S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/13/2018 - 00:14

గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవడంతో ట్యాంక్ బండ్ వద్ద
ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద జాతీయ పతాకం తడిసి ముద్దయింది.
దీనిని ఇలాగే ఉంచితే, మరింతగా నానిపోయి, బరువుపెరిగి దెబ్బతినే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో
అధికారులు గురువారం ఈ పతాకాన్ని కిందకు దించారు.

07/13/2018 - 01:09

విజయవాడ, జూలై 12: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా అంగన్‌వాడీలు పని చేయాలని, అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరి ప్రజలకు మేలు చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన అంగన్‌వాడీల అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి గర్భిణులకు సీమంతం నిర్వహించి వారికి పసుపు, కుంకుమ, గాజులు, చీరను అందించారు.

07/13/2018 - 00:59

తాడిపత్రి: ఉక్కు కర్మాగారంలో విషవాయువులీక్ కావడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని గెర్డౌ ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆరుగురు కార్మికులు టనె్నల్‌లోనే మృతి చెందడం గమనార్హం. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం మోగకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

07/12/2018 - 16:53

విజయవాడ: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో అల్పపీఢనం ఏర్పడే అవకాశం ఉన్నందున కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని, తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లవద్దని పేర్కొంది.

07/12/2018 - 16:52

నిర్మల్: జిల్లాలోని కడెం నారాయణ జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగటంతో జలాశయంలోకి 13,109 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మూడు గేట్లు తెరచి 25 వేల క్యూసెక్కులను కిందకు వదలివేస్తున్నారు. జలాశయం నీటి సామర్థ్యం 700 అడుగులు కాగా 697.425 అడుగుల క్యూసెక్కులు వచ్చి చేరుతుంది.

07/12/2018 - 16:48

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర గోదావరి జిల్లాల్లో ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్నది. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నందున పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన తన పోరాట యాత్రను ప్రారంభించనున్నారు.

07/12/2018 - 16:45

హైదరాబాద్: రిజర్వేషన్ లేని ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూటీఎస్ మొబైల్ యాప్‌ను గురువారంనాడు దక్షిణ మధ్య రేల్వే జీఏం వినోద్‌కుమార్ విడుదల చేశారు. జూలై 16 నుంచి ఈ యాప్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ యాప్ ద్వారా ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్టు కూడా బుక్ చేసుకోవచ్చని అన్నారు.

07/12/2018 - 13:26

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, చంపాపేటతో పాటు పలు చోట్ల ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, శాలిగౌరారం, ఎల్కారంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది.

07/12/2018 - 12:59

వరంగల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కాల్పుల్లో మృతిచెందిన శరత్ మృతదేహం కరీమాబాద్‌కు చేరుకుంది. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శరత్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత పరామర్శించి శరత్ పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

07/12/2018 - 12:56

గుంటూరు: గుంటూరులో సీపీఎం కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అరెస్టు చేసినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు.

Pages