S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/02/2018 - 01:53

ఖమ్మం, జూలై 1: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు పనులను వేగంగా నిర్వహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వద్ద గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా వినియోగంలోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత రూ.

07/02/2018 - 01:10

ఆర్మూర్, జూలై 1: నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్‌ఎస్ గడీల పాలనను కూల్చి గరీబోళ్ల రాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. గడీల రాజ్యం లో మంత్రులు, ఎమ్మెల్యేలకు కలిసే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు జన చైతన్య యాత్ర రాగా స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.

07/02/2018 - 01:28

హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో 18,428 ఉద్యోగాలకు 7,19,840 దరఖాస్తులు అందాయని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. అందిన దరఖాస్తుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అధికంగా ఉన్నాయని తెలిపారు. జూన్ 30 అర్ధరాత్రి 12 గంటలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపే గడువు ముగిసింది. దీంతో ఏఏ పోస్టులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే సమగ్ర వివరాలను ఆయన

07/02/2018 - 01:08

హైదరాబాద్, జూలై 1: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుతో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ సమావేశం జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఊతమిచ్చినట్టయింది. జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహగానాలు జరుగుతున్న సమయంలో వారి రాజకీయ మంతనాలు ప్రాధాన్యతను సంతరించుకున్నయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామి రెడ్డి మనుమడు అనిరుథ్ వివాహాం ఆదివారం నగరంలో జరిగింది.

07/02/2018 - 00:41

హైదరాబాద్, జూలై 1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఇటీవల ఇన్‌ఛార్జీగా నియమితులైన ఏఐసీసీ నాయకుడు ఉమెన్ చాందీ ఆంధ్రలో కాంగ్రెస్‌కు జీవం పోసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. తొలి అడుగుగా వివిధ కారణాలతో పార్టీనీ వీడిని వారిని తిరిగి పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు ‘ఆకర్ష్ స్వగృహ’ చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ గవర్నర్ కె.

07/02/2018 - 00:37

విజయవాడ, జూలై 1: రాష్ట్రంలో స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాల వినియోగాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. త్వరలో ఈమేరకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేయనున్నామని, ప్రతిఒక్కరూ ఇంధన సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆదివారం ఆయన ఇంధన శాఖ మంత్రి, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/01/2018 - 23:52

కడప, జూలై 1 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవరూ ఊహించని విధంగా ‘కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాష్ట్ర ప్రజలందరి అభీష్టంగా మార్చడం రాయలసీమ వాసులకు సంతోషకరమే అయినా, ముఖ్యమంత్రి ప్రకటనపై నిపుణుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు భూమి, నీరు, రవాణా మార్గాలకు కడప జిల్లా అనుకూలమే.

07/01/2018 - 05:32

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 1,84,157 మందికి సీట్లు కేటాయించారు. ఇందులో అమ్మాయిలు 1,00,743 మంది కాగా, అబ్బాయిలు 83,414 మంది మాత్రమే. తొలి దశలో 79,528 మంది, రెండో దశలో 47,335 మంది సీట్లను ధృవీకరించగా, మూడో దశలో 57,294 మందికి సీట్లు కేటాయించారు. మూడోదశలో కొత్తగా సీట్లు పొందిన వారు 44,106 మంది కాగా అందులో అమ్మాయిలు 20,435 మంది కాగా, అబ్బాయిలు 23681 మంది ఉన్నారు.

07/01/2018 - 05:14

విశాఖపట్నం, జూన్ 30: మా పార్టీ అధినేత ఆదేశిస్తే టీడీపీ ఎంపీలంతా తక్షణమే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, కడప ఉక్కు సహా విభజన హామీల అమలు కోరుతూ టీడీపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.

07/01/2018 - 04:38

విశాఖపట్నం, జూన్ 30: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడదామనుకున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ సాధ్యపడే అవకాశాలు కనిపించడంలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పథకం ప్రయోగంతోనే సరిపెట్టాల్సి వస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆర్థికపరమైన అంశంతో కూడుకున్నదిగా మారింది.

Pages