S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/09/2016 - 08:52

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రజల నుంచి డిపాజిట్లను వసూలు చేసి వారి నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన రకరకాల గోల్డ్ సంస్థలు 11 వరకు ఉన్నాయి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడిన ఈ సంస్థల మూలాలు ఆంధ్ర, తెలంగాణ, కర్నాటకకు విస్తరించాయి.

04/09/2016 - 08:44

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్రంలో రాజకీయ పక్షాల పంచాంగాల తీరు తీరులో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా అధికార పక్షం పంచాగంలో అంతా భేష్ అన్నట్లు చెబితే విపక్షాల పంచాంగాలు కష్టాలను ఏకరవుపెట్టాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీల పంచాంగాల్లో తమకు సానుకూల పరిస్థితులున్నట్లు వేటికవి చెప్పుకొచ్చాయి. గతంలో ఉగాది రోజున రవీంద్ర భారతిలో మాత్రమే ప్రభుత్వ పరంగా పంచాగ పఠనం ఉండేది.

04/09/2016 - 08:37

హైదరాబాద్, ఏప్రిల్ 8: భారతదేశ చట్టాలను అమితంగా గౌరవించే వ్యక్తుల్లో తాను ఒకడినని, కోర్టులను గౌరవిస్తానని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసిన విషయం తెలిసి తాను స్వయంగా స్పందిస్తున్నట్టు చెప్పారు.

04/09/2016 - 08:36

హైదరాబాబాద్, ఏప్రిల్ 8: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వారి కుమారుల కారణంగా కష్టాలు ఎదురవుతాయని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. ఉభయరాష్ట్రాల్లో వర్షాలు ప్రథమార్థంలో కాకుండా ద్వితీయార్థంలో విస్తారంగా కురుస్తాయని ఆయన అన్నారు. ఈ ఏడాది ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని, ఉష్ణోగ్రతలు బాగా పెరగడంలో జననష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు.

04/09/2016 - 08:35

విజయవాడ, ఏప్రిల్ 8: అందరి కోసం ఒక్కడు కష్టపడితే సరిపోదు. ఆ కష్టపడుతున్న వాడికి, అందరూ చేయి చేయి అందిస్తే, బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోడానికి వీలుపడుతుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం చాగంటికి కళారత్న-హంస అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదానం చేశారు.

04/09/2016 - 08:34

విజయవాడ, ఏప్రిల్ 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయని ప్రముఖ పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ తెలిపారు. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు విజయవాడలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సంవత్సరం ప్రభుత్వ స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను ఆయన వివరించారు. దుర్ముఖి అన్న పదాన్ని వికృతిగా భావించనక్కర్లేదని అన్నారు.

04/08/2016 - 13:14

హైదరాబాద్, ఏప్రిల్ 7: వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

04/08/2016 - 13:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో ఈ నెల 18 తేదీనాడు ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల కేసు విచారణకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అవుతుందని ఆయ న తెలిపారు.

04/08/2016 - 12:47

హైదరాబాద్, ఏప్రిల్ 7: దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద మార్కెట్‌లతో తెలంగాణలోని మార్కెట్‌లను అనుసంధానం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 250 వ్యవసాయ మార్కెట్‌లను గుర్తించి, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్‌తో అనుసంధానిస్తున్నారు. వాటిలో 44 తెలంగాణ వ్యవసాయ మార్కెట్లు ఉండటం గమనార్హం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న ప్రధానమంత్రి మోదీ మార్కెట్ల అనుసంధాన ప్రక్రియను స్వయంగా ప్రారంభిస్తారు.

04/08/2016 - 12:51

హైదరాబాద్, ఏప్రిల్ 7: రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 3,061 కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.

Pages