S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/10/2016 - 04:34

హైదరాబాద్, ఏప్రిల్ 9: అద్దె ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ నగదును తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపుడి దంపతులపై ఇరాన్‌కు చెందిన ఓ మహిళ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇరాన్‌కు చెందిన డాక్టర్ ఫాతిమా బేగంపేట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

04/10/2016 - 03:56

హైదరాబాద్, ఏప్రిల్ 9: పేదల న్యాయ ప్రయోజనాలకు లోక్ అదాలత్‌లు కీలకమని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. సదస్సులో మాట్లాడుతూ లోక్ అదాలత్‌లతో ఇరు పక్షాలకు వివాదరహిత సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో లోక్ అదాలత్ కోసం శాశ్వత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. పెండింగ్ కేసులతో ఒత్తిడికి గురవుతున్న న్యాయస్థానాలు, లోక్ అదాలత్‌తో ఉపశమనం పొందుతున్నాయన్నారు.

04/10/2016 - 03:54

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన రెవెన్యూ కంటే ఎక్కువగా సాధించినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ ఆర్‌వి చంద్రవదన్‌ను అభినందించారు. 2015-16 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ నుంచి 11,707.04 కోట్ల రెవెన్యూను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 104.14 శాతం ఎక్కువ రెవెన్యూ సాధించారు.

04/10/2016 - 03:54

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఒడిశా కేడర్ 1986వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వర రావు కొత్త సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన నాగేశ్వరరావు సుదీర్ఘకాలం భువనేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉన్నతాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్ సిబిఐ జెడిగా పదోన్నతి పొందారు.

04/10/2016 - 03:52

ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు 90వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
విపక్షాలది అవగాహన లేని విమర్శ ప్రజలతో ముఖాముఖిలో సిఎం కెసిఆర్
---

04/10/2016 - 03:50

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా సంస్థల ఆర్థిక, సాంకేతిక సహకారం తీసుకుంటామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. చైనా నీటి ప్రాజెక్టులు, అక్కడి సాంకేతిక పరిజ్ఞానం, ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంభిస్తున్న పద్ధతుల అధ్యయనానికి ఇంజనీరింగ్ నిపుణులను పంపేందుకు సిఎం నిర్ణయించారు.

04/10/2016 - 01:21

మదనపల్లె, ఏప్రిల్ 9: హంద్రీ-నీవా ప్రాజెక్టు టనె్నల్ పనులు నత్తనడకన కాకుండా వేగం పెంచండి, రోజుకు 16 మీటర్లు కాకుండా 24 మీటర్ల చొప్పున తవ్వకాలు జరిపి, 90 రోజులలో పూర్తిచేయాలని, ఆలస్యం చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కూడా అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు.

04/10/2016 - 01:19

ఒంగోలు, ఏప్రిల్ 9: ప్రకాశం జిల్లా రాపర్ల రైల్వేస్టేషన్ సమీపంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లలో శుక్రవారం రాత్రి దొంగలు దోపిడికి పాల్పడ్డారు. ఒంగోలు రైల్వే జిఆర్‌పి సిఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. 15మంది దొంగలు నారాయణాద్రి ఏసి బోగీలో ఎక్కారు. రైలు రాపర్ల రైల్వేస్టేషన్ సమీపానికి రాగానే చైన్‌లాగి దోపిడీకి పాల్పడ్డారు.

04/10/2016 - 04:11

ఖమ్మం, ఏప్రిల్ 9: రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా నష్టపోయిన భద్రాచలం డివిజన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ నెల 13వ తేదీన పర్యటించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ముంపు ప్రాంతాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు.

04/10/2016 - 01:08

శెట్టూరు, ఏప్రిల్ 9: బోరు లారీ దూసుకెళ్లి నలుగురు మృతి చెందిన దుర్ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో చోటుచేసుకుంది. పర్లచేడు గ్రామానికి చెందిన గురురాజ్ పొలంలో బోరు వేయించేందుకు శుక్రవారం రాత్రి బోరు లారీని పిలిపించారు. బోరు వేయిం చే సమయంలో సమీప పొలంలోని రైతులు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు బోరు తవ్వే పని సాగటంతో అక్కడికి సమీపంలోనే కొందరు రైతులు నిద్రపోయారు.

Pages