S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/01/2018 - 13:45

అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు రూపొందించి, రాయితీలు సకాలంలో ఇస్తున్నాం అని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తాడేపల్లిలోని ఇన్ఫోసైట్‌ భవనంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో 10 ఐటీ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి లోకేశ్‌ పాల్గొని మాట్లాడారు.

08/01/2018 - 13:43

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో లక్షా నూట పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఇందిరాపార్కు కూడలి వద్ద కదంబ మొక్కను సీఎం నాటారు. వరంగల్‌ జిల్లా తిమ్మాపూర్‌లో బెస్తాం చెరువు వద్ద ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటారు.

08/01/2018 - 12:51

అమరావతి: గ్రామదర్శినపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ పనులు ఆగకుండా చూడాలని అన్నారు. ప్రత్యేక అధికారులను నియమించాలని, గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

08/01/2018 - 02:40

తిరుపతి, జూలై 31: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి ఎస్పీ అభిషేక్ మహంతితో కలిసి అన్ని విభాగాల అధికారులతో టీటీడీ ఇఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/01/2018 - 02:36

హైదరాబాద్, జూలై 31: ప్రముఖ పర్యావరణవేత్త వనజీవి రామయ్య, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌లు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను గవర్నర్ నరసింహన్ స్వీకరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో మొక్కలు నాటారు. ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా గవర్నర్ పిలుపు నిచ్చారు.

08/01/2018 - 05:21

విశాఖపట్నం/ఎస్.రాయవరం, జూలై 31: ‘పనిచేయడంలో నేను పెద్ద కూలీని. నిద్రించే సమయం తప్ప మిగిలిన సమయమంతా కష్టపడుతూనే ఉంటా. అందుకే నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ముందుటా’నని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడలో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

08/01/2018 - 05:28

* రాష్ట్ర పరిధి అంశం కాదనే అన్నా * అధికారంలోకి వస్తే రూ.10 వేల కోట్లు

08/01/2018 - 05:26

విజయవాడ, జూలై 31: రాజధాని అమరావతి ఐటీ హబ్‌గా మారనుంది. ఇప్పటికే అనేక కంపెనీలు రాజధాని పరిధిలో కొలువు తీరగా, మరో 10 కంపెనీలు తమ కార్యకలాపాలను బుధవారం నుంచి ప్రారంభించనున్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 100 ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీల్లో 5 వేల మంది వరకూ పని చేస్తున్నారు. తాడేపల్లిలోని ఇన్ఫోసైట్ భవనంలో బుధవారం 10 కొత్త ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి.

08/01/2018 - 02:12

కర్నూలు, జూలై 31: కర్నూలు నగర శివారులో మంగళవారం భారీ పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..పొలంలోని కంపచెట్లను తొలగించి మంట పెట్టగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. బాంబులు పేలినట్లు అనుమానిస్తున్నారు.

08/01/2018 - 01:51

హైదరాబాద్, జూలై 31: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకమండళ్ల ఐదేళ్ల కాలపరిమితి బుధవారంతో ముగుస్తుండటంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మాజీలవుతున్నారు. 2013 లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రంలోని 8384 మంది సర్పంచ్‌ల పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. గురువారం నుండి ఈ సర్పంచ్‌లంతా మాజీ సర్పంచ్‌లుగానూ, వార్డుసభ్యులు మాజీ వార్డు సభ్యులుగా మారబోతున్నారు.

Pages