S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/01/2018 - 22:44

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టవంతం చేసే దిశగా పార్లమెంటులో చర్చ పెట్టాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, దళిత నాయకురాలు సావిత్రి బాయి ఫూలే డిమాండ్ చేశారు. దళితుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని, అందుకు అనుగుణంగా వారి అవసరమైన విప్లవాత్మక చర్యలు తీసుకునే దిశగా చొరవ చూపాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

08/01/2018 - 21:44

హైదరాబాద్, ఆగస్టు 1: జంటనగరాల్లో ఏదోఒక ప్రాంతంలో మానవ అక్రమ రవాణాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ముఖ్యంగా మహిళలు, పిల్లలు అప్రత్తంగా ఉండాలని తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి నగర పౌరులకు సూచించారు. ఇలాంటి సంఘటన పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పటకీ గల్లీల్లో జరుగుతున్న సంఘటనలను పోలీసుల దృష్టికి స్థానిక మహిళలు, పిల్లలు సమాచారం అందివ్వాలని ఆయన కోరారు.

08/01/2018 - 21:43

హైదరాబాద్, ఆగస్టు 1: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు వెంటనే అనుమతి మంజూరు చేయాలని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రధానకార్యదర్శి ఎస్‌వీసీ ప్రకాష్ కోరారు. ఈ మేరకు ఆయన దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రికి ఒక వినతి పత్రం అందజేశారు. దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని దోస్త్ కన్వీనర్ వారికి హామీ ఇచ్చారు.

08/01/2018 - 21:42

హైదరాబాద్, ఆగస్టు 1: బీసీలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 7న ముంబాయ్‌లో ఒబీసీ జాతీయ మహా సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, ఉపాద్యక్షుడు గుజ్జ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. విరోభా లక్ష్మీ తెలిపారు.

08/01/2018 - 21:35

హైదరాబాద్, ఆగస్టు 1: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుటుంబం ఇప్పుడు అంబానీ, ఆదానీలతో పోటీ పడుతున్నదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఈ విధంగా, ఇంత స్థాయిలో అవినీతికి పాల్పడలేదని ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు.

08/01/2018 - 21:34

హైదరాబాద్, ఆగస్టు 1: తెలుగు రాష్ట్రాల్లోనే ప్రైవేటు విద్యాసంస్థలు అధికంగా ఉన్నాయని, ఎక్కువగా ఆ రెండు రాష్టల్ర విద్యార్ధులూ ప్రైవేటు విద్యపై ఆధారపడుతున్నారని అఖిల భారత ఉన్నత విద్య సర్వేలో తేలింది. ఏఐఎస్‌హెచ్‌ఈ 2017-18 సర్వేను కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం దేశంలో 903 యూనివర్శిటీలు, 39,050 కాలేజీలు ఉన్నాయి.

08/01/2018 - 21:33

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో గురువారం నుండి ‘ప్రత్యేక పాలన’ ప్రారంభమవుతోంది. పాత గ్రామ పంచాయతీలతో పాటు, కొత్త పంచాయతీలకు కూడా ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. మండలస్థాయి అధికారులను పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా (స్పెషల్ ఆఫీసర్లు) గా నియమించారు. కొన్ని చోట్ల తహశీల్‌దారులను, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను (గిర్దావర్) స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.

08/01/2018 - 17:38

హైదరాబాద్: రైతుబంధు పథకం అంటూనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుకు సంకెళ్లు వేస్తుందని కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. ఆయన బుధవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ..పాస్‌బుక్ అడిగిన పాపానికి హుజురాబాద్‌లో రైతు రాజయ్యకు సంకెళ్లు వేశారని అన్నారు. రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

08/01/2018 - 13:50

విజయవాడ: విశాఖరైల్వేజోన్‌ను, కడప ఉక్కు పరిశ్రమను అడ్డుకుంటుంది టీడీపీ అని బీజేపీ శాసనసభ నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఆయన బీజేపీ కోర్ కమిటీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గన్నవరంలో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగు డివిజన్లను కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని అన్నారు. దీనిపై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు.

08/01/2018 - 13:46

నెల్లూరు: కలువాయి మండలంలోని బాలాజీరావు పేట గ్రామంలో నాలుగేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడి తండ్రితో గతంలో అక్రమ సంబంధం ఉన్న రత్నమ్మ అనే మహిళ బాలుడిని గొంతు నులిమి చంపేసింది.గోనె సంచిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Pages