంఛనంగా ప్రారంభించారు.

05/08/2016 - 01:39

కడప/కర్నూలు, మే 7: విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో శనివారం ఉద్యానరైతుల రుణ విమోచన పత్రాల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు విభజన కోరుకోలేదన్నారు.

05/08/2016 - 01:31

హైదరాబాద్, మే 7: మహిళలు, బాలికల రక్షణకు సంపూర్ణ భద్రత కల్పించే విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు ఒక్క ఫోన్ కొడితే చాలు తక్షణమే ఆదుకునే ‘్భరోసా’ను తాము కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ పోలీసు శాఖ ‘్భరోసా’ ఇస్తోందన్నారు.

05/08/2016 - 01:28

హైదరాబాద్, మే 7: తెలంగాణ ఎమ్సెట్‌ను ఈనెల 15న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, అవకతవకలు, అక్రమాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వి రమణారావు, కో-కన్వీనర్ ప్రొఫెసర్ కాశీవిశ్వనాథ్ గోర్తి తెలిపారు. ఎమ్సెట్ ఫలితాలను ఏప్రిల్ 27లోగా వెల్లడిస్తామని, వీలైతే నాలుగైదు రోజుల ముందే ఫలితాలు ఇస్తామన్నారు.

05/08/2016 - 01:21

కడప/ కర్నూలు, మే 7: కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను అన్ని రకాలుగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ప్రజలకు వివరించారు.

05/08/2016 - 01:17

కాకినాడ, మే 7: ఎంసెట్-2016 ఫలితాలను 9న విడుదల చేయడానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రం 11 గంటలకు విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలను, వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తారు.

Pages